నడుమా, నయాగరా జలపాతమా?... యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోలపై కామెంట్స్
'పటాస్' షో నుంచి తప్పుకుంటున్నట్లు యాంకర్ శ్రీముఖి ప్రకటించినప్పటి నుంచి ఈ అంశంపై రకరకాల చర్చ సాగుతోంది. ఆమె నెక్ట్స్ స్టెప్ ఏమిటి? సినిమాల్లోకి వెళ్లబోతోందా? లేక త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజన్ 3లో ఎంట్రీ ఇవ్వబోతోందా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల అభిమానులతో లైవ్ చాట్ చేసిన శ్రీముఖి తాను పటాస్ షో నుంచి ఎందుకు తప్పుకున్నానో త్వరలోనే తెలుస్తుంది, అప్పటి వరకు మీరంతా ఓపిక పట్టాల్సిందే అంటూ ఉత్కంఠ మరింత పెంచారు. తాజాగా ఈ చలాకీ యాంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

నడుము అందాలు ప్రదర్శించిన శ్రీముఖి
జీన్స్, టీషర్ట్ ధరించిన శ్రీముఖి తన నడుము అందాలు ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. షర్టు పైకి లేపి మరీ నావెల్ ఎక్స్ ఫోజ్ చేస్తూ చేసిన ఈ గ్లామర్ షోకు నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. కొందరు ఫ్యాన్స్ ఆమె నడుము అందాలను కవితాత్మకంగా వర్ణిస్తున్నారు.

నడుమా, నయాగరా జలపాతమా?
నడుమా, నయాగరా జలపాతమా? అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. శ్రీముఖి సినిమా రంగంలోకి వస్తే బావుంటుందని, ఆమె బాడీ లాంగ్వేజ్‌కు తగిన స్క్రిప్టు వెండితెరపై వర్కౌట్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నీ నడుము సోయగాలు నన్ను మరిపిస్తున్నవి మన్మధ రాణి
మరొక అభిమాని స్పందిస్తూ... బాబోయ్ మీలో ఇంత అందం ఉందనే విషయం ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేదు. మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. గతంతో పోలిస్తే చాలా స్లిమ్ అయ్యారు అంటూ కామెంట్ చేశారు. ‘నీ నడుము సోయగాలు నన్ను మరిపిస్తున్నవి మన్మధ రాణి' అంటూ మరో ఫ్యాన్ తన అందాలను వర్ణించే ప్రయత్నం చేశాడు.

అభిమానులతో నిజాయితీగా...
అభిమానులతో నిజాయితీగా వ్యవహరిస్తూ శ్రీముఖి సోషల్ మీడియాలో మరింత పాపులర్ అయ్యారు. మీరు మందు కొడతారా? అనే ప్రశ్నకు శ్రీముఖి మొమమాటం లేకుండా సమాధానం ఇచ్చారు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే... అకేషనల్లీ మందు కొడతాను. ఎక్కువగా వైన్ ప్రిఫర్ చేస్తాను. అది ఆరోగ్యం కూడా..'' అంటూ నిజం ఒప్పుకున్నారు శ్రీముఖి.


Click it and Unblock the Notifications











