నా లైఫ్‌లో సరిద్దిద్దుకోలేనిది అదే.. అతడిని అలా మిస్ అయ్యా.. ఒంటరి బతుకుతో.. భోరుమన్న శ్రీముఖి
బిగ్‌బాస్ రియాలిటీ షోలో 12వ రోజు చాలా భావోద్వేగాల మధ్య సాగింది. సెలబ్రిటీలు తాము తీసుకొన్న నిర్ణయాల వల్ల కోల్పోయిన వ్యక్తులను తలచుకొని కుమిలిపోయారు. జీవితంలో మళ్లీ రాబట్టుకొలేని విషయాలను చెప్పి విషాదంలో మునిగిపోయారు. శ్రీముఖి, శివజ్యోతి, పునర్నవి, మహేష్ విట్ట తదితరులు చెప్పిన తమ ఫ్లాష్ బ్యాక్ విషయాలు ప్రేక్షకులను సైతం ఎమోషనల్‌గా మార్చే విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..
Recommended Video

నేను హ్యాపీగా కనిపిస్తాను.. కానీ
నేను హ్యాపీగా, చలాకీగా, బాగా మాట్లాడుతూ అల్లరిగా ఉండటం మీరు చూస్తూ వచ్చారు. కానీ నేను నా బాల్యంలో చాలా కామ్‌గా ఉండేదానిని. పెద్దగా ఎవరితోనూ అంత ఈజీగా కలిసిదానిని కాదు. మాది చాలా పెద్ద ఫ్యామిలి. నేను నా తండ్రి మాదిరిగానే నాలో ఉండే భావాలను బయటపెట్టుకొనే దానిని కాదు. నా తాత ఓ సందర్భంలో అనారోగ్యానికి గురయ్యారు. పక్షవాతానికి గురై మంచంలోనే అన్నీ జరిగిపోయేవి అని శ్రీముఖి తెలిపారు.

మా తాత అలా ముద్దుగానే
చిన్నప్పుడు నా తాత గుడియా అని ముద్దుగా పిలిచేవాడు. పక్షవాతం బారిన పడిన తర్వాత గుడియా అని సరిగ్గా పిలువలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగింది. అప్పుడు నన్ను, నా తమ్ముడిని చూడాలని ఉందని మా తాత కబురు పెట్టారు. కానీ నా ఆరోగ్యం సరిగా లేక నేను వెళ్లి తాతను కలువలేకపోయాను. నేను ఉదయం వెళ్లి చూద్దామని అనుకొన్నాను.

తాతయ్య చనిపోయాడని చెప్పగానే
కానీ ఉదయమే నా తమ్ముడు వచ్చి తాత చనిపోయాడని చెప్పే సరికి షాక్ గురయ్యాను. అందరూ వెళ్లి తాతయ్య వద్ద ఉన్నారు. మనం కూడా వెళ్లాలంటే చాలా బాధతో అక్కడికి వెళ్లాను. మా నాన్న దు:ఖంలో మునిగి పరిస్థితిని చూడలేకపోయాను. దాంతో నేను కూడా తీవ్ర విషాదంలో కూరుకుపోయాను అని శ్రీముఖి భోరున విలపించింది.

మరణిస్తానని అర్ధమైందనుకొంటాను
మా తాతతో చివరిసారిగా మాట్లాడలేకపోయాననే బాధ నన్ను వెంటాడుతుంది. బహుశా తను చనిపోతానని ముందే అతడికి అర్ధమైందనుకొంటా. నేను వెళ్లి కలిసి ఉంటే ఆయనకు ప్రశాంతంగా ఉండేదేమో. ఆ విషయంలో నేను తప్పు చేశానని అనుకొంటాను. అది నా జీవితంలో మళ్లీ సరిద్దిద్దుకోలేని ఘటనగా భావిస్తుంటాను అని శ్రీముఖి అన్నారు.

ఒంటరిగానే బతుకుతూ
నేను ప్రొఫెషనల్‌గా బిజీగా మారిన తర్వాత ఎవరినీ కలువలేకపోతున్నాను. రాత్రి 7 గంటల నుంచి ఉదయం వరకు షూటింగ్‌లు జరుగుతాయి. ఇంటికి వెళ్లి పడుకోవడం తప్ప ఎవరితో మాట్లాడే పరిస్థితి ఉండదు. గత మూడేళ్లుగా నా తల్లిదండ్రులతో గడిపే పరిస్థితి లేదు. నాతో మాట్లాడేవాళ్లే కరువయ్యారు అని ఏడుస్తూ శ్రీముఖి చెప్పింది.


Click it and Unblock the Notifications











