నా జీవితం నాశనం చేయాలని భారీ కుట్ర.. బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి
శ్రీముఖి పరిచయం అక్కర్లేని పేరు. కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో, భారీ ఫాలోయింగ్‌తో దూసుకెళ్తున్నారు శ్రీముఖి. సినిమాలు, ఈవెంట్స్, టీవీ ప్రోగ్రామ్‌లతో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది ఈ బ్యూటీ. ఏ ఛానెల్‌కు సంబంధించిన షో అయినా సరే శ్రీముఖి పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేస్తుందన్న పేరు తెచ్చుకుంది.
సెలబ్రిటీలు అంటే సహజంగానే రూమర్స్ వినిపిస్తుంటాయి. దీనికి శ్రీముఖి కూడా అతీతం కాదు. కొందరు స్టార్స్‌తో ఆమెకు లింక్ పెడుతూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడే తన ప్రేమ, బ్రేకప్ గురించి బయటపెట్టి తన గురించి వస్తోన్న రూమర్స్‌కు చెక్ పెట్టారు శ్రీముఖి. తాను ఎంతగానో ప్రేమించిన వ్యక్తితో విడిపోవడాన్ని తట్టుకోలేకపోయానని, ఆ డిప్రెషన్‌లో ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. ఇదే కాకుండా తనకు పలువురితో బ్రేకప్స్ జరిగాయని పలుమార్లు బయటపెట్టింది రాములమ్మ.

ప్రస్తుతం స్టార్ మాలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం, బీబీ జోడీ, నీతోనే డ్యాన్స్, కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్ తదితర షోలకు యాంకరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో గతేడాది ఆగస్ట్ నాటికే ఏకంగా 150 ఎపిసోడ్లను పూర్తి చేసుకోవడం విశేషం. దీనిని బట్టి ప్రస్తుతం 200 మార్క్‌ను పూర్తి చేసే దిశగా శ్రీముఖి దూసుకెళ్తోంది. ప్రతివారం బుల్లితెర సెలబ్రిటీలతో సందడి చేస్తూ వారితో ఆటలు ఆడిస్తూ అలరిస్తున్నారు శ్రీముఖి. ఈ వారానికి సంబంధించి ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమోను విడుదల చేశారు.
ఉగాదిని పురస్కరించుకుని సెలబ్రిటీల రాశి ఫలాలను ప్రదర్శించింది రాములమ్మ. ఒక్కొక్క కంటెస్టెంట్‌ను పిలిని వారి ఫలితాలను బయటపెట్టింది. తొలుత బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి రాగా.. నీకు ఈ ఏడాది ఆదాయం 11 ఉందంటూ శ్రీముఖి చెప్పడంతో అది ఎక్కువా? తక్కువా? అని అడిగింది అషురెడ్డి. చాలా ఎక్కువని రాములమ్మ చెప్పడంతో అషురెడ్డి సంబరాలు చేసుకుంది. తర్వాత రోహిణిని పిలిచి మీకు వ్యయం ఎంత ఉందో చూసేద్దామని చెప్పింది. చాలా తక్కువ ఉంటదేమోనని రోహిణి చెబుతుండగా.. ఏకంగా 14 ఉన్నట్లు స్క్రీన్‌పై కనిపించడంతో రోహిణి షాకై అక్కడే పడిపోయింది.
అనంతరం డాక్టర్ బాబును పిలిచి మీకు రాజపూజ్యం 2 ఉందని చెప్పింది. ఎందుకు అంత తక్కువుందని నిరూపమ్ షాక్ అవ్వగా.. మరి పేమెంట్స్ ఇవ్వకుండా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది రాజపూజ్యం అని రోహిణి సెటైర్లు వేయడంతో అంతా నవ్వేస్తారు. నిఖిల్, పల్లవి గౌడలను పిలిచి మీ ఇద్దరి జాతకాలు బాగానే ఉన్నాయి కానీ.. హరిగాడు రావడం వల్ల మారిపోయిందని అంటుంది శ్రీముఖి. ఇదంతా వద్దు.. అందరూ శ్రీముఖి పెళ్లి గురించి ఎదురుచూస్తున్నారు.. అవుతుందా? లేదా? అని హరి ప్రశ్నిస్తాడు. దాంతో నేను రెడీ అంటూ బుల్లితెర నటుడు శ్రీకర్ కృష్ణ చెబుతాడు. శ్రీముఖి పెళ్లి ఈ ఏడాది అవుతుందా లేదా? అని ఆడియన్స్‌ని అడగ్గా.. అవుతుందంటూ అందరూ గట్టిగా అరుస్తారు. ఎంతమంది నా జీవితం నాశనమైపోవాలని కోరుకుంటున్నారో అంటూ షాక్ అవుతుంది శ్రీముఖి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పెళ్లి గురించి శ్రీముఖి చెప్పిన సంగతుల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆదివారం ఉదయం 11 ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమాన్ని చూసేయాల్సిందే.


Click it and Unblock the Notifications

















