సీరియల్ నటి శ్రావణి సూసైడ్ లో మరో ట్విస్ట్ ఇచ్చిన తల్లి.. చనిపోయే ముందు ఫోన్ కాల్

ప్రముఖ సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసు తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది. ఇటీవల తన ఇంట్లోనే బాత్రూమ్ లో శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ హాట్ టాపిక్ గా మారుతోంది. పోలీసులు కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకొని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

చనిపోయే ముందు ఫోన్ కాల్

చనిపోయే ముందు ఫోన్ కాల్

టిక్ టాక్ ద్వారా పరిచయమైన దేవ్ రాజ్ కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా శ్రావణి తల్లి రత్నం మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకున్న తన కూతురు చనిపోయే ముందే ఒక ఫోన్ కాల్ చేసిందని తెలిపింది.

పెళ్లి చేసుకోనని చెప్పడంతో

పెళ్లి చేసుకోనని చెప్పడంతో

ఆమె మాట్లాడుతూ.. అవును నా కూతురు శ్రావణి చనిపోవడానికి ముందు దేవ్ రాజ్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. పోన్ లో అతనితో మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని ఆడిగింది. కానీ అందుకు దేవ్ రాజ్ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన నా కూతురు ప్రాణాలు తీసుకుంది.. అంటూ శ్రావణి తల్లి వివరణ ఇచ్చింది.

ఎంతగానో టార్చర్ చేశాడు

ఎంతగానో టార్చర్ చేశాడు

అదే విధంగా దేవరాజ్ కి చాలా సార్లు శ్రావణి ఆర్థిక సహాయం చేసింది. ఖర్చులన్ని కూడా తనే భరించేది. కానీ దేవరాజ్ మాత్రం ఆమెను హింసించాడని ఎంతగానో టార్చర్ చేశాడని కూడా శ్రావణి తల్లి తెలియజేసింది. ఇక శ్రావణి సూసైడ్ మిస్టరీపై పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.

Recommended Video

TV Actress Sravani కేసులో ట్విస్ట్, DevaRaj Reddy వెర్షన్ ఇదీ ! || Oneindia Telugu
 దేవరాజ్, సాయిని.. ఒకేసారి

దేవరాజ్, సాయిని.. ఒకేసారి

వీలైనంత త్వరగా క్లారిటీ వచ్చే విధంగా కేసును ప్రత్యేకంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పటికే దేవరాజ్ ని అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన పోలీసులు ఈ రోజు శ్రావణికి సన్నిహితంగా ఉండే మరో వ్యక్తి సాయిని కూడా విచారిస్తున్నారు. ఇక దేవరాజ్, సాయిని కూడా ఒకేసారి విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X