నువ్వు హజ్బెండ్ మెటీరియల్‌.. ఆ నటుడిపై అలా ఇష్టాన్ని బయటపెట్టిన శ్రీముఖి

బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు శ్రీముఖి. ఎలాంటి వాతావరణాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చుకుని.. ఉత్సాహం తీసుకురావడంలో శ్రీముఖి తర్వాతే ఎవరైనా అన్నట్లుగా చెలరేగిపోతారు ఈ ముద్దుగుమ్మ. ఆల్రెడీ 30 క్రాస్ చేసిన శ్రీముఖి ఇప్పటికీ సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం శ్రీముఖి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు.

ఇదిలాఉండగా.. టెలివిజన్ షోలలో సెలబ్రిటీల మధ్య లవ్ ట్రాక్‌లు బాగా వర్కవుట్ అవుతుంటాయి. సుడిగాలి సుధీర్- రష్మి గౌతమ్, వర్ష- ఇమ్మాన్యుయేల్ మధ్య లవ్ ట్రాక్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ప్రేక్షకులు కూడా ఆయా జంటలన్ని ఆశీర్వదించారు. వీరంతా పెళ్ళి చేసుకోవాలని కూడా కోరుకున్నారు. తరచుగా సోషల్ మీడియాలో వీరి ప్రేమ, పెళ్లిపై రకరకాల గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కోవలోకే వస్తుంది శ్రీముఖి- బాలు బాండింగ్.

Sreemukhi Calls Vishnukanth as Husband Material Their Chemistry Goes Viral Again

గుండెనిండా గుడిగంటలు సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యారు బాలు అలియాస్ విష్ణుకాంత్. ఈ సీరియల్‌లో అతని నటనకు కాలేజ్ అమ్మాయిలు, మహిళలు ఫిదా అయిపోతుంటారు. ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ అరుపులు, కేకలతో గోల గోల చేస్తుంటారు. అలా బాలుని కూడా శ్రీముఖి ఎంతో అభిమానిస్తారు. ఆయనపై పలుమార్లు తన అభిమానాన్ని శ్రీముఖి బయటపెట్టింది. బుల్లితెర షోలలో తను బాలును ప్రేమిస్తున్నట్లుగా హింట్ ఇస్తున్నట్లుగా ఉంటుంది శ్రీముఖి.

స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఎప్పుడైనా బాలు గెస్ట్‌గా వస్తే చాలు శ్రీముఖి మెలికలు తిరుగుతుంటుంది. అలా ఒకరోజున బాలుకి శ్రీముఖి మ్యారేజ్ ప్రపోజల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత వినాయక చవితి ఈవెంట్‌కు వచ్చిన విష్ణుకాంత్.. తాను స్వయంగా నేసిన చీరను శ్రీముఖికి గిఫ్ట్‌గా ఇవ్వడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని గాసిప్స్ వైరల్ అయ్యాయి.

ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా టెలికాస్ట్ అయిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి శ్రీముఖి నానమ్మ గెస్ట్‌గా వచ్చింది. ఈ సందర్భంగా నీకు మనవడిగా ఎలాంటి అబ్బాయి కావాలని నానమ్మని శ్రీముఖి అడగ్గా.. గుండెనిండా గుడిగంటలులో బాలులా ఉండాలని ఆమె చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సమ్మర్ స్పెషల్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి బాలు మరోసారి రావడంతో శ్రీముఖి అతని చుట్టూ తిరిగింది. అలాగే విష్ణుకాంత్ వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయింది. ఈ వీక్ ఎపిసోడ్‌కి సంబంధించి విడుదలైన పలు ప్రోమోలలో బాలు గురించి చెబుతూ సిగ్గుపడిపోయింది శ్రీముఖి.

నిన్న విడుదల చేసిన ప్రోమోలో జబర్దస్త్ నూకరాజును ఒక జ్యోతిష్యుడిగా తీసుకొచ్చి అతనితో ఫన్ రాబట్టింది. ఒక్కో కంటెస్టెంట్‌ని పిలిచి వారితో చీటిలు తీయించాడు నూకరాజు. తొలుత బాలును పిలిపించి నీ పెళ్లి నిజామాబాద్‌లో అవుతుందని చెప్పడంతో రాములమ్మ సిగ్గుతో మెలికలు తిరుగుతుంది. అయితే మా ఇద్దరి మధ్యలో అవినాష్ గాడు ఉంటాడని ఫైర్ అయ్యింది . తాజా ప్రోమోలో బాలుని పిలిచిన శ్రీముఖి ముగ్గు టాస్క్ ఇచ్చింది. ముగ్గు వేస్తావా నువ్వు అని అడగ్గా.. చిన్నప్పుడు ఇంట్లో వేసిన అలవాటుందని బాలు చెప్పడంతో నువ్వు హాజ్బెండ్ మెటీరియల్ అని అతని బుగ్గ గిల్లింది. తర్వాత బాలు ముగ్గు వేసిన విధానాన్ని కూడా రాములమ్మ మెచ్చుకుంది. దాంతో బాలుతో పాటు అక్కడున్న వారంతా అరుపులు, కేకలతో గోలగోల చేశారు. అలా బాలు- శ్రీముఖి కెమెస్ట్రీ కారణంగా నెటిజన్లు వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: sreemukhi vishnukanth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X