Bigg Boss Telugu 7: ఈవారం ఆమే ఎలిమినేట్ అవుతుందని పసిగట్టిన స్పై బ్యాచ్.. ఫ్లోలో నిజం చెప్పేసిన యావర్?
హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్ తో వచ్చి... ఎవరూ ఊహించని స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన రెస్పాన్స్ తో అందరినీ షాకై షేకయ్యేలా చేస్తున్న ఈ షోకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. రాత్రి 9 గంటలు అయిందంటే చాలు టీవీల ముందు వాలిపోయి ఈ షోను చూసేస్తున్నారు. తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ నచ్చని వారు ఎలిమినేట్ అయిపోతే బాగుండు అని కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే 13 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో 14వ వారంలోకి అడుగు పెట్టింది.
అయితే ఈ వారం ఒక్క అంబటి అర్జున్ తప్ప అంతా నామినేషన్స్ లో ఉన్నారు. శోభాశెట్టి, అమర్ దీప్, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శివాజిలు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఎవరెవరు టాప్ 5కి వెళ్తారా అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా తమకు నచ్చిన కంటెస్టెంట్ ను కాపాడుకోవడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారని ఓటింగ్ లిస్ట్ చూస్తున్న బయట వాళ్లకంటే ఇంట్లో వాళ్లే మరింత ఆసక్తిగా ఉన్నారు.

ముఖ్యంగా ఎప్పుడూ మస్త్ మస్త్ స్ట్రాటెజీలు ప్లే చేస్తూ... అందరి చేత మంచి వాడు అనిపించుకుంటున్న శివాజి అండ్ గ్యాంగ్ అయితే ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కరెక్ట్ గా గెస్ చేసింది. కానీ ఆ మాటను మాత్రం బయటకు చెప్పలేదు. కానీ వారు ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారో తనకు పూర్తిగా అర్థం అయిపోయిందంటూ శోభాశెట్టి.. ప్రియాంక జైన్ తో మాట్లాడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఓటింగ్ అప్పీల్ టాస్క్ లో శోభాశెట్టి, యావర్ లు చివరి వరకూ వచ్చారు.
ఈక్రమంలోనే పల్లవి ప్రశాంత్, శివాజిలు... ప్రిన్స్ యావర్ కు లైక్ కొట్టి, శోభాశెట్టికి అన్ లైక్ కొట్టారు. కానీ అంబటి అర్జున్, ప్రియాంక జైన్, అమర్ దీప్ లు మాత్రం అంతా ఊహించినట్లుగానే శోభాశెట్టికి లైక్ కొట్టి యావర్ కు డిస్ లైక్ కొట్టాడు. అయితే ఓటింగ్ పరంగా శోభాకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆమెనే ఓటింగ్ అప్పీల్ చేసుకుంది. ఈక్రమంలోనే టాప్ 2 బాటమ్ లో తనే ఉందంటూ ఆమె స్నేహితులే చెప్పడంతో ఆమె ఫుల్ ఫీల్ అయింది. నేనే చివర్లో ఉన్నానని మీకెలా తెలుసంటూ ఫ్రెండ్స్ పైనే అగ్రెసివ్ అయింది.

అయితే ఆ సమయంలో శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లు లోలోపల నవ్వుకున్నారని శోభాశెట్టి.. ప్రియాంక జైన్ తో చెప్పింది. వాళ్ల మొహాలు వెలిగిపోయాయి.. నేనే ఈ వారం వెళ్లిపోతానని వాళ్లు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇది వీళ్లు డిసైడ్ చేయలేరు... బయట ఉన్న ఆడియన్స్ మాత్రమే దాన్ని డిసైడ్ చేస్తారంటూ చెప్పుకొచ్చింది. అందుకు ప్రియాంక జైన్ కూడా వత్తాసు పలికింది. అయితే ఈ వారం శోభానే ఎలిమినేట్ అవుతుందని.. కేవలం ప్రశాంత్, శివాజి, యావర్ లకు మాత్రమే కాకుండా మిగతా ఇంటి సభ్యులకు కూడా తెలుసు. ఆ విషయాన్ని వాళ్లు ఓటింగ్ అప్పీల్ అప్పుడు చెబితే తీసుకోలేకపోయింది. చూడాలి మరి ఏం జరగనుంది, ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాకనున్నారనేది.



Click it and Unblock the Notifications











