For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీముఖి బోల్డ్ అవతార్: ఘాటు అందాలతో మత్తెక్కిస్తున్న రాములమ్మ.. గతంలో చూడని విధంగా.!

  By Manoj Kumar P
  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అందంతో పాటు అభినయం కూడా కనబరిచే ఈ భామ.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో షోలను హోస్ట్ చేస్తూ సత్తా చాటుతోంది. ఇక, ఈ మధ్య వచ్చిన బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత చేరువైంది. ఈ నేపథ్యంలో శ్రీముఖి తాజాగా షేర్ చేసిన ఫొటోలు షాక్‌కు గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏ ఫొటోలు పంచుకుంది.? వివరాల్లోకి వెళితే...

  ఇక్కడా ఉంటుంది.. అక్కడ కూడా మెరుస్తోంది

  ఇక్కడా ఉంటుంది.. అక్కడ కూడా మెరుస్తోంది

  శ్రీముఖి బుల్లితెర యాంకర్‌గా ఎన్నో షోలు చేసి సుపరిచితురాలు అయిపోయింది. దీంతో టెలివిజన్‌లో ఆమె వన్ ఆఫ్ ది టాప్ యాంకర్‌గా నిలిచింది. అదే సమయంలో ఆమె చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా ‘జులాయి', ‘నేను శైలజ', ‘జెంటిల్‌మన్', ‘బాబు బాగా బిజీ' సహా ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేస్తోంది.

  వాళ్లు షాక్ ఇవ్వడంతో శ్రీముఖి ఆశలు ఆవిరి

  వాళ్లు షాక్ ఇవ్వడంతో శ్రీముఖి ఆశలు ఆవిరి

  గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ -3కి శ్రీముఖి ఒక కంటెస్టెంట్‌గా వెళ్లింది. షో ఆరంభంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ హాట్ బ్యూటీ.. చిన్నగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీంతో టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది. కానీ, ఊహించని విధంగా ఆమెను వెనక్కి నెడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు సింగర్ రాహుల్ సిప్లీగంజ్‌కు జై కొట్టారు.

  ఏదో అనుకుంటే.. ఇంకోదో అవుతోంది

  ఏదో అనుకుంటే.. ఇంకోదో అవుతోంది

  బిగ్ బాస్ సీజన్ -3 ముగిసిన తర్వాత ఆ షోలో కంటెస్టెంట్లు వెళ్లిన చాలా మంది తమ తమ పనులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక, విన్నర్ రాహుల్ అయితే బాగా పాపులర్ అవడంతో పాటు ఎన్నో అవకాశాలను దక్కించుకుంటున్నాడు. అయితే, రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

  ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తిట్టేవాళ్లూ ఉన్నారు

  శ్రీముఖిని అభిమానించే వారు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందే ఉన్నారు. ఆమెకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. దీని వల్లే ఈ హాట్ యాంకర్ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది. అదే సమయంలో ఆమెను వ్యతిరేకించే వాళ్లు కూడా ఉన్నారు. చాలా సందర్భాల్లో శ్రీముఖి చేస్తున్న షోలు.. వ్యవహరిస్తున్న తీరు పట్ల వారంతా విమర్శల వర్షం కురిపించారు.

  శ్రీముఖి బోల్డ్ అవతార్.. షాక్‌లో ఫ్యాన్స్

  ఇప్పటి వరకు సంప్రదాయమైన వస్త్రాలతో కనిపించి మెప్పించింది తెలుగు బుల్లితెర యాంకర్ శ్రీముఖి. అయితే, ఊహించని విధంగా ఆమె హాట్ ఫొటోలను షేర్ చేసింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈమె కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో తన ఎద అందాలతో కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫొటోలు చూసి శ్రీముఖి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

  ఘాటు అందాలతో మత్తెక్కిస్తున్న రాములమ్మ

  బుల్లితెర రాములమ్మ శ్రీముఖి మూడు ఫొటో షూట్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ మూడింటిలోనూ ఆమె తన లోదుస్తులతో కవ్విస్తోంది. అన్నింటిలోనూ బోల్డ్‌గా కనిపిస్తూ మత్తెక్కిస్తోంది. శ్రీముఖి కొంటెగా చూస్తున్న ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  English summary
  Telugu Biggest Reality Show Bigg Boss 3 Telugu runner up Sreemukhi left for the Maldives along with her brother Sushruth and close friends on a vacation after staying in the Bigg Boss house for 100 days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X