బిగ్ ట్విస్ట్: శ్రీముఖి చేసిన ఈ పొరపాటే రాహుల్‌ను గెలిపించింది.!
బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. గత ఆదివారం ముగిసిన మూడో సీజన్‌లో ప్రముఖ యంగ్ సింగర్ రాహుల్ సింప్లీగంజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అతడికి యాంకర్ శ్రీముఖి నుంచి హోరాహోరీ పోరు ఎదురైంది. అయినప్పటికీ ప్రేక్షకుల మద్దతుతో రాహుల్ బిగ్ బాస్ ట్రోఫీని ముద్దాడాడు. ఈ సీజన్ పూర్తయినప్పటి నుంచి ఓటింగ్ సరళిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఎన్నో అంశాలు చర్చకు వస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన ఓ పరిణామాన్ని తెరపైకి తీసుకు వచ్చారు కొందరు విశ్లేషకులు. ఇంతకీ ఏంటా పరిణామాలు.?
Recommended Video

ఓటింగ్ రాహుల్‌కు కలిసొచ్చింది
మూడో సీజన్‌లో విజేతగా నిలిచిన రాహుల్ సింప్లింగంజ్‌కు ఎన్నో అంశాలు కలిసొచ్చాయి. ముఖ్యంగా అతడు పదిహేను వారాల్లో పదకొండు సార్లు నామినేట్ అవడం కూడా ఒక రకంగా ప్లస్ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతడికి హాట్‌స్టార్‌లో ఓటు వేయడం, మిస్‌డ్ కాల్ చేయడం కూడా ప్రేక్షుకులకు అలవాటు అయిపోయింది. దీంతో రాహుల్ ఎప్పుడు నామినేట్ అయినా ఓట్లు భారీగా పడిపోయాయట.

సానుభూతి వర్కౌట్ అయింది
గత సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోని అందరు కంటెస్టెంట్లు కౌశల్‌ను టార్గెట్ చేశారు. దీంతో అతడిపై సానుభూతి పెరిగిపోయింది. ఫలితంగా సీజన్‌కు విన్నర్ అయ్యాడు. అదే తరహాలో రాహుల్ సింప్లిగంజ్‌కు కూడా వర్కౌట్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. రాహుల్ పలువురు కంటెస్టెంట్లు టార్గెట్ చేసి నామినేట్ చేయడంతో అతడిపై ప్రజల్లో మక్కువ పెరిగిందని అంటున్నారు.

ఒక్క స్టేట్‌మెంట్ సపోర్టును పెంచింది
ఒక ఎపిసోడ్‌లో రాహుల్ నాగార్జునతో ‘సార్ మాది *** కులం. నా కుల వృత్తి అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికీ ఈ వృత్తిని వదిలి పెట్టను. అందుకే హౌస్‌లో ఉన్న కొందరికి నేనే కటింగ్ చేశాను' అని చెప్పాడు. దీంతో అతడికి సదరు సామాజికవర్గం నుంచి మద్దతు లభించిందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరైతే ‘మన కులం వాడు ఫైనల్‌కు చేరాడు.. ఓట్లు వేయండి' అని కూడా ఫ్లెక్సీలు గట్రా పెట్టేసి ప్రచారం చేసేశారు.

పాటలతో మెప్పించాడు
ఇక, రాహుల్ స్వతహాగా సింగర్ కావడం కూడా కొంత కలిసొచ్చిందనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్‌లో తరచూ పాటలు పాడుతూ అందరినీ అలరించేవాడు. అలాగే, అప్పటికప్పుడు ట్యూన్ అనుకుని పాటలు రాసేసి పాడడం ఎంతో మందిని మెప్పించింది. దీనికి తోడు పక్కా మాస్ మసాలా కుర్రాడిలా వ్యవహరించడం కూడా యూత్‌లో క్రేజ్‌ను పెంచేసింది.

లవ్ ట్రాక్ కూడా...
బిగ్ బాస్ హౌస్‌లో అత్యంత హాట్ టాపిక్ అయిన వ్యవహారాల్లో పునర్నవి - రాహుల్ లవ్ ట్రాక్ ప్రధమ స్థానంలో ఉంటుంది. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, రొమాన్స్‌ను ప్రేక్షకులు బాగా చూసేవాళ్లు. ముఖ్యంగా యువత వీరి లవ్ ట్రాక్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేవారు. ఇది కూడా రాహుల్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

శ్రీముఖి చేసిన పొరపాటు ఇదే
అన్నింటి కంటే ముఖ్యంగా శ్రీముఖి చేసిన పొరపాటు రాహుల్‌కు భారీ స్థాయిలో ఓట్లను తెచ్చిపెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. వాళ్ల ప్రకారం.. శ్రీముఖి, రాహుల్‌ను టార్గెట్ చేయడం.. దానికితోడు నిన్ను ప్రతి ఎపిసోడ్ నామినేట్ చేస్తానని ముఖం మీదే చెప్పడం అతడిపై సానుభూతిని పెంచేశాయట. అంతేకాదు, వీళ్ల మధ్య గొడవతో శ్రీముఖి హేటర్లు అందరూ రాహుల్ సపోర్టర్స్‌గా మారిపోయారని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











