‘బిగ్ బాస్’ నుంచి శ్రీముఖి ఔట్.. రూల్స్ బ్రేక్ చేసినందుకు శిక్ష.. వీడియో రిలీజ్ చేసిన స్టార్ మా

Recommended Video

#Sreemukhi ki siksha enti #BiggBossTelugu3

తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన 'బిగ్ బాస్' సీజన్ - 3 కొద్దిరోజుల క్రితం ప్రారంభమైంది. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా ఈ షోను మాత్రం అనుకున్న సమయానికే ప్రారంభించారు నిర్వహకులు. అయితే, బయట రచ్చ కామ్ అయిపోయినప్పటికీ, హౌస్‌లో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికి కారణం హౌస్‌మేట్స్ మధ్య పెరుగుతున్న వివాదాలే. బాస్ ఇచ్చే టాస్కులు చేసే క్రమంలో కొందరు సిరియస్ అవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీముఖిని ఇంటి నుంచి బయటకు పంపబోతున్నారని ఓ వార్త బయటకు వచ్చింది.

కెప్టెన్సీ టాస్క్ రచ్చ

కెప్టెన్సీ టాస్క్ రచ్చ

ప్రస్తుతం ఇంట్లో వరుణ్ సందేశ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే వారం నాయకత్వం వహించడానికి జరిగే టాస్క్‌ మంగళవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా కొందరు కంటెస్టెంట్లు దొంగలుగా, ఇద్దరు పోలీసులుగా, ఒకరు లాయర్‌గా, మిగిలిన వారు ఇంటి సభ్యులుగానే ఉండాలని బిగ్ బాస్ సూచించాడు. దొంగలు డబ్బులు దోచుకోవాలి. అలా ఎవరి దగ్గర ఎక్కువుంటే వాళ్లే గెలిచినట్లని చెప్పాడు.

ముగ్గురు దొంగలు

ముగ్గురు దొంగలు

శ్రీముఖి, రవికృష్ణ, అషురెడ్డి దొంగలుగా ఉన్నారు. వీరు హౌస్‌మేట్స్ నుంచి డబ్బులు, నగలు దొంగిలించాల్సి ఉంటుంది. వీరిలో శ్రీముఖి తెలివిగా ఆడుతోంది. ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్‌ను మాటల్లో పెట్టి జోబులో ఉన్న డబ్బుని కొట్టేసింది. ఆ తర్వాత నగలు కూడా కాజేయాలని ప్లాన్ చేసింది.

మహేశ్ ఇచ్చిన ఐడియాతో..

మహేశ్ ఇచ్చిన ఐడియాతో..

టీంలో ఉన్న రవిక్రిష్ణను జైలులో వేయడంతో శ్రీముఖి, అషులు గేమ్ ఆడటం కోసం కష్టపడ్డారు. ఈ నేపథ్యంలో హౌస్‌మేట్స్‌లో ఒకడైన మహేశ్ విట్టా.. తెగించి ఆడాలని శ్రీముఖికి సలహా ఇచ్చాడు. అంతేకాదు, జిమ్ ఏరియాలోని డంబెల్ తీసుకెళ్లి నిధి ఉన్న బాక్స్‌ను పగలగొట్టమని కూడా చెప్పాడు. దీంతో ఆమె అదే చేసింది. ఆ సమయంలో రవికృష్ణకు గాయమైంది.

బిగ్ బాస్ సీరియస్

శ్రీముఖి చేసిన పనిని చాలా మంది హౌస్‌మేట్స్ తప్పుబట్టారు. వితిక, రాహుల్ వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. దీంతో ఆ ఎపిసోడ్‌ను ముగించారు. అయితే, గురువారం జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. అందులో ‘శ్రీముఖి.. బిగ్ బాస్ ఇంటి నియమాలను దృష్టిలో ఉంచుకుని.. అందుకు శిక్షగా మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు పంపడానికి...' అంటూ సస్పెన్స్‌కు తెరలేపాడు.

శ్రీముఖిని పంపుతారా?

శ్రీముఖిని పంపుతారా?

ఈ ప్రోమో చూసిన తర్వాత నిబంధనల ప్రకారం శ్రీముఖిని బయటకు పంపేస్తారని అంటున్నారు. అయితే, తమన్నాను కూడా ఇదే కారణంతో పంపేయాలి కదా.. ఆమెను పంపనప్పుడు.. శ్రీముఖిని కూడా పంపరు అని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రోమోతో షోపై ఆసక్తిని పెంచేశారు నిర్వహకులు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X