నవదీప్‌తో డిన్నర్లు.. వ్యవహారం చాలా దూరమే వెళ్లిందే.. విష్ణుప్రియ గుట్టురట్టు చేసిన శ్రీముఖి

యాంకరింగ్ ప్రొఫెషనల్‌లో శ్రీముఖి, విష్ణుప్రియ ఉన్నంత క్లోజ్‌గా మరెవ్వరూ ఉండరేమో. ఒకే ఇంట్లో ఉంటూ నిత్యం పార్టీలు, వీకెండ్‌లో సందడి చేస్తుంటారు. వీరిద్దరూ కలిశారంటే అక్కడంతా రచ్చ రచ్చ కావాల్సిందే. ఆ మద్య వావ్ షోలోనూ ఈ ఇద్దరు గెస్ట్‌లుగా విచ్చేశారు. అక్కడ జబర్దస్త్ రాకేష్‌ను ఓ ఆటాడేసుకున్నారు. ఇక తాజాగా సుమ క్యాష్‌ షోలో దుమ్ములేపారు. శ్రీముఖి, విష్ణు ప్రియల వ్యక్తిగత విషయాలెన్నో బయటపడ్డాయి.

పెళ్లిపై కామెంట్స్..

పెళ్లిపై కామెంట్స్..

ఇదే షోలో శ్రీముఖి తన పెళ్లిపై కామెంట్ చేసింది. రెండేళ్లలో సుమను దాటేస్తాను అని అనుకుంటున్నావా? అసలు సుమ పోటీయే కాదని భావిస్తున్నావా? అని ప్రశ్నకు శ్రీముఖి చెప్పిన సమాధానంతో పెళ్లి విషయం లీకైంది. రెండేళ్లలో తాను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని, సుమక్క ఎప్పుడూ అలానే ఉండాలని తెలిపింది.

మరో కొత్త స్టోరీ..

మరో కొత్త స్టోరీ..

ఇక అలా శ్రీముఖి కహాని బయటకు రాగా.. విష్ణుప్రియ మనసులో ఉన్నవి కూడా బయటకు వచ్చాయి. తనకు నవదీప్ అంటే ఇష్టమని గతంలో ఎన్నో సార్లు కూడా చెప్పింది. తాజాగా అందుకు అనుగుణంగా సుమ ఓ ప్రశ్నను అడిగింది. రానా, నవదీప్‌లలో ఎవరితో యాంకరింగ్ చేస్తావని అడిగింది.

నవదీప్ ఐ లవ్యూ..

నవదీప్ ఐ లవ్యూ..

సుమ అలా ప్రశ్న అడిగిందో లేదో గానీ విష్ణు ప్రియ గట్టిగా అరుస్తూ సమాధానం చెప్పేసింది. నవదీప్‌తో చేస్తానని చెబుతూ.. నవదీప్ ఐ లవ్యూ అని గట్టిగా తన లౌడ్ స్పీకర్‌ను ఆన్ చేసింది. ఇక ఇదే విషయంలో శ్రీముఖి కలగజేస్తూ అసలు గుట్టంతా బయట పెట్టింది.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
ఇంటికి వెళ్లి డిన్నర్..

ఇంటికి వెళ్లి డిన్నర్..

నవదీప్‌తో విష్ణు ప్రియ బాగా దగ్గరవ్వడం జరిగిందని, నవదీప్ వాళ్లింటికి వెళ్లి డిన్నర్లు అలాగే.. అంటూ కాస్త గ్యాప్ ఇవ్వగానే విష్ణుప్రియ మధ్యలోకి వచ్చింది. ఏరా అందరికీ చెబుతున్నావేంటి అని కసురుకుంది. ఇలా వ్యవహారం గాడి తప్పేలా ఉందని సుమ టాపిక్‌ను డైవర్ట్ చేసి.. డిన్నర్‌లో ఏమున్నాయ్ అంటూ తినే పదార్థాలపై విషయాన్ని మళ్లించింది. ఇలా ఓ రకంగా చూస్తే కొత్త ట్రాకు నడుస్తున్నట్టే కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X