Bigg Boss Telugu 7: హౌస్‌లోకి ఆ సీజన్ రన్నర్.. ఫైనలిస్టులకు 20 లక్షలు ఆఫర్.. ఫినాలే ముందే షాకింగ్!
తెలుగు బుల్లితెరపైకి విభిన్నమైన కాన్సెప్టులతో ఎన్నో రకాల రియాలిటీ షోలు మొదలవుతున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు బిగ్ బాస్‌దే. అంతలా ఈ కార్యక్రమం సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను ముగించబోతున్నారు. ఇక, తాజాగా ఫైనలిస్టులకు మాజీ కంటెస్టెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే...
19 మందిలో ఫైనలిస్టులు వీళ్లే:గత సీజన్ల కంటే ఎక్కువ సక్సెస్ చేయాలన్న లక్ష్యంతో ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వారిలో 14 వారాలకు గానూ 13 మంది ఎలిమినేట్ అయిపోయారు. ఫలితంగా మిగిలిన ఆరుగురు శివాజి, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లు ఫైనలిస్టులు అయ్యారు.

అందరూ ఫినాలేలోకి అడుగు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఆరుగురిని ఫైనలిస్టులుగా డిసైడ్ చేశారు. అయితే, ఇందులో ఒకరు వారం మధ్యలోనే ఎలిమినేట్ అయిపోతారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని హోస్టుగానీ, బిగ్ బాస్ టీమ్ కానీ ప్రకటించకపోయినా గత సీజన్‌లో కూడా ఇలాగే జరగడంతో నిజమే అని అంతా అనుకున్నారు. కానీ, ఈ సీజన్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదని తాజాగా ఓ న్యూస్ బయటకొచ్చింది.
ఆరోజే అసలైన సంబురంగా:ఎన్నో అంచనాలతో మొదలైన ఏడో సీజన్‌లో టాప్ 6 కంటెస్టెంట్లు ఫైనలిస్టులుగా ఫిక్స్ అయిపోయారు. వీళ్లు నేరుగా గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడుతున్నారు. ఇందులోనే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ రావడంతో పాటు విజేతను నిర్ణయించబోతున్నారు. ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం (డిసెంబర్ 17వ తేదీ) సాయంత్రం 7 గంటలను నుంచి ప్రసారం కాబోతుంది.

షూట్ ప్రారంభం.. వాళ్లతోనే:వచ్చే ఆదివారం నుంచి జరగబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అంతేకాదు, వీళ్లలో చాలా మంది ఆటపాటలతో అలరించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మొత్తం షూటింగ్ కూడా ఈరోజే మొదలైనట్లు తెలిసింది.
హౌస్‌లోకి సెలెబ్రిటీలు రాక:ఎంతో గ్రాండ్‌గా జరగబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలేకు గెస్టులుగా వచ్చేది ఎవరన్న దానిపై కూడా చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా వస్తాడని ఇటీవలే న్యూస్ లీకైంది. అలాగే, ఫినాలేకు ముందు కొందరు సెలెబ్రిటీలు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి సందడి చేయబోతున్నారని కూడా ఓ సమాచారం తెలిసింది.

ఆ షో కోసం యాంకర్ ఎంట్రీ:బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం నిర్వహకులు ఎన్నో రకాల సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఓ షో కోసం మూడో సీజన్ రన్నర్, ప్రముఖ యాంకర్ శ్రీముఖి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తాజాగా తెలిసింది. ఆమెతో పాటు మరికొందరు సెలెబ్రిటీలు కూడా ఇంట్లో ఉన్న ఆరుగురు ఫైనలిస్టులతో కలిసి సందడి చేశారట.
ఫైనలిస్టులకు రూ 20 లక్షలు:బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన యాంకర్ శ్రీముఖితో నిర్వహకులు ఓ సూట్‌కేస్‌ను పంపినట్లు తెలిసింది. అందులో ఏకంగా రూ. 20 లక్షలు పెట్టారట. ఇది తీసుకుని ఎవరైనా బయటకు వచ్చేయొచ్చు అని శ్రీముఖి ఫైనలిస్టులకు ఆఫర్ చేసినట్లు తెలిసింది. కానీ, ఇందుకు ఎవరూ ఒప్పుకోలేదని సమాచారం. దీంతో ఆరుగురు ఫైనలిస్టులు గ్రాండ్ ఫినాలేలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











