Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ యాంకర్ కూడా మొదలెట్టిందిగా… ఏమీ లేకుండా పూలు అడ్డుపెట్టి హాట్ ఫోటో షూట్!
టీవీ యాంకర్స్ అంటే ఒకప్పుడు నిండుగా చీర కట్టుకుని, లేదా చుడీదార్ వేసుకుని ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించేవారు. కానీ మారుతున్న ట్రెండ్ ను బట్టి ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్న భామలు హాట్ హాట్ డ్రస్సులు వేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఇప్పటికే ఈ కోవలో శ్రీముఖి, విష్ణుప్రియ, వర్షిని, అనసూయ, రష్మి గౌతమ్ సత్తా చూపిస్తుంటే తాను సైతం ఈ రంగంలో నిలబడాలని ప్రయత్నిస్తోంది ఒక హాట్ యాంకర్. ఆమె ఎవరు అనే వివరాల్లోకి వెళితే..
హాట్ హాట్ ఫొటోలతో సెగలు రేపుతోన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్
శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇమ్మానియేల్ తో
ఈ టీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ప్రసారమైన అదుర్స్ షో లాగానే ఇందులో కూడా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఉన్న టాలెంటెడ్ వ్యక్తులను గుర్తించి ఈ షోలో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. అది మాత్రమే కాక సుడిగాలి సుధీర్ సహా జబర్దస్త్ టీం సభ్యులు వర్ష, ఇమ్మానియేల్ లాంటి వాళ్ళతో కాస్త కామెడీ కూడా చేస్తున్నారు.
వెతికి మరీ తీసుకువచ్చి
అలా ఈ షోలోకి అనేక అందమైన భామలను కూడా తీసుకువచ్చారు. అలా వచ్చిన ఈ భాగమే స్రవంతి చొకారపు, సోషల్ మీడియాలో, మీడియాలో మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ భామను ఈ టీవీ వాళ్ళు వెతికి మరీ తీసుకువచ్చి అవకాశం ఇచ్చారు. మీరు గమనిస్తే ఇమ్మానియేల్ ను ఫ్లర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తున్న అమ్మాయిగా ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీలో అనేక సార్లు కనిపించింది.
యూట్యూబ్ యాంకర్ గా
ఈటీవీలో అవకాశం దక్కడంతో స్రవంతి చొకారపు ఇప్పుడు డు మరిన్ని అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ ప్రేక్షకులను తన అభిమానులను అలరిస్తోంది. యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన స్రవంతి చొకారపు మాటీవీ, జెమిని టీవీ వంటి వాటిలో సైతం కొన్ని షోస్ చేసింది. ప్రస్తుతం సన్ నెట్వర్క్ లో పనిచేస్తున్న ఆమె మరో యూట్యూబ్ ఛానల్ లో కూడా పనిచేస్తోంది.
ఎద భాగాన్ని పూలతో కప్పేసి
ఈ రోజు స్రవంతి చొకారపు పుట్టిన రోజు కావడంతో ఒక హాట్ ఫోటోషూట్ ఒకదానిని ఆమె షేర్ చేసింది. టాప్ ఏమీ లేకుండా, ఆమె పూలతో ఎద భాగాన్ని కప్పినట్టు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే పువ్వులు అడ్డుపెట్టుకుని ఎద భాగాన్ని వాటితో కవర్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అనుకున్నారు కానీ నిజానికి ఆమె డ్రెస్ లో భాగంగా ఆ పువ్వుల డిజైన్ చేశారు.
రిపీట్
ఇక ఈ హాట్ ఫోటో షూట్ షేర్ చేసిన ఆమె మరో సంవత్సరం వయసు పెరిగిందని ఎప్పటిలాగే కూల్ గా ఉంటాను అని చెప్పుకొచ్చింది. ఇక జబర్దస్త్ ఇమ్మానియేల్ తో చేస్తున్న స్కిట్స్ లో కెమిస్ట్రీ కాస్త బాగానే కుదిరినట్టు కనిపించడంతో స్రవంతి చొకారపును అనేక ఎపిసోడ్స్ కు ఈటీవీ వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. దీంతో ఆమె భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుకుని ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇంకెందుకు మరి బర్త్‌డే బేబీకి విషెస్ చెప్పి మీరు కూడా ఫోటోలు చూసేయండి మరి.