twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీముఖి మెడకు కొత్త వివాదం.. ఎవరిని టార్గెట్ చేయలేదు బిగ్‌బాస్ బ్యూటీ క్లారిటీ

    |

    టాలీవుడ్‌ హీరోయిన్, టాప్ యాంకర్ శ్రీముఖి మెడకు కొత్తగా ఓ వివాదం చుట్టుకొన్నది. ఓ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల విద్యానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మీడియాలో చర్చనీయాంశమైంది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై శ్రీముఖి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఊహకు సంబంధించినంత వరకు తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. శ్రీముఖి ఇచ్చిన వివరణ ఏమిటంటే..

    ఒక కులాన్ని ద్వేషించారని

    ఒక కులాన్ని ద్వేషించారని


    కొద్దికాలం క్రితం జెమిని టెలివిజన్‌లో కామెడీ స్కిట్‌కు యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరించారు. జూలకటక అనే షో సందర్భంగా బ్రహ్మణులను కించపరిచే విధంగా కామెంట్ చేశారనే ఆరోపణలపై విద్యానగర్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో శ్రీముఖి మెడకు వివాదం చుట్టుకొన్నది.

    శ్రీముఖిపై కేసు నమోదు నిజమే

    శ్రీముఖిపై కేసు నమోదు నిజమే

    శ్రీముఖికి వ్యతిరేకంగా నమోదైన ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ స్పందిస్తూ.. సోమవారం రాత్రి ఫిర్యాదు నమోదైన విషయం నిజమే. జూలకటక షోలో ఓ కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై కేసు నమోదైంది. మేము కేసు నమోదు చేశాం. కొన్ని వీడియోలను పరిశీలిస్తున్నాం. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై నిర్ణయం తీసుకొంటామని అన్నారు.

    2018 జరిగితే ఇప్పుడా కంప్లయింట్

    2018 జరిగితే ఇప్పుడా కంప్లయింట్

    శ్రీముఖి వివాదంపై స్పందిస్తూ.. 2018లో ఆ షోలో పాల్గొన్నాను. అప్పుడు ఎవరూ కూడా దానిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. రెండేళ్ల తర్వాత ఆ విషయాన్ని తవ్వి కంప్లైయింట్ చేశారనే విషయం అర్ధం కావడం లేదు. ఆ షోలో ఎలాంటి కంటెంట్ వారిని హర్ట్ చేసిందో అర్థంకావడం లేదు. ఒకసారి ఈ వీడియోను చూసిన తర్వాతే నేను పూర్తిగా వివరణ ఇస్తాను. ఒకవేళ నాకు తెలియకుండా ఎవరినైనా నొప్పిస్తే అందుకు క్షమాపణలు చెబుతున్నాను అని అన్నారు.

    Recommended Video

    Anchor Sreemukhi About Her Movie Career
    నేను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చు

    నేను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చు

    అలాగే జూలకటక షోకు సంబంధించిన కంటెంట్‌కు తాను బాధ్యత వహించే అవకాశమే లేదు. కామెడీ షోలో వ్యంగ్యాస్త్రాలు సాధారణంగా ఉంటాయి. ఓ కమ్యూనిటీని ఎప్పుడూ టార్గెట్ చేసిన దాఖలాలు లేవు. సమాజంలో ప్రతీ కులాన్ని తాను సమానంగానే చూస్తాను. ఈ విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను అని శ్రీముఖి చెప్పారు.

    English summary
    Actor and Anchor Sreemukhi given clarity about contraversy comments on a community in Joolakataka show. She said, It was 2018 show. I never made any derogatory comments on any community. If so, I would give apology to them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X