అల్లు అర్జున్ ఫ్యామిలికీ ద్రోహం చేయను.. హీరో రామ్ అయితే ఒకే.. చిలిపిగా శ్రీముఖి
యాంకర్ సుమ నిర్వహించే రియాలిటీ షోలో శ్రీముఖి, లాస్య, విష్ణుప్రియ, అవినాష్ పాల్గొన్నారు. వీరంతా కలిసి షోను సందడి సందడిగా మార్చారు. సుమ, శ్రీముఖి మధ్య జరిగిన సరదా సంభాషణ ఫుల్లుగా హాస్యాన్ని పండించింది. అల్లు అర్జున్‌కు చెల్లెలుగా నటించిన ఆమె ఆ విషయంపై ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి చెప్పిన విషయాలు ఏమిటంటే..

ఆ రెండింటిని మార్చుకోను
గతంలోకి వెళ్లి నీ జీవితంలో ఏదైనా మార్పులు చేసుకోవడానికి అవకాశం ఇస్తే.. పటాస్ షో చేయడం, సినీ ఇండస్ట్రీలోకి రావడం అనే విషయాల్లో దేనిని మార్చుకొంటావు అని సుమ అడిగిన ప్రశ్నకు.. ఆ రెండు మార్చుకోను. శ్రీముఖి అని తెలియడానికి ఆ రెండు కారణం. కాబట్టి నా జీవితం నుంచి వాటిని దూరం చేసుకోలేను అని శ్రీముఖి చెప్పారు.

అల్లు అర్జున్‌కు చెల్లెలిగానే
జులాయి చిత్రంలో అల్లు అర్జున్‌కు చెల్లెలుగా, నేను శైలజా చిత్రంలో హీరో రామ్‌కు సిస్టర్‌గా నటించిన నేపథ్యంలో.. ఎవరి సిస్టర్‌గా ఉండటంపై ఇష్టం ఏర్పడిందనే ప్రశ్నకు సమాధానిమిస్తూ.. అల్లు అర్జున్ చెల్లెలుగా నటించడం నాకు చాలా సంతోషం కలిగింది. ఆ విషయాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కూడా చెప్పాను అని శ్రీముఖి వెల్లడించింది.

అల్లు అర్జున్‌కు మోసం చేయలేను
అయితే అల్లు అర్జున్ హ్యాండ్సమ్ కాదా అని అవినాష్ ప్రశ్నించగా.. బన్నీకి స్నేహతో పెళ్లైంది. ఇద్దరు పిల్లలకు కూడా తండ్రి. అలాంటి వ్యక్తికి చెల్లెలుగా ఉండటమే ఇష్టం. ఎందుకంటే అందమైన ఫ్యామిలీకి నేను ద్రోహం చేయలేను. వాళ్ల పాప కూడా క్యూట్‌గా ఉంటుంది అని శ్రీముఖి చెప్పారు. రామ్ ఈజ్ హ్యాండ్సమ్ బాయ్. ఆయనకు చెల్లెలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అన్నారు.
Recommended Video

బిగ్‌బాస్ టైటిల్‌ను తృటిలో
యాంకరింగ్‌తోపాటు హోస్ట్‌గా టాప్ స్థానంలో ఉండే శ్రీముఖి ఇటీవల కాలంలో బిగ్‌బాస్ రియాలిటీ షోలో దుమ్మురేపింది. తృటిలో బిగ్‌బాస్ విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. తాజాగా బతుకు బలైపోయిన బండి అనే షోను ప్రారంభించింది. ఇక పలు షోలలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











