నీకు వయసు పెరుగుతుంటే.. అది కూడా ఎక్కువైతుంది.. సుమకు శ్రీముఖి కౌంటర్
టాప్ యాంకర్ సుమ ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తాజాగా బొమ్మ అదిరింది షోలోకి ఎంట్రీ ఇచ్చిన సమక్క దుమారం లేపింది. సునామీలా ప్రవేశించిన సుమ హంగా చేసింది. శ్రీముఖికి కౌంటర్లు ఇచ్చింది.. ఇక శ్రీముఖికి నాగబాబు కూడా అంతే మొత్తం కౌంటర్లు ఇచ్చారు. ఇంతకు బొమ్మ అదిరిందిలో కౌంటర్లు ఎలా సాగాయంటే..

శ్రీముఖి వచ్చాక నవ్వు ఉంటుందా.. నాగబాబు
బొమ్మ అదిరింది షోకు యాంకర్‌గా రంగ ప్రవేశం చేసిన శ్రీముఖి.. నాగబాబుకు బిస్కెట్ వేసే ప్రయత్నం వేసింది. మీ నవ్వు అంటే నాకు బాగా ఇష్టం అని శ్రీముఖి అంటే.. నీవు వచ్చినాక ఇక ఆ నవ్వు ఉంటుందా అంటూ కామెంట్ చేశారు. దాంతో శ్రీముఖి కంగు తిన్నారు. ఆ తర్వాత శ్రీముఖికి నాగబాబు పుష్పగుచ్ఛం ఇచ్చి షోలోకి స్వాగతించారు.

సునామీలా సుమ ఎంట్రీ
ఇక షోలకు ఎవడ్రా అంటూ నా హాస్టల్‌లోని పిల్లలను అంటూ కర్ర తీసుకొని స్టేజిపై కుర్రాళ్లను యాంకర్ సుమ ఎడాపెడా వాయించేసింది. లేత మనసు ఉన్న నా చెల్లెల్ల అంటూ సమ అంటుండగా నీ చెల్లెల్లా అంటూ శ్రీముఖి మధ్యలో దూరింది. దాంతో ఒళ్లు మండిపోయిన సుమ.. నాకు ఒకే రోజు రెండు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు వచ్చాయి. నీకు ఒకటి ఇద్దామనుకొన్నాను అంటూ ఝలక్ ఇచ్చింది.

నాలుగేళ్లుగా కరోనా వచ్చిన వాడిలా
ఇక యాదమ్మ రాజును సుమకు శ్రీముఖి చూపిస్తూ వాడు పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాడు. అంటే కరోనా వచ్చి ఒక ఏడాది కాలేదు. కానీ వాడు మాత్రం నాలుగేళ్ల నుంచి కరోనా వచ్చిన పేషెంట్‌లా ఉన్నాడు. వాడికి పెళ్లేంటి అని సుమ గట్టిగా అరుస్తూ సెటైర్ వేసింది. దాంతో యాదమ్మ రాజు తెల్ల ముఖం వేసుకొని షాక్‌లో కనిపించారు.

సుమ నీకు వయసు పెరుగుతుంటే అంటూ శ్రీముఖి
సుమ గట్టిగా అరవడాన్ని చూసి శ్రీముఖి కౌంటర్ వేసింది. నీకు వయసు పెరిగిన కొద్ది బీపీ కూడా పెరిగిపోతున్నట్టు కనిపిస్తున్నది అంటే.. మరి నీకు అంటూ సుమ రివర్స్ గేర్ వేయగానే నాకు.. నాకు అంటూ ఏదో సమాధానం ఇవ్వబోయింది. ఇలా బొమ్మ అదిరింది షోలో కౌంటర్లు, ఎన్‌కౌంటర్లతో సరదాగా సాగినట్టు కనిపించింది.
Recommended Video

లాక్‌డౌన్ తర్వాత సరికొత్తగా
లాక్‌డౌన్ ముందు జీ తెలుగులో ప్రారంభమైన అదిరింది షోను లాక్‌డౌన్ తర్వాత గేమ్ ఫార్మాట్‌లో అనేక మార్పులు చేసి కొత్తగా బొమ్మ అదిరింది టైటిల్‌తో మళ్లీ కొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతంలో ఉండే యాంకర్ రవి, నందిని కనిపించకపోగా.. కొత్తగా శ్రీముఖి, సుమ, జానీ మాస్టర్ తెరపైకి వచ్చారు.


Click it and Unblock the Notifications











