యాంకర్ శ్రీముఖి బర్త్ డే... ఈసారి రాములమ్మకు గిఫ్ట్ అదిరిపోయిందిగా!

తెలుగునాట స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు శ్రీముఖి. తన అందం, వాక్చాతుర్యం, చలాకీతనంతో ఎలాంటి కార్యక్రమాన్ని అయినా అవలీలగా చేసుకెళ్తారు శ్రీముఖి. ముఖంపై చెరగని చిరునవ్వు, తన అల్లరితో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తారు. స్టార్‌డమ్‌ ఉన్నప్పటికీ ఒదిగే ఉండటం.. వివాదాలకు దూరంగా ఉంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు శ్రీముఖి. ఈ రోజుతో ఆమె 33వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. అంతేకాదు.. ఈరోజు రాములమ్మకు ఊహించని గిఫ్ట్ కూడా వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

10 మే 1993న నిజామాబాద్‌లో జన్మించారు శ్రీముఖి. డెంటల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన శ్రీముఖి. తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టారు. తొలుత ఈటీవీలో ప్రసారమైన అదుర్స్ షోకు హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత సూపర్ సింగర్‌కు యాంకర్‌గా వ్యవహరించారు. ఈ దశలో జులాయి సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, నేను శైలజ, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ధనలక్ష్మీ తలుపు తడితే, సావిత్రి, జెంటిల్‌మెన్, మనలో ఒక్కడు, బాబు బాగా బిజీ, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో, భోళా శంకర్ తదితర సినిమాలలో నటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలలోనూ మెరిశారు శ్రీముఖి.

Sreemukhi Celebrates 33rd Birthday Receives Special Gift with New Housewarming Ceremony

సినీరంగం కంటే బుల్లితెరపైనే శ్రీముఖి సక్సెస్ కోట్టారు. హోస్ట్‌గా పలు ఛానెల్స్‌లో పదుల సంఖ్యలో షోలు చేస్తున్నారు. ఇక 2019లో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన శ్రీముఖి తృటిలో టైటిల్ మిస్ అయ్యారు. ప్రస్తుతం స్టార్ మాలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు శ్రీముఖి. ఇవి కాకుండా పలు ప్రైవేట్ ఈవెంట్స్‌కి యాంకర్‌గానూ వ్యవహరిస్తున్నారు.

33 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తడం లేదు శ్రీముఖి. అయితే బిగ్‌బాస్ ఉన్నప్పుడే తన రిలేషన్, బ్రేకప్స్‌ గురించి బయటపెట్టి ఎమోషనలైంది రాములమ్మ. తన సంపాదనను తెలివిగా పెట్టుబడలు వైపు మళ్లిస్తున్నారు ఈ స్టార్ యాంకర్. రియల్ ఎస్టేట్‌తో పలు వ్యాపారాల్లో ఆమె భాగస్వామిగా ఉన్నారని బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇటీవలే రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని క్యాపిటల్ పార్క్‌లో ఫుర్సత్ రెస్టారెంట్‌‌ను ఇటీవల ప్రారంభించారు శ్రీముఖి. తన మిత్రులు శ్రావణ్, ఆనంద్‌, రవిలతో కలిసి ఈ రెస్టారెంట్‌ రంగంలోకి దిగింది.

ఇవాళ శ్రీముఖి 33వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు రాములమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఏడాది పుట్టినరోజు మాత్రం శ్రీముఖికి ఎంతో స్పెషల్. ఈరోజున తను ఎంతో ఇష్టంగా కట్టుకున్న కొత్త ఇంటిలోకి ఆమె అడుగుపెట్టింది. కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశాన్ని ఘనంగా జరుపుకుంది. తమ్ముడితో కలిసి ఇంట్లో హోమం చేసి పాలు పొంగించింది. ఇప్పటికే తన సొంతూరు నిజామాబాద్‌లో ఇల్లు కట్టుకున్న శ్రీముఖి.. హైదరాబాద్‌లో నాలుగేళ్ల క్రితం మరో ఇంటిని కట్టుకుంది. తాజాగా మరో ఇంటిని కూడా నిర్మించుకుని గృహ ప్రవేశం చేశారు. ప్రస్తుతం శ్రీముఖి గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read more about: sreemukhi telugu movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X