శ్రీలీల ముందు పరువు పోగొట్టుకున్న శేఖర్ మాస్టర్.. స్ప్రింగ్‌లా ఊగిపోయిన డేంజర్ పిల్ల
హీరోలతో విభిన్నమైన స్టెప్పులు వేయిస్తూ ఉర్రూతలూగించే వాళ్లలో కొరియోగ్రాఫర్స్ ది ప్రధాన పాత్ర. ఒకప్పుడు డాన్స్ మాస్టర్స్ అంటే కేవలం తెరవెనుక మాత్రమే ఉండేవారు. కానీ, ఇప్పుడు మాత్రం టీవీషోలతోపాటు సోషల్ మీడియా ద్వారా నిత్యం ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
అలా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా పేరు పొందాడు శేఖర్ మాస్టర్. అగ్ర హీరోల నుంచి డెబ్యూ హీరోయిన్ల వరకు స్టెప్పులు వేయిస్తూ అదరగొడుతున్నాడు. అయితే తాజాగా డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ముందు శేఖర్ మాస్టర్ పరువు పోయినంత పనైంది. ఆ వివరాల్లోకి వెళితే..

వరుసగా అవకాశాలు: అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అందాల సుందరి శ్రీలీల. సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ పెళ్లి సందD చిత్రంతో మోస్ట్ పాపులర్ అయిన ఈ బ్యూటి తర్వాత ధమాకా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. అందులో ఆమె డ్యాన్స్ స్టెప్పులకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా అయ్యారు. దీంతో శ్రీలీలకు వరుసగా సినీ అవకాశాలు చెంత చేరాయి.

వెనక్కి నెట్టి మరి: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది శ్రీలీల. స్టార్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి ఈ బ్యూటికి అవకాశాలు ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. అలా బాలకృష్ణ, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది శ్రీలీల. అంతేకాకుండా ఆమె చేతిలో ఇప్పటికే 7 భారీ చిత్రాలు ఉన్నాయి.

మంచి అంచనాలు: శ్రీలీల నటిస్తున్న సినిమాల్లో 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్' (Extraordinary Man 2023) ఒకటి. నితిన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ తో నా పేరు సూర్య మూవీ తర్వాత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత హరీస్ జయరాజ్ తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

శేఖర్ మాస్టర్-శ్రీలీల డ్యాన్స్: అయితే ఇటీవల 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేశారు. నితిన్, శ్రీలీల కోసం డేంజర్ పిల్ల అనే మంచి మెలోడీ పాటను ఇచ్చాడు హరీస్ జయరాజ్. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ లో తెగ ట్రెండ్ అవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ పాటపై స్టెప్పులేస్తున్నారు. అలా తాజాగా శేఖర్ మాస్టర్, శ్రీలీల ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు.

పరువు పోయిందే!: శేఖర్ మాస్టర్, శ్రీలీల కలిసి స్టెప్పులేసిన డేంజర్ పిల్ల వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అయితే ఈ వీడియోలో శేఖర్ మాస్టర్ కన్నా శ్రీలీల బాగా చేసింది అని కామెంట్స్ పెడుతున్నారు. శ్రీలీల తన లెగ్స్ ను స్ప్రింగ్‌లా ఊపుతు మూమెంట్స్ చేసింది. ఆ లెగ్స్ మూమెంట్స్ శేఖర్ మాస్టర్ కన్నా బెటర్ గా ఉన్నాయని అంటున్నారు. దీంతో కొరియోగ్రాఫర్ అయినా శేఖర్ మాస్టర్ పరువు పోయిందే అని ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











