ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయినా అందుకే పెళ్లి చేసుకోలేదు.. కాబోయే వాడి గురించి పెదవి విప్పిన శ్రీముఖి

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలుత నటిగా తెలుగు వాళ్లకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి తనదైన మార్కు యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో శ్రీముఖి సందడి చేస్తోంది. అయితే ఈ భామ తాజాగా క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొని చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాలు

బ్రేక్ దొరకలేదు

బ్రేక్ దొరకలేదు

నటి అవ్వాలనే కోరికతో సినీ రంగంలో ప్రవేశించిన శ్రీముఖి 'జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ', క్రేజీ అంకుల్స్ లాంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా ఆమెకు సినిమాల్లో అనుకున్నంత బ్రేక్ దొరకలేదు.

క్రేజీ యాంకర్ గా

క్రేజీ యాంకర్ గా

సినిమాల్లో అవకాశాలు వచ్చిన సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా అవతారం ఎత్తింది. 'అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం దిగ్విజయంగా సాగుతోంది.తన కెరీర్‌లో శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జూలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలను హోస్ట్ చేసి ఫిమేల్ క్రేజీ యాంకర్ గా మారింది.

మరింత క్రేజ్‌

మరింత క్రేజ్‌

అలా యాంకర్‌గా ఫుల్ ఫామ్లో ఉన్న సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో శ్రీముఖి బిగ్ బాస్‌లోకి ప్రవేశించింది. భారీ అంచనాల నడుమ మూడో సీజన్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ విన్నర్ అవుతుంది అనుకున్నారు కానీ చివరికి రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితేనేమి ఈ భామకు ఆ షో వల్ల మరింత క్రేజ్‌ను సంపాదించింది.

ఆసక్తికర వ్యాఖ్యలు

ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక తాజాగా సీనియర్ యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న శ్రీరామనవమి స్పెషల్ క్యాష్ ప్రోగ్రాంలో శ్రీముఖి పాల్గొంది. తాజాగా ఆ ప్రోగ్రాం ప్రోమో విడుదల చేశారు. ఆ ప్రోమోలో శ్రీముఖి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా శ్రీముఖి తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడదు. కానీ తొలిసారి క్యాష్ ప్రోగ్రాంలో తన పర్సనల్ లైఫ్, మ్యారేజ్ గురించి శ్రీముఖి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఎవరో కాదు అంటూ

ఎవరో కాదు అంటూ

'నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయింది.. ఎంతోమంది అందమైన హీరోలు, కో యాక్టర్‌లతో వర్క్ చేసినప్పటికీ.. ఎవ్వరికీ నా మనసు ఇవ్వకుండా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా.. నా మెడలో మూడు ముళ్లు వేయించుకోకుండా ఉండటానికి కారణమైన వ్యక్తి ఎవరో కాదు..' అంటూ ఆ వ్యక్తి గురించి చెప్పబోతోంది, అయితే ఆ ప్రోమోలో లవ్ సింబల్స్‌ వేసి కాస్త హడావుడి చేశారు.

పాపులర్ వ్యక్తితో ప్రేమ వ్యవహారం

పాపులర్ వ్యక్తితో ప్రేమ వ్యవహారం

నిజానికి శ్రీముఖికి బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పింది. అందరి అమ్మాయిల్లాగే తాను ఒక అబ్బాయిని ప్రేమించానని.. ఈ పర్సనల్ మ్యాటర్ ఇంతకు ముందు ఎక్కడ చెప్పలేదని.. తాను ఓ పాపులర్ వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపానని చెప్పింది కానీ ఎవరనేది చెప్పలేదు. కానీ అతను అందరికీ తెలిసిన వ్యక్తి అని హింట్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X