త్వరలో పెళ్లి పీటలెక్కనున్న శ్రీముఖి? స్టార్ యాంకర్ పెళ్లి డేట్ ఇదే?

టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, వాక్చాతుర్యంతో తెలుగు బుల్లితెరపై హోస్ట్‌గా దూసుకెళ్తున్నారు ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి వాతావరణంలో అయినా జోష్ తీసుకురాగల టాలెంట్ ఆమె సొంతం. 30 క్రాస్ చేసినా ఇప్పటి వరకు పెళ్లి మాటెత్తకపోవడంతో ఆమె గుడ్‌న్యూస్ ఎప్పుడు చెబుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీముఖి. ఈ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ అగ్రనటి సమంత తాజాగా నటిస్తున్న మూవీ మా ఇంటి బంగారం. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరులు కలిసి నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు. జూన్ 19న మా ఇంటి బంగారం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 15న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖిని తన పెళ్లి గురించి యాంకర్ సుమ ప్రశ్నించారు. దీనికి శ్రీముఖి స్టేజ్‌పై ఆన్సర్ ఇచ్చారు.

Sreemukhi Gives a Hint About Her Marriage Plans at Maa Inti Bangaram Pre Release Event

తనకు మా ఇంటి బంగారం మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు దర్శకురాలు నందనీ రెడ్డి పాదాలకు మొక్కింది శ్రీముఖి. నన్ను భరించి, నన్ను ఓపికగా ఒప్పించి, చిన్నపిల్లలా నడిపించి.. ఈ సినిమాలో ఒక బంగారంలా తీర్చిదిద్దినందుకు థ్యాంక్స్. రాజ్ అండ్ డీకే గారు తెలుగువాళ్లని మాకు తెలియదు. ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ చూసిన తర్వాత మా సమంత గారిని సీజన్ 2లో ఒక డిఫరెంట్‌గా, ఎనర్జిటిక్‌గా చూపించిన తర్వాత ఇలాంటి వారు తెలుగులో ఎందుకు ఉండరు అనిపించింది. రాజ్ సార్ వాళ్లు కూడా టాలీవుడ్‌కి వచ్చి ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో మా ఇంటి బంగారం అనే కథ మీ నుంచి రావడం, అందులో నేను భాగం కావడం.. రాజ్ సార్‌ వర్క్‌కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయానని శ్రీముఖి అన్నారు.

ఈ సినిమాలో నటించిన వారంతా డార్లింగ్స్.. అందరితో బాగా కలిసిపోయాం. ట్రాలాలా అనే ఈ బ్యానర్‌పై శుభం అనే సినిమాను మీరు ఎంతగానో ఇష్టపడ్డారు. దాని తర్వాత మా ఇంటి బంగారంలో సాక్షాత్తూ మన మేలిమి బంగారమే వస్తున్నప్పుడు మీరంతా దీనిని బ్లాక్‌బస్టర్ హిట్ చేస్తారని ఆకాంక్షిస్తున్నా. సమంత గారి గురించి చాలా చెప్పాలి.. ఆమె గురించి వినడం తప్పితే, ఆవిడని డైరెక్ట్‌గా చూడటం, ఆవిడతో వర్క్ చేయడం, ఎలా ప్రవర్తిస్తారు? ఎలా మాట్లాడతారు? అనేది లైవ్‌లో చూశా. 15 సంవత్సరాల ఇండస్ట్రీ జర్నీ ఒకెత్తు.. ఇంత స్టార్‌డమ్ ఒకెత్తు. అన్ని భాషలలో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి సమంత గారు.

చాలామంది ఒక స్థాయికి చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోతారు. కానీ సమంత గారు మాత్రం నిత్యం ఆకలితో ఉంటారు. ఈ జనరేషన్‌లో ఇలాంటి అమ్మాయిలు చాలామందిని ఇన్‌స్పైర్ చేస్తుంటారు. సమంత గారి మీద మాకు ఆకాశమంత ప్రేముంది. మా ఇంటి బంగారంని థియేటర్స్‌లో జూన్ 19న అందరూ చూడాల్సిందిగా మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న కోడలిని కూడా ఆశీర్వదించండి, ఈ వేళా విశేషంలో మన పెళ్లి కూడా జరిగిపోవాలని కోరుకుంటున్నానని శ్రీముఖి అనడంతో అంతా అరుపులు, కేకలతో గోల గోల చేశారు.

ఇంతలో యాంకర్ సుమ కనకాల వచ్చి.. ఇందాక రాని వాళ్లందరికీ కూడా ఈ విషయం గుర్తుచేస్తున్నాను. నీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. ఈ సినిమా సక్సెస్ తర్వాత అని చెప్పావు. మంటపం రెడీ, క్యాటరింగ్ రెడీ, పెళ్లి కొడుకు దొరికితే పెళ్లి జరిగిపోతుందని సుమ చెప్పింది. నేను కూడా ఆయన కోసం వెయిటింగ్ అని శ్రీముఖి ఆన్సర్ ఇచ్చింది. ఎక్కడో ఒక చోట మీ కోసం పుట్టే ఉంటాడని సుమ అన్నారు. ప్రస్తుతం శ్రీముఖి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె పెళ్లిపై పరోక్షంగా హింట్ ఇచ్చేశారా? త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X