శ్రీముఖి బాయ్‌ఫ్రెండ్‌పై విష్ణుప్రియ షాకింగ్ కామెంట్.. అలాంటి వాడే.. అంటూ
లాక్‌డౌన్‌లో షూటింగులకు అనుమతి లేకపోవడంతో టెలివిజన్ సెట్లు బోసిపోయాయి. ప్రసారమైన సీరియల్స్‌ను మళ్లీ టెలికాస్ట్ చేసి ప్రేక్షకులను ఎదో రకంగా సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించారు. అయితే ఏదో కొత్తరకంగా ఉండాలనే తలంపుతో జీ తెలుగు, స్టార్ మా తెలుగు చానెల్ ముందుకొచ్చాయి. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త కార్యక్రమాలను ప్రారంభించాయి. అలా ప్రారంభించిన కార్యక్రమాలను ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఇంతకు ఆ ప్రొగ్సాం ఏమిటంటే..

ఝాన్సీ లవ్ యూ జిందగీ
లాక్‌డౌన్ కాలంలో సెలబ్రిటీ టాక్ షోలను ప్రారంభించిన వారిలో యాంకర్ ఝాన్సీ, యాంకర్ రవి ముందు వరుసలో ఉన్నారు. ఝాన్సీ లవ్ యూ జిందగీ మొదలుపెడితే.. యాంకర్ రవి లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి అంటూ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు, సరదా సరదా ముచ్చట్లతో కొత్త షోలను తాత్కాలికంగా ప్రారంభించారు.

తాజా ఎపిసోడ్‌లో శ్రీముఖి, విష్ణుప్రియ
తాజాగా ఝాన్సీ షూట్ చేసిన లవ్ యూ జిందగీ ఎపిసోడ్‌లో శ్రీముఖి, విష్ణు ప్రియ, జబర్దస్త్ రాకేష్ పాల్గొన్నారు. జూన్ 12న ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌లో శ్రీముఖి, విష్ణు ప్రియ కేక పెట్టించారు. బోల్డ్, బ్యూటిఫుల్‌గా సమాధానాలు, భావాలను పంచుతూ రచ్చ చేశారు. ఈ ఎపిసోడ్‌లో శ్రీముఖి బాయ్‌ఫ్రెండ్ గురించి విష్ణుప్రియ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

నాకు డాక్లర్లు అందంగా కనిపిస్తున్నారు
ఝాన్సీతో శ్రీముఖి మాట్లాడుతూ నా డాక్టర్లంటే చాలా ఇష్టం. డాక్టర్లను చూస్తుంటే అందరూ అందంగా కనిపిస్తున్నారు. నాకు ఎందుకలా అనిపిస్తుందో తెలియదు అని శ్రీముఖి అంటే.. దానికి ఝాన్సీ రెస్పాండ్ అవుతూ.. డాక్టర్లు మీరు వింటున్నారా? అంటూ ఆటపట్టించారు. అంతేకాకుండా చేతికి మెహందీ పెట్టుకొంటే.. బాగా పండింది. నీకు మంచి మొగుడు వస్తాడు అని చురకలంటించింది. ఇలా సందడిగా ఎపిసోడ్ జరిగింది.

శ్రీమఖికి బాయ్‌ఫ్రెండ్ దొరకడు
తాజా ఎపిసోడ్‌లో విష్ణుప్రియ మాట్లాడుతూ.. తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీముఖికి బాయ్‌ఫ్రెండ్ దొరకడు అంటూ కామెంట్ చేసింది. శ్రీముఖికి ఎందుకు బాయ్‌ఫ్రెండ్ ఎందుకు దొరకడు అంటే.. ఆమె ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఉంటో బాయ్‌ఫ్రెండ్ ఎలా దొరకుతాడు మీరే చెప్పండి అంటూ ప్రశ్నించింది.
Recommended Video

రిచ్ బాయ్‌ఫ్రెండ్ కావాలి
అయితే తన ప్రాణ స్నేహితురాలికి ఎలాంటి బాయ్‌ఫ్రెండ్ లభించాలనే విషయంపై క్లారిటీ ఇస్తూ.. మాకు ఫ్రెండ్‌కు చాలా రిచ్‌గా ఉండే లవర్ దొరకాలి. మమల్ని ఎప్పుడూ ప్రైవేట్ జెట్ విమానాల్లో ట్రిప్‌కు తీసుకెళ్లే వాడు రావాలి. అలాంటి వాడు ఎప్పుడు పై నుంచి ఊడి పడుతాడో వేచి చూస్తున్నాను అంటూ కామెంట్ చేశారు.

హస్యం, వినోదం మేలవించి
లవ్ యూ జిందగీ షోను యాంకర్ ఝాన్సీ చాలా ఫన్నీగా డిజైన్ చేశారు. పక్కా వినోదం, హాస్యం జోడించి సెలబ్రిటీలతో ముచ్చట్లు పెడుతున్నారు. ఇటీవల ప్రసారమైన సుమ కనకాల, యాక్టర్ ప్రియదర్శి ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శ్రీముఖి, విష్ణుప్రియ, రాకేష్‌తో కూడిన ఎపిసోడ్ కూడా మరింత ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టు కనిపించింది.


Click it and Unblock the Notifications











