ఇకపై అలా ఉంటాం.. రాహుల్‌తో ఉన్న గొడవలపై శ్రీముఖి కామెంట్స్

బిగ్ బాస్ మూడో సీజన్‌లో రాహుల్ శ్రీముఖి మధ్య జరిగిన కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. బయట ఎంతో మంచి స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా కలిసిపోయిన రాహుల్ శ్రీముఖిలు బిగ్ బాస్ ఇంట్లో బద్ద శత్రువులుగా మారారు. ఎంత కలిసి ఉందామని ప్రయత్నించినా అది కుదరలేదు. శ్రీముఖి అలా పగబట్టడం రాహుల్‌కు బాగా కలిసివచ్చింది. అలా శ్రీముఖి కంటిన్యూగా రాహుల్‌ను నామినేట్ చేయడంతో చివరకు బిగ్ బాస్ విజేతగా నిలిచేశాడు.

Recommended Video

Anchor Sreemukhi About Her Movie Career
ప్రస్తుతం అలా..

ప్రస్తుతం అలా..

బిగ్ బాస్ కంటెస్టెంట్లందరినీ ఒకే చోటకు చేర్చి ఓ ఉత్సవంలా పార్టీ నిర్వహించారు. బిగ్ బాస్ ఉత్సవం పేరిట కంటెస్టెంట్లందరినీ ఒకే చోట చేర్చారు. అయితే దీన్ని రెండు రకాలుగా నిర్వహించారు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరినీ ఒకే చోట చేర్చి పార్టీలా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ప్రసారమైన ఎపిసోడ్‌లో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి.

చివర్లో ఇలా..

చివర్లో ఇలా..

బిగ్ బాస్ ఉత్సవం షో చివర్లో ఓ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న చేదు అనుభవాలు, ఎవరితోనైనా ఎవరికైనా ఉన్న గొడవలను ఇలా మంటల్లో వేసి కాల్చేయండి.. కొత్తగా మళ్లీ ప్రారంభించండని శ్రీముఖి చెప్పుకొచ్చింది. అలా చెబుతూ మొదటగా తానే కొన్ని విషయాలను బయటపెట్టేసింది.

రాహుల్‌తో గొడవలు..

రాహుల్‌తో గొడవలు..

బిగ్ బాస్ మూడో సీజన్లో రాహుల్ శ్రీముఖి మధ్య ఎన్ని గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. రాహుల్ ఎన్ని సార్లు తగ్గినా కూడా శ్రీముఖి మాత్రం తన పంథాలోనే కొనసాగింది. చివరకు ఇంటి సభ్యులు వచ్చిన సమయంలోనూ శ్రీముఖి తల్లి చేసిన కామెంట్లు కూడా బాగానే వైరల్ అయ్యాయి.

బయటకు వచ్చాక కూడా..

బయటకు వచ్చాక కూడా..

బిగ్ బాస్ షో గడిచింది.. బయటకు వచ్చారు.. అయినా కూడా ఆ గొడవలను మాత్రం మరిచిపోలేదు.. వారి శత్రుత్వం ఇంకా కొనసాగుతూనే వచ్చింది. బయట ఎక్కడ కనిపించరు. పార్టీలు జరిగినా కూడా ఈ ఇద్దరిలో ఎవ్వరో ఒకరు మాత్రమే ఉంటారు. అలా శ్రీముఖి రాహుల్ మధ్య గొడవలు ఇంకా ఉన్నాయని అందరికీ తెలిసిందే.

ఇకపై అలా..

ఇకపై అలా..

అయితే తాజాగా బిగ్ బాస్ ఉత్సవంలో శ్రీముఖి ఈ గొడవలన్నింటికి స్వస్తి పలికేసింది. రాహుల్‌తో తనకు ఉన్న చేదు అనుభవాలన్నింటిని మంటల్లో కాల్చేస్తున్నా.. ఇకపై మంచి ఫ్రెండ్స్‌లా ఉండేందుకు ప్రయత్నిస్తానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. మరి వచ్చే వారం రాబోతోన్న బిగ్ బాస్ ఉత్సవంలో రాహుల్ శ్రీముఖి ఎంతలా కలిసిపోయి కనిపిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X