Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Sreemukhi ఆ హీరోతో రొమాంటిక్ డేటింగ్‌కు వెళ్లను.. నా బాయ్‌ఫ్రెండ్‌కు అన్యాయం చేయను.. శ్రీముఖి బోల్డ్ కామెంట్
కరోనావైరస్ కాలంలో ఇంటి పట్టునే ఉంటున్న ప్రేక్షకులకు ఓటీటీలు, టెలవిజన్ ఛానెల్స్ బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. యాంకర్ సుమ నిర్వహిస్తున్న స్టార్ మ్యూజిక్ కార్యక్రమం వినోదంగాను, పాటలకు సంబంధించిన నాలెడ్జిని అందిస్తూ సరదాగా సాగిపోతున్నది. తాజా ఎపిసోడ్లో యాంకర్లు, వీజే, రేడియో జాకీలు సందడి చేశారు. ఈ సందడి గురించిన విషయాల్లోకి వెళితే..
స్టార్ మ్యూజిక్ కార్యక్రమంలో శ్రీముఖి గ్యాంగ్
ఇటీవల జరిగిన స్టార్ట్ మ్యూజిక్ ఎపిసోడ్లో శ్రీముఖి, విష్ణు ప్రియ, కమెడియన్ హరి, రోల్‌రైడా, డాన్సర్ పండు తదితరుల పాల్గొన్నారు. ఈ షోలో శ్రీముఖి, హరి, విష్ణుప్రియ, పండు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సుమ మాటల దాడికి వీరంతా పంచులు విసురుతూ కామెడిని పంచారు.
చిరంజీవి ఆల్ టైమ్ ఫేవరేట్ అంటూ శ్రీముఖి
స్టార్ట్ మ్యూజిక్ షో జరుగుతుండగా శ్రీముఖిని ఉద్దేశించి సుమ ఓ ప్రశ్న వేసింది. సెట్లో పెట్టిన సెలబ్రిటీల ఫోటోలను చూపిస్తూ.. ఇందులో నీకు ఏ సెలబ్రిటీ అంటే ఫేవరేట్ అని సుమ అడిగింది. సుమ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం అని శ్రీముఖి వెల్లడించింది.
ఆ హీరోతో రొమాంటిక్ డేట్‌కు వెళ్లను
నీకు నచ్చిన హీరోతో ఒకవేళ రొమాంటిక్ డేట్‌పై వెళ్లే అవకాశం నీకు వస్తే అని సుమ ప్రశ్న వేస్తుండగానే నేను వెళ్లను అంటూ శ్రీముఖి ఠక్కున సమాధానం ఇచ్చింది. ఎందుకంటే నేను ఇప్పటికే ఒకరికి కమిట్ అయ్యాను. అతడు ఈ షో చూస్తుంటాడు. కాబట్టి నా బాయ్‌ఫ్రెండ్ బ్యాడ్‌గా ఫీలవుతాడు అని శ్రీముఖి చెప్పింది.
నా లైఫ్‌లో కొన్ని ఆంక్షలు, పరిమితులు
యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు మరింత వివరణ ఇస్తూ.. నాకు జీవితంలో కొన్ని ఆంక్షలు, పరిమితులు ఉన్నాయి. నా లైఫ్‌లో కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి నేను రొమాంటిక్ డేట్‌కు వెళ్లను అంటూ శ్రీముఖి చాలా ఫాస్ట్‌గా సమాధానం చెప్పింది. అయితే శ్రీముఖి మాటలకు కౌంటర్ ఇస్తూ.. ఈ షోలో ఇలాంటి హైప్ క్రియేట్ చేద్దామనుకొంటున్నావా అంటూ సుమ కామెంట్ చేసింది.
Recommended Video
ఫన్‌తో అదిరిపోయిన స్టార్ట్ మ్యూజిక్
దాంతో స్టార్ట్ మ్యూజిక్ షోకు వచ్చిన గెస్టులందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఆ తర్వాత వెంటనే పూరి జగన్నాథ్ సినిమా బ్రహ్మనందం ఆల్రైట్ ఆల్ రైట్ అనే డైలాగ్ వినిపించింది. పక్కనే ఉన్న హరి నాకు పది మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని అనగానే.. నీకు అంత సీన్ లేదన్నట్టు సుమ కౌంటర్ ఇచ్చింది. అలా సరదాగా ఎపిసోడ్ కౌంటర్లు, ఎన్కౌంటర్లతో సాగిపోయింది.