నాకు ఆ ఫీలింగ్స్.. పెళ్లిపై ఓపెన్ అయిన యాంకర్ శ్రీముఖి..

అందాల ముద్దుగుమ్మ, యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం, చురుకుదనం ఈ మూడూ కలిసొచ్చిన అరుదైన టాలెంట్ ఆమెది. మాటల మాయతో, నవ్వుల వర్షంతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ బ్యూటీ 'పటాస్' కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన యాంకరింగ్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి, బుల్లితెరపై 'రాములమ్మ'గా ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం రియాల్టీ షోలు, స్పెషల్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లతో ఫుల్ బిజీగా గడుపుతున్న శ్రీముఖి తాజాగా పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

ఓటీటీ వేదికగా వినూత్నమైన రియాల్టీ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న జియో హాట్ స్టార్ ( JioHotstar) తాజాగా 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' (Mad For Each Other Reality Show)అనే కొత్త షోను అధికారికంగా ప్రకటించింది. ఈ షోకు డైరెక్టర్ అనిల్ రావిపూడి, సీనియర్ నటి రాధ, లయ జడ్జీలు వ్యవహరిస్తుండగా.. యాంకర్ శ్రీముఖి హోస్టుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మీడియా సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ షో కాన్సెప్ట్ గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు.

Sreemukhi Opens Up About Marriage at Mad For Each Other Launch Event

శ్రీముఖి మాట్లాడుతూ.. 'ఇది బిగ్‌బాస్ తరహాలో ఉండే రియాల్టీ షో. కానీ ఇందులో కేవలం కపుల్స్‌కే ఎంట్రీ ఉంటుంది' అని తెలిపారు. మొత్తం 70 రోజులు, 70 ఎపిసోడ్లుగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. వీకెండ్స్‌లో జడ్జెస్ వచ్చి ఎలిమినేషన్స్, రివ్యూలు నిర్వహిస్తారు. మిగతా ఐదు రోజులు తానే హోస్ట్‌గా వ్యవహరిస్తూ కపుల్స్‌కు టాస్కులు, స్కిట్లు, ఛాలెంజ్‌లు ఇస్తూ వినోదాన్ని పంచనున్నట్లు చెప్పారు. ఈ ప్రోగ్రాం జియో హాట్ స్టార్, స్టార్ మా లో స్ట్రీమింగ్ కూడా అవుతుందని వెల్లడించారు.

కపుల్స్‌ను మేనేజ్ చేయడం కష్టం!
ఇప్పటివరకు జరిగిన షూటింగ్ అనుభవాన్ని పంచుకుంటూ శ్రీముఖి 'ఇది నేను చేసిన రియాల్టీ షోలలో చాలా భిన్నమైనది. కపుల్స్‌ను మేనేజ్ చేయడం చాలా కష్టం. ప్రోమో చూస్తేనే మీకు అర్థమవుతుంది' అన్నారు. టాస్కులు, ఛాలెంజ్‌లు చాలా కొత్తగా డిజైన్ చేశారని, కేవలం కంటెస్టెంట్స్‌కే కాదు, హోస్ట్‌గా తనకూ ఇది చాలెంజింగ్‌గా ఉందని తెలిపారు. 'చాలెంజింగ్ అయినా నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నా' అని ఆమె నవ్వుతూ చెప్పారు.

పెళ్లిపై ప్రశ్న.. శ్రీముఖి సమాధానం!
షోలో మొత్తం కపుల్స్ ఉంటే మీరు సింగిల్‌గా ఎలా ఫీల్ అవుతున్నారు? ఎండ్ ఆఫ్ ది షోలో ఏదైనా సర్ప్రైజ్ ఉందా? అంటూ మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించారు. దీనికి శ్రీముఖి చిరునవ్వుతో స్పందిస్తూ.. 'ఎండ్ ఆఫ్ ది షోలో సర్ప్రైజ్ ఉంటుందేమో చూద్దాం' అని సమాధానం ఇచ్చారు.
ప్రోమోలో దర్శకుడు అనిల్ రావిపూడి తనను 'ఆఫ్ట్రాల్ అన్‌మ్యారీడ్' అని కామెంట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, 'నేను అలానే అన్‌మ్యారీడ్ గానే ఉంటాను' అంటూ సరదాగా చెప్పారు. అయితే వెంటనే 'ఇంతమంది రియల్ కపుల్స్ మధ్యలో ఉంటున్నాను కాబట్టి వెడ్డింగ్ బెల్స్ మోగుతాయేమో చూద్దాం' అంటూ ఇన్‌డైరెక్ట్‌గా సంకేతం ఇచ్చారు.

కపుల్స్ కెమిస్ట్రీ చూసి ఫీలింగ్స్!
షోలో పాల్గొంటున్న కపుల్స్ మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ చూస్తే 'నేనెందుకు పెళ్లి చేసుకోలేదు?' అనిపిస్తుందని చెప్పారు. అయితే అదే సమయంలో వారి మధ్య జరిగే గొడవలు చూస్తే 'నేను ఎంత హ్యాపీగా ఉన్నానో'అనిపిస్తుందని చెప్పి నవ్వేశారు. 'ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈ షో ద్వారా పెళ్లి గురించి చాలా నేర్చుకుంటున్నా. సరైన సమయం వస్తే వెడ్డింగ్ బెల్స్ మోగవచ్చు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో ప్రారంభోత్సవంలో శ్రీముఖి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షో ఎంత ఎంటర్టైన్ చేస్తుందో, అలాగే శ్రీముఖి జీవితంలో నిజంగానే వెడ్డింగ్ బెల్స్ మోగుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X