దీపిక రంగరాజు ముందే ప్లేట్ విసిరికొట్టి.. యాంకర్ శ్రీముఖి అసహనం

బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు శ్రీముఖి. అందంతో పాటు చలాకీతనం, తన వాక్చాతుర్యంతో ఎలాంటి కార్యక్రమాన్ని అయినా అవలీలగా హోస్ట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, బుల్లితెరపై షోలతో దూసుకెళ్తున్నారు శ్రీముఖి. ముఖంపై చెరగని చిరునవ్వుతో కనిపించే రాములమ్మ ఎప్పుడూ కంట్రోల్‌లోనే ఉంటుంది. అలాంటి శ్రీముఖి ఓ షోలో సీరియస్ అయ్యింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. వారం వారం వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలతో ఆటలు ఆడిస్తూ, పాటలు పాడిస్తూ ఆదివారం విత్ స్టార్ మా షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు శ్రీముఖి. తాజాగా ఈ వారం కూడా సరికొత్త థీమ్, అల్లరితో వచ్చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోలను స్టార్ మా విడుదల చేసింది. ఈ వారం బ్యాచిలర్ పార్టీ అనే థీమ్‌తో మీ ముందుకు వచ్చేశామంటూ శ్రీముఖి గోలగోల చేసింది.

Sreemukhi Gets Serious on Deepika Rangaraju on Star Maa Show Throws Plate at Contestant in Viral Promo

నిన్న విడుదల చేసిన ప్రోమోలో జబర్దస్త్ నూకరాజును ఒక జ్యోతిష్యుడిగా తీసుకొచ్చి అతనితో ఫన్ రాబట్టింది. ఒక్కో కంటెస్టెంట్‌ని పిలిచి వారితో చీటిలు తీయించాడు నూకరాజు. తొలుత బాలును పిలిపించి నీ పెళ్లి నిజామాబాద్‌లో అవుతుందని చెప్పడంతో యాంకర్ శ్రీముఖి సిగ్గుతో మెలికలు తిరుగుతుంది. అయితే మా ఇద్దరి మధ్యలో అవినాష్ గాడు ఉంటాడని ఫైర్ అయ్యింది శ్రీముఖి. గత కొంతకాలంగా శ్రీముఖికి- బాలుకి మధ్య లవ్ ట్రాక్ బాగా వర్కవుట్ అవుతోంది. తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా పండింది. శుక్రవారం వదిలిన ప్రోమోలో బాలుని పొగిడేసింది ఈ స్టార్ యాంకర్.

తొలుత బాలుని పిలిచిన శ్రీముఖి ముగ్గు వేయమని టాస్క్ ఇచ్చింది. ముగ్గు వేస్తావా నువ్వు అని అడగ్గా.. చిన్నప్పుడు ఇంట్లో వేసిన అలవాటుందని బాలు చెప్పడంతో నువ్వు హాజ్బెండ్ మెటీరియల్ అని అతని బుగ్గ గిల్లింది. ఆ వెంటనే కార్తీక దీపం ఫేమ్ జ్యోత్స్న, బాలులు ముగ్గులు వేశారు. బాలు దగ్గరికి వెళ్లిన అవినాష్.. ఏంటీ కుక్క బొమ్మ వేస్తున్నారు అమ్మగారి బొమ్మా అని పంచ్ వేయడంతో శ్రీముఖి షాక్ అవుతుంది. తర్వాత సెలబ్రిటీలు అందిరితో బట్టలు ఉతికిస్తుంది. పండు గాడు చూడు ఎంత నేచురల్‌గా ఉతుకుతున్నాడో అంటాడు ఎక్స్‌ప్రెస్ హరి.

సెట్‌లో ఉన్న వాళ్లందరి బట్టలు ఉతికిస్తున్నారా మాతో.. ఎవడ్రా సాక్స్‌లు వేసింది అని మండిపడుతుంది హిమజ. నాదే ఒకటి అక్కడుందా అని అంటాడు నిఖిల్. నాకే చుక్కలు చూపిస్తున్నారు మధ్యాహ్నం అంటుంది శ్రీముఖి. తర్వాత ప్లేట్స్ కడగమని టాస్క్ ఇస్తుంది రాములమ్మ. సరిగ్గా కడగమని అవినాష్ హడావుడి చేయడంతో నీళ్లు విసిరికొడతాడు నిఖిల్ విజయేంద్ర సింహ. అరియానా, దీపిక రంగరాజులు ప్లేట్స్ కంప్లీట్ చేశామని చెప్పడంతో మన లేడీస్ ఎంతో కష్టపడి క్లీన్‌గా తోమారని అవినాష్ చూపిస్తాడు. ఆ ప్లేట్స్ చెక్ చేసిన శ్రీముఖికి ప్లేట్ నిండా మురికి కనిపించడంతో ఎంత నీట్‌గా కడిగిందో అంటూ దీపిక రంగరాజు ముందే విసిరికొట్టడంతో అంతా షాక్ అవుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more about: sreemukhi deepika rangaraju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X