నడిరోడ్డు మీద శ్రీముఖికి షాక్ ఇచ్చిన వ్యక్తి.. దెబ్బకు మాడిపోయిన శ్రీముఖి ముఖం.. అసలు ఏమైందంటే?
ఇప్పుడు తెలుగు టెలివిజన్ లో టాప్ యాంకర్స్ లో ఒకరిగా దూసుకెళ్తున్న శ్రీముఖి పటాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అది కాక అనేక షోల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ షోతో సినిమాల్లో కూడా రాణించాలని చూస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తు ఉంటుంది. అడపాదడపా సినిమాల్లో కూడా నటించే ఆమె ఒక వ్యక్తి కారణంగా షాక్ తిన్నది. ఆ వివరాల్లోకి వెళితే

సినిమాలలో ఎంట్రీ
బుల్లితెర కంటే ముందే సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'జులాయి' సినిమాలో హీరో చెల్లెలు పాత్రతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్' అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. అయినా క్రేజ్ అయితే దక్కలేదు, శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో సైతం కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత 'నేను శైలజ' సినిమాలో రామ్ చెల్లెలుగా కూడా శ్రీ ముఖి నటించింది.

స్టార్ యాంకర్
ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే బుల్లితెరపై యాంకర్‌గా పని చేసే అవకాశాన్ని అందుకున్న శ్రీ ముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. ఆ తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జూలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో టీవీ షోలను విజయవంతంగా నడిపించింది.

పటాస్ క్రేజ్
అయితే అన్నిటికంటే కూడా 'పటాస్' ఆమె కెరీర్‌ను మార్చేసింది. ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు రాని క్రేజ్ ఆమెకు టెలివిజన్ యాంకర్ గా వచ్చింది. ఆమెకు పటాస్ షో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కడ లభించిన క్రేజ్ తో బిగ్‌బాస్ 3కి పిలుపు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిన ఆమె రన్నరప్‌గా నిలిచి మరింత గుర్తింపు తెచ్చుకుంది.

హీరోయిన్ గా
ఇక బిగ్ బాస్ తర్వాత కాస్త టీవీ షోల యాంకరింగ్ కి గ్యాప్ తీసుకున్న ఈ భామ వరుసగా యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తోంది. ఇక సినిమా ఫంక్షన్లతో పాటు ఇంటర్వ్యూలు సైతం చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న ఆమెకు తాజాగా ఒక షాక్ తగిలింది. ముక్కు అవినాష్ ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లిలోనూ శ్రీముఖి మంచి హడావిడి చేసింది.

జగిత్యాలకు వెళ్లి
పెళ్లిలో హడావిడి చేసిన ఆమె పెళ్లి అయిన తర్వాత అతని సొంత గ్రామమైన జగిత్యాలకు రిసెప్షన్ లో పాల్గొనేందుకు వెళ్ళింది. అక్కడ జరిగిన విశేషాలు శ్రీముఖి తన యూట్యూబ్ ఛానల్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఇక జగిత్యాల జిల్లాలో బైక్ పై అవినాశ్ గ్రామానికి వెళుతూ, శ్రీముఖి నానా రచ్చ చేసింది. అయితే అక్కడే ఒక అనుకోని ఘటన జరిగింది. రోడ్డుపై సైకిల్ పై వెళుతున్న ఓ వ్యక్తిని ఆపిన శ్రీముఖి ఆపి తనను గుర్తు పట్టావా? అని అడిగింది.
Recommended Video

షాకిచ్చాడు
అయితే అతను చాలా కూల్ గా తనకు నువ్వు ఎవరో తెలియదని సింపుల్ గా తేల్చేశాడు. దీంతో శ్రీముఖి ఇంతకాలం తాను ఒక సెలబ్రిటీ అని ఫీలవుతున్న భ్రమ నుంచి ఒక్కసారిగా నేలపైకి దిగినట్టయింది. అయితే ఆ వ్యక్తి ముక్కు అవినాష్ మాత్రం తెలుసు, అది కూడా అతడు నటుడిగా కాదు, మా ఊరి వ్యక్తి కావడంతో గుర్తు పట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇక షోరూం ఓపెనింగ్ అప్పుడు వచ్చే జనాలను చూసి ఇంత కాలం నేనో మంచి సెలబ్రిటీ అయినట్లు భావించానని, కానీ అదంతా భ్రమని అర్ధం అయిందని శ్రీముఖి తేల్చేసింది.


Click it and Unblock the Notifications











