Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్‌కు ఊహించని ఆఫర్.. గెలిచినా ఓడినా అది మాత్రం గ్యారెంటీ
సెన్సేషనల్ కంటెంట్‌తో క్రేజీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఇది ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని దేశంలోనే టాప్ రేటింగ్‌ను రాబడుతోంది. దీంతో ఏమాత్రం బ్రేకులు లేకుండా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను విజయవంతంగా ముగించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో ఓ ఊహించని పరిణామం జరిగింది. అసలేం జరిగింది? ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వారిలో 14 వారాలకు గానూ 13 మంది ఎలిమినేట్ అయిపోయారు. ఫలితంగా మిగిలిన ఆరుగురు శివాజి, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లు ఫైనలిస్టులుగా మిగిలారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17వ తేదీన జరగబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వారంలో కంటెస్టెంట్లకు సంబంధించిన జర్నీ వీడియోలను చూపించారు. ఆ తర్వాత ఏలియన్స్ వచ్చి కొన్ని పాత టాస్కులను ఇచ్చారు. వీటిలో గెలిచిన వాళ్లకు ఇంటి భోజనాలను కూడా అందించారు. ఆ తర్వాత కూడా హౌస్‌లో ఎన్నో ఫన్నీ టాస్కులను పెట్టి వినోదాన్ని పంచారు.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ మాజీ కంటెస్టెంట్లకు సంబంధించిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లను షూట్ చేసేశారు. శనివారం చాలా వరకూ షూటింగ్ జరపబోతున్నారు. ఇందులోనే చివరి మూడు స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయబోతున్నారు. అలాగే, హీరోయిన్లు ప్రదర్శనలను కూడా చిత్రీకరిస్తున్నారు.
బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం నిర్వహకులు ఎన్నో రకాల సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే వారం నుంచి ప్రారంభం కాబోతున్న 'సూపర్ సింగర్' షోకు సంబంధించిన ప్రమోషన్ కోసం మూడో సీజన్ రన్నర్, ప్రముఖ యాంకర్ శ్రీముఖి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి.. హౌస్‌లోని ఫైనలిస్టులతో సింగింగ్ ఆడిషన్స్ నిర్వహించింది. ఇందులో అమర్‌దీప్ చౌదరి పాట పాడి కామెడీని పంచాడు. ఆ తర్వాత అంబటి అర్జున్ 'కెవ్వు కేక' పాటను ఆలపించాడు. దీంతో అందరూ డ్యాన్స్ చేశారు. అనంతరం వాళ్లందరితో కలిసి శ్రీముఖి కొన్ని గేమ్స్ కూడా ఆడించింది. ఇదంతా సందడిగా సాగిపోయింది.
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన తర్వాత యాంకర్ శ్రీముఖి.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చింది. తాను ఎందుకు వచ్చానో వివరించిన తర్వాత ఆమె 'ప్రశాంత్.. ప్లీజ్ ఇది ఫన్ టాస్క్ మాత్రమే. ఇందులో నువ్వు ఓడిపోతే హగ్ ఇస్తాను. గెలిస్తే గట్టి హగ్ ఇస్తాను' అని చెప్పింది. దీంతో అతడు ఎప్పటిలాగానే సిగ్గు పడుతూ మురిసిపోయాడు.

ఆ తర్వాత శ్రీముఖి హౌస్‌లోని ఫైనలిస్టులతో 'ట్రూత్ ఆర్ డేర్' అనే టాస్కును కూడా ఆడించింది. ఇందులో ప్రిన్స్ యావర్ ఓ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఇక, ఈ ఎపిసోడ్‌లోనే శ్రీముఖి ఫైనలిస్టులకు రూ. 20 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











