Sreemukhi చెంప చెళ్లుమనిపించిన అవినాష్.. ఆ తరువాత ఎమోషనల్ హగ్!
బుల్లితెరపై నిత్యం సందడి చేసే వారిలో శ్రీముఖి ఒకరు. యాంకర్ గానే కాకుండా మంచి నటిగా కూడా గుర్తింపు అందుకున్న శ్రీముఖి ఎలాంటి షో చేసినా కూడా టెలివిజన్ వరల్డ్ లో ఒక ప్రత్యేకమైన బజ్ క్రియేట్ చేస్తుంది. సోషల్ మీడయాలోనూ వీరి హవా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి షో చేసినా కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రీముఖికి సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. అందులో ముక్కు అవినాష్ కూడా ఉన్నారు. ముక్కు అవినాష్ - శ్రీముఖి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో ప్రత్యేకమైన షోలు మంచి రేటింగ్స్ అందుకున్నాయి. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీరు చేసే సందడి మామూలుగా ఉండదు. రీసెంట్ గా వీరు ఇన్స్టాగ్రామ్ లో చేసిన రీల్ ఒకటి వైరల్ గా మారింది.

ఎప్పుడైతే యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిందో
శ్రీముఖి మొదట నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి సినిమాలో ఆమె హీరో చెల్లెలి పాత్రలో కనిపించింది. నటిగా శ్రీముఖికి మంచి గుర్తింపు లభించిన అనంతరం ఆమె రియాలిటీ షోలలో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా వచ్చింది. ఎప్పుడైతే యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

టాప్ షోలో ఛాన్స్ వచ్చినప్పటికీ
మొదట ఆమెకు జబర్దస్త్ యాంకర్ గా అవకాశం వచ్చినప్పటికీ ఎందుకు అప్పుడు ఆమె దానిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అయినప్పటికీ యాంకర్ గా మళ్లీ అటు వైపు అడుగులు వేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంది. పటాస్ షో ద్వారా శ్రీముఖి అసలైన కెరీర్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. ఆ షో ద్వారా ఆమె ఇతర నటీనటులు కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. శ్రీముఖి బుల్లితెర ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు అందులో అవినాష్ ఒకరు.

కష్ట సమయంలో అవినాష్ కు అండగా
శ్రీముఖి ఫ్రెండ్షిప్ కు చాలా వాల్యూ ఇస్తుందని చాలామంది చెబుతుంటారు. కష్ట సమయంలో కూడా ఆమె స్నేహితుల కోసం ఎంతో కొంత సహాయం చేస్తుందని కూడా ఉదాహరణలు చెప్పారు. గతంలో అవినాష్ జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి శ్రీముఖి సహాయం తీసుకున్న విషయం తెలిసిందే. షో నుంచి బయటకు వచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని అనుకున్నాప్పుడు జబర్దస్త్ నిర్వాహకులకు డబ్బులు కట్టాల్సి ఉండగా శ్రీముఖి సహాయం చేసిందని అవినాష్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు.
Recommended Video
కార్తీక దీపం సెంటిమెంట్ సీన్
ఇక శ్రీముఖి అవినాష్ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక కామెడీ స్కిట్స్ లో సందడి చేస్తూనే ఉంటారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో కూడా వీరికి సంబంధించిన రీల్ ఒకటి వైరల్ మారింది. కార్తీకదీపం డాక్టర్ బాబు వంటలక్క పాత్రలో లీనమై ఒక సీన్లో సరదాగా నటించారు. సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయిన కార్తీక్, దీప ట్రీట్మెంట్ సెంటిమెంట్ సీన్ లో ఈ ఇద్దరు చాలా ఎమోషనల్ గా నటించారు. ఒక విదంగా సీన్ లో శ్రీముఖి అవినాష్ లీనమై నటించారు. ట్రీట్మెంట్ తీసుకోవా? అంటూ శ్రీముఖి చెంప చెళ్లుమనిపించిన అనంతరం ఆమె ఎమోషనల్ గా కరెక్ట్ అయిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇద్దరూ పాత్రలో చాలా లీనమై నటించారు అని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











