Bigg Boss OTT: షోలోకి బన్నీకే షాకిచ్చిన బ్యూటీ ఎంట్రీ.. అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోందిగా!

బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే సూపర్ హిట్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. దేశంలోని ఎన్ని భాషల్లో ప్రసారం అవుతుందో.. అన్ని చోట్లా విజయాన్ని అందుకుంది. అయితే, తెలుగులో మాత్రం అన్నింటి కంటే ఎక్కువ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని.. దేశంలోనే నెంబర్ వన్ షోగా పేరు సంపాదించుకుంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మరో కంటెస్టెంట్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఓటీటీ వెర్షన్‌తో రాబోతున్నారు

ఓటీటీ వెర్షన్‌తో రాబోతున్నారు

మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగులో మాత్రమే బిగ్ బాస్‌కు ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ అందిస్తున్నారు. అందుకే మన దగ్గర ఇది సూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు సరికొత్తగా ఓటీటీ వెర్షన్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని నిర్వహకులు ప్రకటించారు. దీన్ని కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

అందులో 24 గంటల ప్రసారం

అందులో 24 గంటల ప్రసారం

హిందీ నిర్వహకులు గత ఏడాది బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను ప్రసారం చేశారు. అక్కడ ఇది విజయవంతం అయింది. దీంతో ఇప్పుడు తెలుగులోకి కూడా పరిచయం చేయబోతున్నారు. అయితే, దీన్ని బిగ్ బాస్ సీజన్ మాదిరిగా టీవీలో కాకుండా కేవలం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే ప్రసారం చేస్తారు. అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేయనున్నారు.

బిగ్ బాస్ ఓటీటీ పనులు ఇలా

బిగ్ బాస్ ఓటీటీ పనులు ఇలా

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి చివరి వారం నుంచి మొదలు కానుంది. దీంతో ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను ముమ్మరం చేసేశారు. ఇందులో సెట్ వర్క్‌ను దాదాపుగా పూర్తి చేసేశారని తెలిసింది. ఐదో సీజన్ హౌస్‌కు కొన్ని మార్పులు చేసి దీన్ని నిర్మిస్తున్నారు. అలాగే, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా చివరి దశకు చేరినట్లు ప్రచారం జరుగుతోంది.

డేట్, కంటెస్టెంట్లు వివరాలివే

డేట్, కంటెస్టెంట్లు వివరాలివే

బుల్లితెర వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతుందట. ఇది మొత్తం 82 రోజుల పాటు సాగనుందని అంటున్నారు. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసింది. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ అయిందని టాక్.

 కంటెస్టెంట్లలో వాళ్లు ఉన్నారు

కంటెస్టెంట్లలో వాళ్లు ఉన్నారు

మరికొన్ని రోజుల్లోనే అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా చూస్తున్నారు. అదే సమయంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కూడా ఎదురు చూస్తున్నారు. ఇక, ఇందులో చాలా మంది మాజీ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. ఇందుకోసం పాత కంటెస్టెంట్లతో పలువురిని ఎంపిక కూడా చేశారని సమాచారం.

షోలోకి హాట్ యాంకర్ ఎంట్రీ

షోలోకి హాట్ యాంకర్ ఎంట్రీ

తెలుగు బుల్లితెరపై తొలిసారి సరికొత్త హంగులతో ఎంతో ప్రయోగాత్మకంగా ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు సరికొత్త ప్లాన్లతో ముందుకొస్తున్నారు. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపికపై బాగా ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే హాట్ యాంకర్ స్రవంతి చొక్కారపును తీసుకున్నారట.

అల్లు అర్జున్‌కే షాకిచ్చిందిగా

అల్లు అర్జున్‌కే షాకిచ్చిందిగా

చాలా కాలం క్రితమే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. యాంకర్‌గా మారిన స్రవంతి చొక్కారపు వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల 'పుష్ప' టీమ్‌తో ఇంటర్వ్యూ చేసిన సమయంలో రాయలసీమ యాసలో మాట్లాడి బన్నీకే షాకిచ్చింది. ఇక, ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోంది. దీంతో ఆమె బిగ్ బాస్ ఎంట్రీ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X