‘ఆమెతో అలా కోల్డ్‌వార్... జట్టు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్లాం’

తన అందం, చలాకీతనం, వాక్చాతుర్యంతో తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు శ్రీముఖి. ఎలాంటి షో అయినా అవలీలగా చేసుకుంటూ వెళ్తారు. బుల్లితెర కార్యక్రమాలతో పాటు సినిమా ఈవెంట్స్‌లోనూ సందడి చేస్తూ తన హవా సాగిస్తున్నారు. అప్పుడప్పుడు పలు సినిమాలలో మెరుస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా శ్రీముఖి నటించిన మూవీ మా ఇంటి బంగారం. టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీముఖి ఛాన్స్ కొట్టేశారు. జూన్ 19న మా ఇంటి బంగారం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

శ్రీముఖి మాట్లాడబోతుండగా.. అమ్మో చంద్రముఖి అంటూ ఆడియన్స్ కంగారుపడ్డారు. నాకు మైక్ వద్దా? టీవీలో లౌడ్ స్పీకర్‌ని కావొచ్చు సినిమాలో కోడలు పిల్లని, పెళ్లయ్యింది కాబట్టి కొంచెం మెల్లిగానే మాట్లాడతానని శ్రీముఖి చెప్పింది. ఎలా అంత సైలెంట్ క్యారెక్టర్ చేశావు? టీవీలో అంత వయలెంట్‌గా ఉంటావు కదా? కష్టంగా అనిపించిందా? అని యాంకర్ సమీరా భరద్వాజ్ ప్రశ్నించగా.. ఈసారి వయలెన్స్ సామ్‌కి ఇచ్చేసి, సైలెన్స్ నేను తీసుకున్నాను. చాలా కష్టంగా ఉంది సైలెంట్‌గా ఉండటం అని శ్రీముఖి చెప్పింది.

Sreemukhi Opens Up About Working with Samantha in Maa Inti Bangaram

చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీలో నటించావంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుంది? నీకేం అనిపించి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావని సమీరా అడగ్గా.. సమంత గారి పక్కన యాక్ట్ చేయడానికి కారణం అవసరం ఉండాలా అండీ. ఆవిడ పెద్ద కోడలు, నేను చిన్న కోడలు అనగానే ఫుల్ రివైలరీ ఉంటుందని చెప్పి ఓకే అన్నాను. ఈ సినిమాలో నటించడానికి కారణం ఈ బంగారమే. ఆమె ఫ్యాన్‌గానే కాకుండా.. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఆమె ఎంత బంగారమో మీ అందరికీ తెలుసు. ఆవిడ యాక్షన్ లైవ్‌లో చూద్దాము అని అనుకున్నాను. కానీ ఆవిడతో పాటు ఇలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్ వర్క్ చేయడం చాలా అదృష్టవంతురాలిని. నందినీ గారికి థ్యాంక్స్.. ఈ అవకాశం కల్పించినందుకు. రాజ్ గారు ఫ్యామిలీమెన్.. ఈ సినిమాలో రాజ్ సర్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ కాబట్టి ఇక రీజన్స్ అవసరం లేదని శ్రీముఖి పేర్కొంది.

సినిమాలో మీ ఇద్దరికీ కోల్డ్ వార్ ఉండదా? అని సమీరా భరద్వాజ్ అడగ్గా.. ఆల్‌మోస్ట్ జుట్లు పట్టుకునే వరకు వెళ్తాం కానీ ఏం జరుగుతుందో చూడాలంటే మీరు సినిమాలోనే చూడాలి. ఇద్దరికీ కొంచెం కూడా పడదు. సమంత గారి కమ్ బ్యాక్ కోసం సమంత గారి పూర్తి స్థాయి తెలుగు సినిమా కోసం ఎంతోమంది ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అందులో నేను కూడా ఒక అభిమానిని. మా ఇంటి బంగారంలో నవ్వించారు.. ఏడిపించారు.. ఫైట్స్ చేశారు. ఖచ్చితంగా మీ అందరి ప్రేమతో సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. సామ్ గారితో పాటు మీ అందరు బంగారాలు బాగుండాలి. జూన్ 19న మా ఇంటి బంగారం సినిమాని థియేటర్‌లో వచ్చి ఎంజాయ్ చేయండి అని శ్రీముఖి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు సమంతని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాండ్ దువ్వూరులు కలిసి మా ఇంటి బంగారం సినిమాను నిర్మించగా.. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X