శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే సెట్ తగలబెడతాం.. ‘బిగ్ బాస్’కు కొత్త టెన్షన్

Recommended Video

Bigg Boss Telugu 3: Sreemukhi Fans Ready To Storm Social Media || Filmibeat Telugu

'బిగ్ బాస్' సీజన్ 3 ప్రారంభమైంది. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా ఈ షోను మాత్రం అనుకున్న సమయానికే ప్రారంభించారు నిర్వహకులు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా పరిచయం అయ్యారు. అదే రోజు 15 మంది సభ్యులను ఆయన హౌస్‌లోకి పంపించారు. ఇక, తర్వాతి రోజే 'బిగ్ బాస్‌'లో రచ్చ మొదలైంది. దీనికి కారణం ఎలిమినేషన్‌కు నామినేషన్స్ జరగడమే.

నామినేషన్ నుంచి సేవ్ అవడం కోసం

నామినేషన్ నుంచి సేవ్ అవడం కోసం

మొదటి ముగ్గురు కంటెస్టెంట్లు సెలెక్ట్ చేసిన ప్రకారం ‘బిగ్ బాస్' మొదటి రోజే ఆరుగురు సభ్యులు నామినేషన్ అయిన విషయం తెలిసింది. అయితే, మానిటర్ హేమను మెప్పించే విధంగా తమ గురించి తాము చెప్పుకుని, మరొకరిని తమ బదులు మరొకరిని నామినేట్ చేయొచ్చని బాస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ అవకాశం ఐదుగురికే ఉందని చెప్పాడు. ఇందులో భాగంగానే ఐదుగురు సభ్యులు మరో ఐదుగురిని నామినేట్ చేశారు.

ఇద్దరు మాత్రమే మారారు

ఇద్దరు మాత్రమే మారారు

మొదటిగా రాహుల్ తనకి బదులుగా నామినేట్ చేయడానికి శివజ్యోతిని ఎంపిక చేసుకున్నాడు. కానీ, అతడి కారణాలు నచ్చక హేమ.. రాహుల్‌నే నామినేట్ చేశారు. తర్వాత వరుణ్ సందేశ్.. పునర్నవిని ఎంపిక చేసుకున్నాడు. దీనికి హేమ కూడా అంగీకరించింది. అనంతరం వితిక.. అషు రెడ్డిని చేసినా లాభం లేకుండా పోయింది. తర్వాత శ్రీముఖి.. హిమజను చేసింది. దీనికి హేమ ఒప్పుకుంది. అలాగే, జాఫర్.. మహేశ్‌ను చేయగా హేమ ఒప్పుకోలేదు.

 శ్రీముఖి తప్పించుకుంది

శ్రీముఖి తప్పించుకుంది

మొదటి జాబితాలో శ్రీముఖి పేరు ఉన్నప్పటికీ తర్వాత ఆమె తప్పించుకుంది. మరో కంటెస్టెంట్ హిమజను నామినేట్ చేసిందామె. శ్రీముఖి చెప్పిన కారణాలు నచ్చడంతో మానిటర్ హేమ.. ఆమె బదులు హిజను నామినేట్ చేసింది. ఆ సమయంలో హేమకు హిమజకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాదు, హిమజ ఏడ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

శ్రీముఖి ఆర్మీ ఏర్పాటు

శ్రీముఖి ‘బిగ్ బాస్'కు రాకముందే ఆమె పేరిట ఒక ఆర్మీ వెలిసింది. సోషల్ మీడియాలో కొందరు ‘శ్రీముఖి ఆర్మీ' అని ఒక గ్రూపును క్రియేట్ చేశారు. ఇందులో భాగస్వాములు అయిన సభ్యులందరూ ఆమెను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో ఆమెకు వ్యతిరేకంగా ఉన్న వారిని విమర్శిస్తున్నారు.

సెట్‌ను కాల్చేస్తామంటూ వార్నింగ్

శ్రీముఖి నామినేషన్ నుంచి తప్పించుకున్నప్పటికీ ఆమె ఫ్యాన్స్ సంతృప్తిగా లేరు. ఇప్పుడున్న వారిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రిటీ కావడంతో అందరి కళ్లు ఆమె పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే.. బిగ్ బాస్ సెట్ కాల్చేస్తాం' అంటూ కొందరు మీమ్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడివి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మూడు రోజులు కాకముందే..

‘బిగ్ బాస్' ప్రారంభమై మూడు రోజులు కూడా గడువక ముందే హౌస్‌లో గొడవలు.. తిట్టుకోవడాలు.. ఏడ్పులు.. వాగ్వివాదాలు.. రొమాన్స్ దర్శనమిస్తున్నాయి. వీటిపైనా కొందరు సెటైర్లు వేస్తున్నారు. దీంతో ‘బిగ్ బాస్' సీజన్ -3 అప్పుడే వార్తల్లో నిలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X