‘స్టార్ హీరో కొడుక్కి హీరోయిన్‌‌గా... ఆ తప్పుతో నా కెరీర్ నాశనం’

సుమ కనకాల, మంజూష, శ్రీముఖి వంటి స్టార్ యాంకర్ల నుంచి బలమైన పోటీ వస్తున్నప్పటికీ తెలుగు యాంకరింగ్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని దూసుకెళ్తున్నారు స్రవంతి చొక్కారపు. అందంతో పాటు చలాకీతనం, ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా పద్ధతిగా హోస్టింగ్ నిర్వహిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ ముద్దగుమ్మ. ఏ ఈవెంట్‌కి వెళ్లినా పద్ధతిగా చీరకట్టులో కనిపించడంతో పాటు హద్దులు దాటకుండా పదాలు పొదుపుగా వాడుతూ స్టార్ రేస్‌లో దూసుకెళ్తున్నారు స్రవంతి.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన స్రవంతి చొక్కారపు.. తొలుత ఓ చిన్న యూట్యూబ్‌లో ఛానెల్‌లో కెరీర్ ప్రారంభించారు. అందులో సినిమాలకు రివ్యూలు, సినిమా, ఇతర న్యూస్ అప్‌డేట్స్ చెప్పేవారు. ఈ దశలో అల్లు అర్జున్ - సుకుమార్‌ల కాంబోలో వచ్చిన పుష్ప సినిమా సమయంలో చేసిన ఇంటర్వ్యూతో రాత్రికి రాత్రి పాపులర్ అయిపోయారు స్రవంతి. అప్పటి నుంచి సినిమాల ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రైవేట్ కార్యక్రాలతో బిజీ అయ్యారు. అనంతరం తెలుగువారి పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ అవకాశం సంపాదించి మరింత ఫేమ్ అందుకున్నారు.

Sravanthi Chokarapu Reveals How She Missed Her a Tamil Film Opportunity

ప్రస్తుతం తెలుగునాట సుమ తర్వాత ఏ సినిమా ఈవెంట్ జరిగినా ఈ ముద్దుగుమ్మ ఉండాల్సిందే. అంతలా తన ముద్ర వేసుకున్నారు. ఇటీవల కొన్ని సినిమాల్లో నటిగానూ అవకాశం దక్కించుకుని కొత్త ప్రయాణం మొదలుపెట్టారు స్రవంతి. అయితే ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దీని కోసం ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు? ఎన్నో అవమానాలు పడ్డారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి స్రవంతి చొక్కారపు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

యాంకర్‌గా చేసేటప్పుడు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్‌కి సంబంధించిన స్పెషల్ స్టోరీస్ లాంటివి చాలా అందంగా చెప్పేదానిని. అప్పుడు కూడా నాకు సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి. ఒకసారి నన్ను స్క్రీన్ మీద చూసి ఓ ఏజెన్సీ నుంచి నుంచి కాల్ వచ్చింది. దాంతో వెళ్లాము, కలిశాము.. అంతా బాగుంది. తమిళ్‌లో పెద్ద స్టార్ హీరో కొడుకుది తొలి సినిమా.. అందులో హీరోయిన్‌గా అడిగారు అంతా బాగానే జరిగింది. టెస్ట్ షూట్ చేశారు.. ఇద్దరినీ పక్కపక్కన పెట్టి జోడీ బాగుంది, కొన్ని డైలాగ్స్ చెప్పమన్నారు, చెప్పాను. స్క్రీన్ టెస్ట్ చేశారు.. రేపొద్దున వెళ్లి చెన్నైలో చెక్ తీసుకోవాలి. నా నోరు కుదురుగా ఉండక.. వూరికే ఏదో అప్పుడు తెలియనితనం. ఎందుకు ముందే చెప్పేస్తే బెటర్ కదా అన్న ఉద్దేశమని స్రవంతి గుర్తుచేసుకున్నారు.

టెస్ట్ షూట్ పూర్తయ్యే వరకు నాతో బాగానే మాట్లాడారు. ఆరోజు బయల్దేరేముందు మేనేజర్‌ని పక్కకు పిలిచి మీతో ఒక విషయం డిస్కష్ చేద్దామని అనుకుంటున్నానని అన్నా. ఆయన కూడా పర్లేదు చెప్పండి అన్నారు... నాకు పెళ్లయ్యింది, మీకు ఓకేనా.. ప్రాబ్లమ్ ఏం లేదు కదా అని అడిగాను. అలా ఎందుకన్నానో కూడా నాకు తెలియదు. ఆ మాట వినగానే నేను మీకు ఒక గంట ఆగి ఫోన్ చేస్తానని చెప్పారు. అంతే ఒక గంట కాస్తా.. సంవత్సరాలు దాటిపోయింది మళ్లీ కాల్ చేయలేదు. నేను కాల్ చేసినా వాళ్లు లిఫ్ట్ చేయలేదు. అయితే ఆ సినిమా కూడా స్టార్ట్ కాలేదు.. రిలీజ్ కూడా అవ్వలేదని స్రవంతి వెల్లడించారు.

ఈ ఒక్క సంఘటన తప్పించి.. నాకు పెళ్లయ్యిందని కానీ, మరొకటి కానీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వెళ్లిన ప్రతి చోటా చాలా బాగా చూసుకునేవారు. నేను ఎంత అడిగితే అంత పే చేసేవారు.. అవకాశాలు వచ్చాయి, అంతా హ్యాపీయే. ఆరోజు వాళ్లకు ఏమనిపించిందో? వాళ్లకు ఎలాంటి ఉద్దేశ్యాలు ఉన్నాయో? తెలియదు. ఇండస్ట్రీకి చెందిన పీఆర్వో ఒకరు కలిసి నువ్వు ఇవన్నీ మానేయ్.. నీలో తెలియని కళ ఉంది, నువ్వు నన్ను నమ్ము అని చెప్పడంతో యూట్యూబ్ ఛానెల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశా. అప్పటి నుంచి డ్రెస్సింగ్, లుక్ మొత్తం మార్చేసి నాకంటూ సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నా. పుష్ప సినిమా టైంలో చిత్తూరు జిల్లా యాసలో చేసిన ఇంటర్వ్యూ కెరీర్ మలుపు తిప్పిందని స్రవంతి చొక్కారపు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X