అతనికి అలాంటి అమ్మాయిలంటే పిచ్చి.. భార్యతో విలన్‌లా... హీరోపై శ్రీముఖి కామెంట్స్

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు శ్రీముఖి. ముఖంపై చెరగని చిరువన్వుతో, చలాకీగా ఉంటారు. ఎలాంటి షో అయినా అలవోకగా చేస్తూ ఆడియన్స్‌కి వినోదాన్ని పంచుతున్నారు. తన అందంతో ఆయా కార్యక్రమాలకు గ్లామర్ సొగసులు తీసుకొస్తున్నారు శ్రీముఖి. ఆమె ఉందంటే చాలు ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఓ బుల్లితెర నటుడి గురించి శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ప్రతి వారం ఏదో ఒక స్పెషల్ థీమ్‌తో అలరిస్తోంది. బుల్లితెర సెలబ్రిటీలతో శ్రీముఖి చేసే అల్లరి, వారితో ఆడించే గేమ్స్ ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతివారం మాదిరిగానే ఈ వారం కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం ప్రత్యేకంగా సిద్ధమైంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

Sreemukhi Funny Comments on TV Couples Go Viral in Aadivaram With Star Maa Parivaaram Promo

మొగుడికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి.. అలాగే భార్యలకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. మీకు తీరని కోరిక ఏంటీ అని ఓ జంటను శ్రీముఖి ప్రశ్నించింది. మా ఆయనని ఓ సోలో పర్ఫార్మెన్స్ చూడాలని చెబుతుంది భార్య. దానికి శ్రీముఖి అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత బుల్లితెర నటుడు నిరూపమ్ పరిటాల - మంజుల దంపతులను పిలిచిన శ్రీముఖి.. మీకున్న కోరికలేంటీ? అని మంజులను అడిగింది. ఇంతలో నిరూపమ్ సీరియస్‌గా చూస్తుండటంతో మీరు మంజుల గారిని విలన్‌లా చూడొద్దని వార్నింగ్ ఇచ్చింది శ్రీముఖి.

ప్రిన్సీని మీరు ఎప్పుడూ ఇలా చూడలేదే అని శ్రీముఖి ప్రశ్నించగా.. నిరూపమ్ షాకయ్యాడు. ఆ తర్వాత మీ భార్యతో ఉన్న కోరికలు ఏంటీ అని అని అడగ్గా.. నాతో పాటు జిమ్‌కి రమ్మని అడుగుతాను, అది ఇంత వరకు ఈ 15 ఏళ్లలో చేయలేకపోయానని నిరూపమ్ బాధపడతాడు. మంజుల గారు చాలా ఫిట్‌గా ఉన్నారు, మీకు ప్రిన్సీలాంటి ఫిగర్‌లే నచ్చుతాయని శ్రీముఖి లీక్ చేయగా.. నిరూపమ్ టెన్షన్ పడటంతో అంతా నవ్వేస్తారు.

మరో జంటను పిలిచి మీకేం కావాలని భార్యను అడుగుతుంది.. ఊరికే పొద్దున్నే తిడతాడని చెబుతుంది. తెలుసుకుంటాడులే, ఇప్పుడొక కంప్లయంటే కదా.. ఇకపై అది కూడా ఉండదని నిరూపమ్ చెబుతాడు. అనంతరం హారిక- ఏక్‌నాథ్‌ని పిలిచి హారిక మీ వాయిస్‌ని తొక్కేస్తుందని శ్రీముఖి చెప్పగా.. డాక్టర్ బాబు ఎందుకు నవ్వుతున్నాడని అవినాష్ అడుగుతాడు. ఆయనకి కూడా ఎక్స్‌పీరియన్స్ కాబట్టి అని పంచ్ విసురుతుంది శ్రీముఖి. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ హరిని పిలిచి నీకు, నాకు పెళ్లయిందని చెబుతుండగా.. అక్కడితో ఆపేస్తే బెటర్ చాలా బాగుంటుందని అంటాడు హరి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియోలో వైరల్ అవుతుండగా.. మరి భార్యాభర్తలు తమ జీవిత భాగస్వాముల గురించి ఏం చెప్పారు? ఎవరెవరికి ఎలాంటి కోరికలు ఉన్నాయి? తెలుసుకోవాలంటే ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం చూసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X