న్యూస్ పేపర్‌తో అందాలను కవర్ చేసినట్లు.. సెగలు పుట్టించిన శ్రీముఖి, 14 వరకు ఓపిక పడితే..

తెలుగు టెలివిజన్ రంగంలో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది శ్రీముఖి. ఆమె ఎలాంటి షో చేసినా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా పర్ఫామెన్స్ ఇవ్వగలదు. ఇక తెలుగు బుల్లితెరపై మిగతా యాంకర్స్ హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. కేవలం మినీ స్క్రీన్ పైనే కాకుండా అప్పుడప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా వారి సత్తా చూపిస్తున్నారు. ఇక శ్రీముఖి కూడా అదే తరహాలో నడుస్తోంది. ఇక చాలా రోజుల తరువాత శ్రీముఖి కొన్ని గ్లామరస్ ఫొటోలతో ఆమె ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చింది.

 అందరూ షాక్ అయ్యేలా ప్రొటోషూట్

అందరూ షాక్ అయ్యేలా ప్రొటోషూట్

ఇక చాలా రోజుల తరువాత శ్రీముఖి గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లకు ఒక విధంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ ఫోటోలను మొదట చూడగానే ఒక్క సెకండ్ వరకు ఆమె డ్రెస్ కాకుండా న్యూస్ పేపర్ తో అందాలని కవర్ చేసిందా అని అంతా అనుకున్నారు. న్యూస్ పేపర్ లాంటి డిజైన్ లో డ్రెస్ రెడీ చేసుకున్న శ్రీముఖి సరికొత్తగా ఆకట్టుకుంది

గ్లామర్ తో పోటీగా..

గ్లామర్ తో పోటీగా..

పటాస్ షో ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ అందుకున్న శ్రీ ముఖి కూడా అవకాశం వస్తే వెండితెరపై సత్తా చాటుతోంది. గ్లామర్ గీత ఎక్కువగా దాటకుండా సేఫ్ జోన్ లో ఫోటోలకు పొజిస్తోంది. శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో రియాలిటీ షోలకు కాస్త దూరంగానే ఉంటోంది. అనసూయ, రష్మీ వంటి హాట్ యాంకర్స్ కి అమ్మడు తన గ్లామర్ షోతో హద్దులు దాటకుండా పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఆ సినిమా తరువాత..

ఆ సినిమా తరువాత..

కెరీర్ మొదట్లో శ్రీ ముఖి నటిగా కొన్ని ప్రయత్నాలు చేసి అనంతరం టివి షోలతో బిజీ అయ్యింది. ఇక జులాయి సినిమా ద్వారా శ్రీ ముఖి వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అందులో అల్లు అర్జున్ సోదరిగా సింపుల్ గా దర్శనమిచ్చిన శ్రీముఖి ఆ తరువాత కొన్ని అనవసరమైన ఆఫర్స్ ను వదిలేసుకుంది.

నెవర్ బిఫోర్..స్టిల్స్

నెవర్ బిఫోర్..స్టిల్స్

గతంలో ఎన్నోసార్లు గ్లామరస్ ఫొటో షూట్ లో కనిపించిన శ్రీముఖి ఇప్పుడు మాత్రం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనేలా షాక్ ఇచ్చిందని ఓ వర్గం వారు కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ విషయంలో శ్రీముఖి రోజురోజుకు డోస్ మరింత పెంచుతున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలలో బాగానే వైరల్ అవుతున్నాయి.

ఫిబ్రవరి 14న స్పెషల్ ఏంటి?

ఫిబ్రవరి 14న స్పెషల్ ఏంటి?

శ్రీముఖి ఈ ఫొటోలను రిలీజ్ చేయడమే కాకుండా త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పనుందట. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక గ్రేట్ న్యూస్ చెప్పడానికి సిద్ధం అవుతున్నాను అంటూ వినూత్నంగా ఫొటో షూట్ తో హీటెక్కించేంది శ్రీ ముఖి. ఏమైనా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతుందా అనే రూమర్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం శ్రీముఖి రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X