నత్తనడకన శ్రీముఖి కెరీర్.. కనీసం అదైనా కలిసొచ్చేనా..?

శ్రీముఖి అంటే.. బిగ్‌బాస్‌కు ముందు బిగ్‌బాస్ తరువాత అని చెప్పాల్సి వస్తుంది. ఈ షోలో పాల్గొనక ముందు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేది. బుల్లితెరపై ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోయే యాంకర్లలో శ్రీముఖి టాప్ ప్లేస్‌లో ఉండేది. పటాస్ షోతో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీముఖి.. రాములమ్మగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఈ పాపులారిటీనే బిగ్‌బాస్ షో వరకు తీసుకొచ్చింది.

 ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్..

ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్..

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకునే శ్రీముఖి.. పంచ్‌లతో అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంది. అయితే ఇదే క్రమంలో బిగ్‌బాస్ షోలోనూ కామెడీ చేస్తూ, డ్యాన్సులతో అందర్నీ ఆకట్టుకుంది. అక్కడి వరకు బాగానే ఉన్నా.. శ్రీముఖి అంటే అందరికీ నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడింది.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
అంతా నటనే అంటూ కామెంట్లు..

అంతా నటనే అంటూ కామెంట్లు..

హౌస్‌లో ఎవరైనా బాధపడినా వచ్చి ఓదార్చడం, అందరితో మంచిగా ఉండటం లాంటివి కేవలం నటనే అని, పుటేజ్ కోసమే చేస్తుందని మహేష్ లాంటి కంటెస్టెంట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే అభిప్రాయం బయట కూడా వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ను పదే పదే టార్గెట్ చేయడం, అతని విషయంలో ప్రవర్తించిన తీరు కూడా ఆమెపై నెగిటివిటీని పెంచేసిందని తెలుస్తోంది.

అందరూ బిజీగానే..

బిగ్‌బాస్ కంటెస్టెంట్లందరూ అంతో కొంతో బిజీగానే గడిపేస్తున్నారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ హిమజ, మళ్లీ వార్తలు చెప్పుకుంటూ శివజ్యోతి, సినిమా చాన్స్‌లు అందుకుంటూ అలీ రెజా, రాహుల్ ఇలా దాదాపు అందరూ బిజీగానే ఉంటున్నారు. రాహుల్ అయితే అటు సింగింగ్‌తో పాటు నటించేందుకు కూడా సిద్దమయ్యాడు. వరుణ్, వితికాలకు అంతకుముందున్న దానికంటే వందరెట్ల ఫాలోయింగ్ పెరిగింది.

శ్రీముఖి మాత్రం నత్తనడకన..

శ్రీముఖి మాత్రం నత్తనడకన..

రన్నర్‌గా నిలిచిన శ్రీముఖి కెరీర్ మాత్రం నత్తనడకన సాగుతోంది. బయటకు వచ్చిన శ్రీముఖి ఓ వారం పాటు మాల్దీవుల్లో ఎంజాయ్ చేసింది. అక్కడి నుంచి వచ్చాకైనా ఫుల్ బిజీ అవుతుందనుకుంటే అదీ లేదు. ఝాన్సీ చేసి వదిలిన షో (స్టార్ట్ మ్యూజిక్)ను శ్రీముఖి చేసేందుకు సిద్దమైంది. స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అంటూ వస్తోంది. మరి ఈ షోతో శ్రీముఖి మునుపటి క్రేజ్‌ను దక్కించుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. రేపటి నుంచి (డిసెంబర్ 5) ప్రారంభం కాబోతోన్న ఈ షో గురు, శుక్ర, శనివారాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రసారం కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X