కలిసిపోయిన విన్నర్, రన్నర్.. జిగేల్ రాణి స్టెప్పులేసిన శ్రీముఖి, రాహుల్

బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సీజన్‌లో అందరి కంటే ఎక్కువగా ఫేమస్ అయింది. పీవీవీఆర్ (వరుణ్, వితికా, పునర్నవి, రాహుల్)గ్యాంగ్. అలీ రెజా, శివజ్యోతి, హిమజ లాంటి వారికి కూడా అంతకు ముందు ఉన్న క్రేజ్ కంటే ఎక్కువే వచ్చింది. తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తి, శ్రీముఖిలాంటి వారికి ఉన్న ఫేమ్‌లో కాస్త తగ్గిపోయింది. ఇలా బిగ్‌బాస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉపయోగపడుతుంది. మొత్తానికి మూడో సీజన్ పూర్తవ్వగా.. అందులో రాహుల్ విన్నర్, శ్రీముఖి రన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

రాహుల్‌ను టార్గెట్ చేసిన శ్రీముఖి..

రాహుల్‌ను టార్గెట్ చేసిన శ్రీముఖి..

మూడో సీజన్ మొదటి నుంచీ శ్రీముఖి.. రాహుల్‌ను టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. సీజన్ మొత్తం నామినేట్ చేస్తా అనేంత వరకు వ్యవహారం చేరింది. కొన్ని వారాల పాటు నిరంతరంగా నామినేట్ చేస్తూనే వచ్చింది. రాహుల్ సేవ్ అవుతూనే వచ్చాడు. ఈ సీజన్‌లో అత్యధికంగా నామినేట్ అయింది కూడా రాహలే. అదంతా శ్రీముఖి పుణ్యమే.

రాహుల్‌కు పెరిగిన సింపతి..

రాహుల్‌కు పెరిగిన సింపతి..

అప్పటి వరకు శ్రీముఖికి ఎంతో ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. రాహుల్ వ్యవహారంలో ఆమె ప్రవర్తననతో అంతా తలకిందులైంది. ఈ సీజన్ మొదలైనప్పుడు శ్రీముఖే విజేతగా నిలుస్తుందని అందరూ అనుకున్నప్పటికీ రానురాను పరిణామాలు మారుతూ వచ్చాయి. కంటిన్యూస్‌గా రాహుల్‌ను టార్గెట్ చేస్తూ.. నామినేట్ చేయడం వల్ల అతనికి సింపతి పెరుగుతూ వచ్చింది.

పునర్నవితో కెమెస్ట్రీ..

పునర్నవితో కెమెస్ట్రీ..

శ్రీముఖి వ్యవహారం.. రాహుల్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. రెండు మూడు వారాల్లోనే వెనక్కి వచ్చేస్తాడని అనుకుంటే.. చివరి వరకు ఉండేలా చేసింది. ఇదే కాకుండా పునర్నవితో స్నేహం, రహస్య బంధంలాంటింది నెరపడం, వీరిద్దరి కెమెస్ట్రీకి జనాలు కూడా కనెక్ట్ కావడం రాహుల్‌కు కలిసి వచ్చింది.

హైలెట్‌గా మారిన జోడి..

హైలెట్‌గా మారిన జోడి..

ఈ సీజన్ మొత్తానికే రాహుల్-పునర్నవి జోడి హైలెట్‌గా మారింది. ఇదే విషయాన్ని నాగ్ కూడా ప్రస్తావిస్తూ.. ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న హింట్ ఇస్తుండే వాడు. ఈ వ్యవహారం గురించి ఎన్నిసార్లు అడిగినా.. ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చినా.. జనాలు మాత్రం ఏదో ఉందని అనుకునే వారు.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా..

ఈ వ్యవహారాలన్ని రాహుల్‌ను విన్నర్ అయ్యేలా చేశాయని అందరికీ తెలిసిందే. అయితే బయటకు వచ్చాక అయినా అన్ని మరిచిపోయి రాహుల్‌తో కలుస్తుందని అందరూ భావించారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక వెకేషన్‌లో భాగంగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన వచ్చిన శ్రీముఖి.. తన రొటీన్ పనుల్లో బిజీగా గడిపింది. మిగతా కంటెస్టెంట్లతోనూ ఎలాంటి ఈవెంట్‌లోనూ పార్టిసిపేట్ చేసేది కాదు. దీంతో శ్రీముఖి ఇంకా ఏది మరిచిపోలేదని వారి మధ్య ఇంకా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలానే ఉందేమోనని అనుకున్నారు.

రాహుల్‌ను హగ్ చేసుకుని ఉన్న ఫోటో..

రాహుల్‌ను హగ్ చేసుకుని ఉన్న ఫోటో..

బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన వాటిని మరిచిపోయిన శ్రీముఖి.. రాహుల్ గ్యాంగ్‌తో నిన్న రాత్రి బాగానే ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాహుల్‌ను హగ్ చేసుకుని ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతం గత: అసలు రిలేషన్ షిప్ ఇప్పుడు మొదలైంది అంటూ రాహుల్ కామెంట్ చేశాడు. ఇక వీరంతా కలిసి బాగానే ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా వీరిద్దరు జిగేల్ రాణి అంటూ అదిరిపోయే స్టెప్పులేసినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X