Bigg Boss NonStop: వస్తూనే షాకులు మీద షాకులు ఇచ్చిన స్రవంతి.. రెండు సార్లు పెళ్లి అంటూ!
బిగ్ బాస్ నాన్ స్టాప్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే రెండు టీములు గా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఉంటారు అని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సీజన్లకి సంబంధించిన కంటెస్టెంట్ లు వారియర్స్ గా, కొత్తగా వచ్చే వారు చాలెంజర్స్ గా పిలవబడతారు అంటూ నాగార్జున ప్రకటించారు. అందులో భాగంగా మొదట అషు రెడ్డి, ఆ తర్వాత మహేష్ విట్టా, ఆ తర్వాత ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇవ్వగా నాలుగో హౌస్ మేట్ గా అజయ్ కుమార్ కతుర్వార్ అనే హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మరో చాలెంజర్ గా యాంకర్ స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందే షాక్
ముందు నుంచి స్రవంతి గురించి తెలుగు సినీ పరిశ్రమ లో ఎవరికీ పెద్దగా తెలియదు కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూనే ఆమె అనుకోని షాక్ ఇచ్చింది. ముందు నుంచి ఆల్ హాట్ ఫోటో షూట్ లు చూసి ఆమెకు వివాహం కాలేదని ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో అవకాశాలు కోసం ఎదురు చూస్తుంది అని అందరూ భావించారు.

రెండు సార్లు పెళ్లి
కానీ ఆమె ఆమె తనకు వివాహం జరిగిందనే విషయాన్ని నాగార్జునతో పాటు వేదిక మీద ఉండగానే ప్రకటించింది. నీ గురించి ప్రపంచానికి తెలియని విషయం ఏదైనా చెప్పమని నాగార్జున అడిగితే తనకు రెండు సార్లు వివాహం అయిందని చెప్పుకొచ్చింది ఆమె. అదేమిటి అని అడిగితే తాను ప్రేమించి పారిపోయి ఒకసారి పెళ్లి చేసుకున్నామని ఒప్పుకున్న తర్వాత మరోసారి వివాహం జరిగిందని ఆమె పేర్కొంది.

సగర్వంగా చెప్పుకునే విధంగా
తాను అనంతపురం జిల్లా కదిరి అని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన అమ్మాయిని అని ఆ అబ్బాయి మాత్రం తెలంగాణ అబ్బాయి అని చెప్పుకొచ్చింది. నేను నచ్చక పోవడం కాదు కానీ కులాలు వేరు కావడంతో మొదటి వివాహం చేయడానికి ఇబ్బంది పడ్డారు కానీ వాళ్ల ఇంటి పేరుని సగర్వంగా చెప్పుకునే విధంగా చేయడంలో తాను గర్వపడుతున్నానని అని ఆమె చెప్పుకొచ్చింది.

యూట్యూబ్ యాంకర్ గా
ఇక యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె అనతికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. అలా ఈ టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా కనిపిస్తూ వచ్చిన ఆమె బెస్ట్ ఆఫ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా కూడా ఎంపికయింది. నిజానికి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఆమె కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తుందని భావించారు కానీ ఎందుకో కానీ చివరి నిమిషంలో ఆమె ఎంట్రీ ఇవ్వలేదు.

ఎమోషనల్
ఇక తన భర్త పేరు ప్రశాంత్ అని తనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు అని స్రవంతి వెల్లడించింది. స్రవంతికి సర్ప్రైజ్ అని చెప్పిన నాగార్జున ఆమె భర్త కుమారుడు మాట్లాడుతున్న వీడియో ప్లే చేసి చూపించారు. వీడియోలో వారు చెప్పిన మాటలు విని ఆమె చాలా ఆనంద పడింది. ఎలా అయినా కంటెస్టెంట్ గా నిలబడి ఫిమేల్ కంటెస్టెంట్ గా గెలిచి బయటకు వెళ్లాలని తన అభిలాష అని స్రవంతి పేర్కొంది.


Click it and Unblock the Notifications











