డైరెక్టర్ కాళ్లు పట్టుకున్న శ్రీముఖి.. వదిలేయమంటూ రాములమ్మ భావోద్వేగం

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. తన అందం, చలాకీతనం, వాక్చాతుర్యంతో ఎన్నో షోలను విజయవంతంగా నడిపిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై ఈమెకు పోటీ వచ్చే యాంకర్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి కార్యక్రమాన్ని అయినా అలవోకగా చేసేస్తుంది శ్రీముఖి. బుల్లితెర కార్యక్రమాలతో పాటు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటున్నారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ కాళ్లు పట్టుకుని శ్రీముఖి ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, జులాయి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రీముఖి. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతగా గుర్తింపు లభించకపోవడంతో ఈటీవీలో ప్రసారమైన అదుర్స్ షోకి యాంకర్‌గా బుల్లితెరపై కెరీర్ ప్రారంభించారు. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే తమిళంలో ఎట్టుత్తికమ్ మధ్యాయని, కన్నడంలో చంద్రిక సినిమాలలో నటించారు. తెలుగులో ధనలక్ష్మీ తలుపు తడితే, ఆంధ్రా పోరి, నేను శైలజ, సావిత్రి, జెంటిల్మెన్, మనలో ఒక్కడు, బాబు బాగా బిజీ, క్రేజీ ఆంకుల్స్ తదితర సినిమాలలో నటించింది శ్రీముఖి.

Sreemukhi Gets Emotional on Maa Inti Bangaram Sets Touches Director Nandini Reddy s Feet

అదుర్స్‌తో పాటు మనీ మనీ, సూపర్ మామ్, పటాస్ షోలకు యాంకర్‌గా వ్యవహరించారు. ఇక సైమా అవార్డ్స్ 2015కు హోస్ట్‌గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీముఖి. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచి రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం స్టార్ మాలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం, మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ తదితర కార్యక్రమాలకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక నందినీ రెడ్డి దర్శకత్వంలో అగ్రనటి సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న మా ఇంటి బంగారం సినిమాలో శ్రీముఖి కీలకపాత్ర పోషిస్తున్నారు.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, హిమాంక్ దువ్వూరు, రాజ్ నిడిమోరులు నిర్మిస్తున్నారు. సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ సినిమాకు నిర్మాతగా పాటు కథను కూడా అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సమ్మర్ కానుకగా మే 15న మా ఇంటి బంగారం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో షూటింగ్‌లో పాల్గొనేందుకు సెట్స్‌కు వచ్చిన శ్రీముఖిని దర్శకురాలు నందినీ రెడ్డితో పాటు చిత్ర యూనిట్ ఆటపట్టించింది. దీనికి సంబంధించిన వీడియోను శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఈ వీడియోలో శ్రీముఖి గుమ్మం దాటి లోపలికి వస్తుండగా అందరూ క్లాప్స్ కొట్టండి. శ్రీముఖిగారు వచ్చారు మన షూటింగ్‌కి, ఆహోరాత్రాలు వెయిట్ చేస్తున్నాం.. మీకు స్వాగతం, సుస్వాగతం వెల్‌కమ్ బ్యాక్ టూ మా ఇంటి బంగారం.. శ్రీముఖి గారు అంటూ నందిని రెడ్డి ఆటపట్టించారు. నెల రోజులు వెయిట్ చేశాం మేము ఈ బంగారం కోసం.. మేం వెండి అయిపోయామని నందిని రెడ్డి ర్యాగింగ్ చేయడంతో శ్రీముఖి సిగ్గుపడిపోయింది. ఇక చాలా బాబోయ్ అంటూ నందిని రెడ్డి కాళ్లు పట్టుకోబోయింది.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. అది కాస్త ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ.. ఈ ఆట పట్టించడం నిజంగా ఎంతో ముచ్చటగానూ, ప్రేమతో నిండిపోయింది. నందిని అక్కా.. ఈ అందమైన బంగారు ప్రపంచంలో నన్ను ఒక భాగంగా చేసినందుకు నీకు ధన్యవాదాలు. సెట్స్‌లో నేను గడిపిన సమయం ఎంతో అద్భుతంగా సాగింది. అది అప్యాయత, నవ్వులు, ఎన్నో మధుర జ్ఞాపకాలతో నిండిపోయింది. ప్రతి ఒక్కరితో పాటే త్వరలోనే థియేటర్లలో మా ఇంటి బంగారాన్ని ఆస్వాదించడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అంటూ శ్రీముఖి రాసుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X