షోలో ప్రమాదం: రాంప్రసాద్ వల్ల విష్ణు ప్రియకు గాయాలు.. సిగ్గులేదా అంటూ శ్రీముఖి ఫైర్.!

By Manoj

తెలుగు బుల్లితెరపై తమదైన శైలి యాంకరింగ్‌తో చాలా కాలంగా సత్తా చాటుతున్నారు హాట్ బ్యూటీలు శ్రీముఖి, విష్ణు ప్రియ. ఆకట్టుకునే అందంతో పాటు స్పాంటీనియస్‌గా పంచులు వేయగల సామర్థ్యం ఉండడంతో వీళ్లు సక్సెస్ అయ్యారు. ఫలితంగా వరుస ఆఫర్లతో బిజీ యాంకర్లుగా మారిపోయారు. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు. ఇదిలాఉండగా, తాజాగా జరిగిన ఓ షోలో... జబర్ధస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ చేసిన పొరపాటు కారణంగా ఈ ఇద్దరు యాంకర్లకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

శ్రీముఖి.. విష్ణు ప్రియ.. ఇద్దరూ ఇద్దరే

శ్రీముఖి.. విష్ణు ప్రియ.. ఇద్దరూ ఇద్దరే

శ్రీముఖి... విష్ణు ప్రియ ఇద్దరూ యాంకరింగ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ఆరంభంలో ఈ ఇరువురూ సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే మంచి మంచి పాత్రలను పోషించారు. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగు పెట్టారు. అద్భుతమైన టాలెంట్ ఉండడంతో వీరిద్దరికీ వరుసగా ఆఫర్లు వచ్చాయి. దీంతో చేతి నిండా షోలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఎప్పుడూ కలిసే.. ట్రిప్పుల్లో ఎంజాయ్

ఎప్పుడూ కలిసే.. ట్రిప్పుల్లో ఎంజాయ్

బుల్లితెర యాంకర్లు శ్రీముఖి.. విష్ణు ప్రియ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత వీళ్ల బంధం బలంగా తయారైంది. దీంతో వీళ్లిద్దరూ ఎప్పుడూ కలిసే కనిపిస్తున్నారు. వేరు వేరు షోలు.. ఛానెళ్లలో పని చేస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే హాలిడే ట్రిప్పులు కూడా వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
గెలుపు కోసం విష్ణు ప్రియ పోరాటం

గెలుపు కోసం విష్ణు ప్రియ పోరాటం

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో శ్రీముఖి బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంటర్ అయింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ.... రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందామె. అయితే, శ్రీముఖి బిగ్ బాస్‌ హౌస్‌లో ఎంత కష్టపడిందో... విష్ణు ప్రియ కూడా ఆమె కోసం అంతే పోరాటం చేసింది. తన స్నేహితురాలిని గెలిపించుకునేందుకు భారీగా ఓట్లు వేయించింది.

షోలో ప్రమాదం: సిగ్గులేదా అంటూ శ్రీముఖి ఫైర్.!

Wow వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రాంప్రసాద్... యాంకర్ విష్ణు ప్రియను వెనుక నుంచి తోసేయడంతో కింద పడిపోయింది. దీంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అదే సమయంలో ‘సిగ్గులేదా... అసలు వీడిని ఎవరు రమ్మన్నారు' అంటూ శ్రీముఖి ఫైర్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X