అదంతా అబద్దం.. హిమజ, హేమలకు కౌంటర్.. వాటిని పట్టించుకోకండి.. శ్రీముఖి కామెంట్స్

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంత వరకు శ్రీముఖి అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ.. ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తుందని అందరూ అనుకున్నా.. చివరి నిమిషంలో ఫలితం తారుమారైంది. టైటిల్ గెలిచి రాహుల్ విన్నర్‌గా నిలిచి.. శ్రీముఖి రన్నరప్‌గా మిగిలిపోయింది. రాహుల్ విజేతగా నిలిచి.. తమకు మాత్రం శ్రీముఖే విన్నర్ అని ఆమె ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన శ్రీముఖి.. విహారయాత్రలో భాగంగా మాల్దీవులకు వెళ్లింది. గతవారం రోజులుగా అక్కడే ఎంజాయ్ చేస్తోన్న శ్రీముఖి.. మొదటి సారిగా నిన్న లైవ్‌లోకి వచ్చి ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ క్రమంలో అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చింది.

అదంతా అబద్దం..

అదంతా అబద్దం..

‘షో స్క్రిప్ట్‌డ్ అంటూ అందరూ అనుకుంటారు కానీ అదంతా అబద్దమని కుండబద్దలు కొట్టేసింది. అది స్క్రిప్ట్‌డ్ షో అని.. నేను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లకంటే ముందు.. నాకు కూడా చాలా మంది చెప్పారు.. నేను వ్యక్తిగతంగా ఫీల్ అయితే కానీ ఏదీ నమ్మను.. నేను చెబుతున్నాను.. నమ్మండి.. అది స్క్రిప్ట్‌డ్ షో కాదు..'అని తెల్చి చెప్పింది.

 హిమజ, హేమల కామెంట్స్

హిమజ, హేమల కామెంట్స్

ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన హేమ, హిమజలు శ్రీముఖిపై నెగెటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీముఖి కావాలని నటిస్తుందని, అక్కడివి ఇక్కడ.. ఇక్కడివి అక్కడ చెప్పేదని కామెంట్లు చేశారు. అయితే వాటిపై స్పందించాల్సిందిగా శ్రీముఖిని కోరారు.

పట్టించుకోకండి..

పట్టించుకోకండి..


‘అలాంటవన్నీ పట్టించుకోకండి.. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.. హౌస్‌లో ఉన్నంత సేపు నాతో చాలా బాగా ఉన్నారు.. ఎలిమినేట్ అయి వెళ్లేటప్పుడు కూడా నా గురించి బాగానే చెప్పారు.. బయటకు వచ్చాక నా ఫ్యామిలీ మెంబర్స్ వాటి గురించి చెప్పారు..కౌంటర్ అటాక్ ఇవ్వడం ఎందుకని అనిపించింది.. హౌస్‌లో జరిగిన విషయాలను అక్కడే వదిలేద్దామని ఫిక్స్ అయ్యా.. అందుకే వారి మాటలను పట్టించుకోకండి.. అంతా వదిలేయండ'ని అభిమానులను కోరింది.

త్వరలోనే ఫ్యాన్ మీట్..

త్వరలోనే ఫ్యాన్ మీట్..


హైద్రాబాద్ తిరిగి వస్తున్నాను. ఇక్కడ ఇదే చివరి రోజు. ఆదివారం రాత్రి 9గంటలకల్లా హైద్రాబాద్‌కు వచ్చేస్తున్నాను. వచ్చాక అందరినీ కలుస్తాను. త్వరలోనే ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేస్తాను. ఈవెంట్స్‌లో భాగంగా ఒక్కో జిల్లాకు వచ్చినప్పుడు అక్కడి ఫ్యాన్స్‌ను కలుస్తాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X