అప్పు తీర్చడం కోసం రిస్క్ చేసి వెళ్ళా.. మిత్రా శర్మ 5 లక్షలు ఇస్తానంది.. స్రవంతి షాకింగ్ కామెంట్స్

తెలుగు ఒటీటీ బిగ్‌బాస్‌ వర్షన్ నాన్‌స్టాప్‌ పేరుతొ ప్రారంభమై నెలన్నర రోజులు దాటిపోగా ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్‌ అయ్యారు. లెక్క ప్రకారం అయితే అరుగుగు కానీ అందులో ముమైత్‌ తొలివారమే ఎలిమినేట్‌ కాగా ఆమెను వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో హౌస్‌లోకి వచ్చింది. అయితే ప్రేక్షకులు ఆమెను మరోసారి ఎలిమినేట్‌ చేయడం గమనార్హం. అలా ఆరుగురు అయినా లెక్క ఐదుగురికే పరిమితం అయింది. ఆదివారం నాడు ఎపిసోడ్‌లో డబుల్‌ ఎలిమినేషన్‌ ద్వారా ముమైత్‌తో పాటు స్రవంతి కూడా హౌస్‌ నుంచి బయటకు వచ్చింది. అయితే ఆమె బయటకు వచ్చాక మిత్రా గురించి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

5 లక్షలు ఇస్తానందని

5 లక్షలు ఇస్తానందని


హౌస్ నుంచి బయటకు వచ్చాక కంటెస్టెంట్ లు వరుస ఇంటర్వ్యూలు ఇస్తారన్న సంగతి తెలిసిందే. అలాగే ఓ ఇంటర్వ్యూలో మిత్ర శర్మ గురించి స్రవంతి చెప్పుకొచ్చింది. 'బిగ్‌బాస్‌ హౌస్‌లో నా జీవితం ఇది నేను చెప్పినప్పుడు మిత్ర ముందుకు వచ్చి రూ.5 లక్షలు ఇస్తానందని ఆమె చెప్పుకొచ్చింది. ఆ విషయంలో మీరు బాధపడకండని ధైర్యం చెప్పినట్టు స్రవంతి పేర్కొంది.

బాగోగులు చూసుకున్నారని

బాగోగులు చూసుకున్నారని


నా ఇంట్లో పనిచేసే అమ్మాయికి రూ.10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. అలాంటిది మీరు నన్ను దగ్గరుండి ఒక అమ్మలా, అక్కలా చూసుకున్నారు. తినిపించారు. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా బాగోగులు చూసుకున్నారని అందుకే మీకు రూ.5 లక్షలిస్తాను అని చెప్పిందని స్రవంతి పేర్కొంది.

 20-30 లక్షల అప్పు

20-30 లక్షల అప్పు


అంతేకాక బిగ్ బాస్‌కి వెళ్లిన ఒకటి రెండు వారాల్లోనే నేను ఇక్కడ ఉండలేనని అర్ధమైపోయిందని ఆమె పేర్కొంది. కరోనా రెండు సార్లు రావడం వల్ల నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని, లోపల ఉన్న ఏసీకి తట్టుకోలేక పోయేదాన్నని వెల్లడించింది. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రిస్క్ చేసే బిగ్ బాస్‌కి వెళ్లానని ఆమె చెప్పుకొచ్చింది. నా బాబు ఫీజు కట్టాలి.. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి.. 20-30 లక్షల అప్పు ఎలా తీర్చాలి అని భయపడుతున్న సందర్బంలో నాకు బిగ్ బాస్ మంచి ఆఫర్‌‌లా కనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది.

 నేనేంటో తెలియకుండానే

నేనేంటో తెలియకుండానే


నావల్ల ఒక్క నటరాజ్ మాస్టర్‌కి తప్ప బిగ్ బాస్ హౌస్‌లో వాళ్లకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని, కానీ నన్ను జనాలు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు అనేది అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది. మిత్రా నాకు ఐదు లక్షలు ఇస్తానని చెప్పింది కానీ ఇస్తుందో లేదో తెలియదు అయితే అసలు నేనేంటో తెలియకుండానే ఆమె నాకు సాయం చేస్తానని చెప్పిందని స్రవంతి ఎమోసనల్ అయింది.

ఆరో వారంలో

ఆరో వారంలో


నేను హౌస్‌లో జర్నీ చేసిన వాళ్లకే నేనేంటో సరిగా తెలియదు, వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేకపోయారు.. అలాంటిది నేనేంటో తెలియని.. మిత్రా శర్మ నాకు సాయం చేస్తానని చెప్పింది' అంటూ మిత్రా గురించి చెప్పుకొచ్చింది యాంకర్ స్రవంతి. యాంకర్ గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మెరిసిన ఆమె ఆ తరువాత మల్లెమాల వారి కంట పడడంతో ఎక్కువగా వారి ప్రోగ్రామ్స్ లో కనిపించేది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆరో వారంలో ఆమె బయటకు వచ్చేస్నిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X