చిన్న గౌనులో పెద్దపాప.. అలా చూస్తూ చంపేస్తోన్న శ్రీముఖి!
శ్రీముఖి.. ఇప్పుడు తెలుగు టెలివిజన్ లో టాప్ యాంకర్స్ లో ఒకరిగా దూసుకెళ్తున్నారు. పటాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ షోతో సినిమాల్లో కూడా రాణించాలని చూస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె చిన్ని గౌనులో చేసిన ఫోటో షూట్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

సినిమాలలో ఎంట్రీ
శ్రీ ముఖి 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'జులాయి' సినిమాలో హీరో చెల్లెలు పాత్రతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్' అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. అయినా క్రేజ్ అయితే దక్కలేదు, శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో సైతం ఒక కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత 'నేను శైలజ' సినిమాలో రామ్ చెల్లెలుగా కూడా నటించింది.

స్టార్ యాంకర్
ఇక సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బుల్లితెరపై యాంకర్‌గా పని చేసే అవకాశాన్ని అందుకుంది శ్రీముఖి. ఈ క్రమంలోనే 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. ఆ తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జూలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో షోలను విజయవంతంగా నడిపించింది. వాటిలో 'పటాస్' ఆమె కెరీర్‌ను మార్చేసింది. ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు రాని క్రేజ్ ఆమెకు టెలివిజన్ యాంకర్ గా వచ్చింది. ఆమెకు పటాస్ షో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కడ లభించిన క్రేజ్ తో బిగ్‌బాస్ 3కి పిలుపు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిన ఆమె రన్నరప్‌గా నిలిచి మరింత గుర్తింపు తెచ్చుకుంది.

హీరోయిన్ గా
ఇక బిగ్ బాస్ తర్వాత కాస్త టీవీ షోల యాంకరింగ్ కి గ్యాప్ తీసుకున్న ఈ భామ వరుసగా సినిమా ఫంక్షన్లతో పాటు ఇంటర్వ్యూలు సైతం చేస్తోంది. సత్తిబాబు తెరకెక్కిస్తున్న 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ కొత్త చిత్రం 'మాస్ట్రో'లోనూ నటిస్తోంది.
Recommended Video
ఎర్ర గౌనులో
ఇక ఇవన్నీ పక్కన పెడితే శ్రీముఖి ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ ద్వారా సంచలనాలకు తెర లేపుతుంది. శ్రీముఖి తరుచుగా చేసే చేసే హాట్ హాట్ ఫోటో షూట్ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా రెడ్ ఫ్రాక్ ధరించి ఫోటో షూట్ చేసింది శ్రీముఖి. చిన్నదైన గౌనులో శ్రీముఖి అందాలు చూపిస్తూ రెచ్చిపోతోంది. అంతే కాదు, కైపెక్కిస్తున్న కళ్ళతో ఆమె చంపేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











