శ్రీముఖి కౌగిలిలో ఆ నటుడు... నీతో తనివి తీరదంటూ రాములమ్మ బోల్డ్ కామెంట్స్

Photo Courtesy: Star Maa

ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ యాంకర్‌లలో శ్రీముఖి ఒకరు. సినిమా ఈవెంట్స్‌లో యాంకర్ సుమ కనకాల డామినేషన్ కనిపిస్తుండగా.. బుల్లితెరపై మాత్రం శ్రీముఖి రాజ్యమేలుతున్నారు. అందం, చలాకీతనంతో ఎలాంటి కార్యక్రమాన్ని అయినా అవలీలగా చేసుకుంటూ వెళ్తుంది. 30 క్రాస్ చేసి చాలా కాలం అవుతుండగా ఇప్పటి వరకు శ్రీముఖి పెళ్లీ మాటెత్తడం లేదు. తాజాగా ఓ షోలో ఓ బుల్లితెర నటుడితో క్లోజ్‌గా ఉంటూ షాకిచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

పటాస్‌ షోతో బుల్లితెరపై ఎంట్రీ
పటాస్ షోతో కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి.. అనతికాలంలోనే టాప్ యాంకర్‌గా దూసుకొచ్చారు. బుల్లితెరపై బిజీగా ఉంటూనే వెండితెరపైనా సందడి చేసింది. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, నేను శైలజ, జెంటిల్మెన్, సావిత్రి, మనలో ఒక్కడు, బాబు బాగా బిజీ, క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో, భోళా శంకర్ సినిమాలలో శ్రీముఖి నటించారు. ప్రస్తుతం వెండితెరకు దూరంగా కేవలం బుల్లితెరపైనే ఫోకస్ పెట్టి సక్సెస్‌‌ఫుల్‌గా దూసుకెళ్తున్నారు.

Sreemukhi Hugs Vishnukanth in Aadivaram With Star Maa Parivaaram Valentine s Day Special

Photo Courtesy: Star Maa

శ్రీముఖి ప్రేమాయణం, బ్రేకప్
హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోయే శ్రీముఖిపై పలుమార్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. కొందరు స్టార్స్‌తో ఆమెకు లింక్ పెట్టి పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే బిగ్‌బాస్‌ షోలో ఉన్నప్పుడే తన ప్రేమ, బ్రేకప్‌ గురించి బయటపెట్టి తన గురించి వస్తోన్న రూమర్స్‌కు చెక్ పెట్టారు రాములమ్మ. తాను ఎంతో ఇష్టపడిన వ్యక్తితో విడిపోవడాన్ని తట్టుకోలేకపోయానని ఒకానొక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత కూడా పలువురితో బ్రేకప్స్ జరిగాయని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది శ్రీముఖి. తాజాగా ఓ బుల్లితెర నటుడిపై శ్రీముఖి ఇష్టాన్ని పదే పదే బయటపెడుతున్నారు.

వాలంటైన్స్ డే స్పెషల్‌గా శ్రీముఖి షో
ప్రస్తుతం స్టార్ మాలో ఎక్కువగా కనిపిస్తూ.. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు శ్రీముఖి. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ తదితర షోలను రాములమ్మ అద్భుతంగా హోస్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ప్రత్యేకంగా ముస్తాబైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో తన మాటలు, చేతలతో షాకిచ్చింది.

విష్ణుప్రియకు పృథ్వీ లైక్
వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ ప్రోమో స్టార్టింగ్‌లో కంటెస్టెంట్స్‌కు శ్రీముఖి ఓ టాస్క్ ఇచ్చింది. ప్రియేసి చేసే పనులకు ప్రియుడు ఇంప్రెస్ అవుతారా? లేదా? అనే పరీక్ష పెట్టింది. ముందుగా విష్ణుప్రియను పిలిచి చేతిలో చీపురుకట్ట పెట్టి స్టేజ్‌పై చెత్త ఊడిపించింది. విష్ణు చేసిన పనికి ఇంప్రెస్ అయ్యావా? లేదా? అని పృథ్వీరాజ్‌ను అడగ్గా... ఇంప్రెస్డ్ అని బోర్డ్ ఎత్తేశాడు. ప్రేమంటే ఇప్పుడు మా అమ్మగారు చూపిస్తారంటూ రఘు వచ్చి శ్రీముఖి చేతిలో చీపురు పెడతాడు. ఆ వెంటనే శ్రీముఖి... గుండెనిండా గుడిగంటలు సీరియల్ నటుడు బాలు వైపు చూపిస్తూ ఇది నీ కోసమని చీపురుతో చెత్తంతా ఊడ్చేస్తుంది.

శ్రీముఖికి ఆ నటుడి హగ్
ఇంతలో రౌడీ రోహిణి ఇంకో చీపురు పట్టుకుని వచ్చి నీకు ఒక్కదానికేనా బాలు మీద ప్రేమ.. బాలు మీద ప్రేమ నాకూ ఉందని శ్రీముఖికి పోటీగా ఊడ్చేసింది. బాలు ఇంప్రెస్ అయ్యావా? లేదా? అని శ్రీముఖి అడగ్గా.. విష్ణుకాంత్ యస్ అనే థంప్సబ్ సింబల్ ఎత్తేశాడు. నా కోసం ఓ అమ్మాయి ఇలా చేస్తే వెంటనే హగ్ ఇచ్చేవాడిని, కానీ బాలు మాత్రం సైలెంట్‌గా ఉంటాడా అని రఘు పంచ్ విసరడంతో విష్ణుకాంత్ పోడియం దిగొచ్చి శ్రీముఖికి హగ్ ఇచ్చాడు. ఎంతకూ ఇద్దరూ హగ్‌లోనే ఉండిపోవడంతో అవినాష్ వచ్చి శ్రీముఖిని లాగేస్తాడు. దాంతో అప్పుడేనా? ఊడ్చినంత సేపు లేదేంట్రా? అంటూ రాములమ్మ అనడంతో అంతా నవ్వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బుల్లితెరపై లవ్‌ట్రాక్స్
కాగా.. బుల్లితెర షోలలో నటీనటులు హోస్ట్‌ల మధ్య లవ్ ట్రాక్స్ కామన్‌. సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్, పటాస్ ఫైమా - ప్రవీణ్‌లతో పాటు లేటెస్ట్‌గా డిమోన్ పవన్ - రీతూ చౌదరి, కళ్యాణ్ పడాల - తనూజ పుట్టస్వామి తదితర జంటలపై లవ్ ట్రాక్స్ నడిచాయి. వీటిలో నిజముందో లేక స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో కానీ ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేయడంతో పాటు వాటిని ఆదరించారు. ఈ కోవలోనే శ్రీముఖి - విష్ణుకాంత్‌ల మధ్య కూడా లవ్ ట్రాక్ నడిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే స్క్రీన్‌పై వీరిద్దరి జంట బాగుందంటూ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X