twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లుంగీ కట్టింది.. ‘భూం బద్దలు’ కొట్టేసింది.. దుమ్ములేపిన శ్రీముఖి

    |

    ఏదైనా పండుగ వస్తుందంటే చాలు బుల్లితెరపై ఈవెంట్‌లతో పోటీ ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతీ ఒక్క చానెల్ స్పెషల్ ఈవెంట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఎంతగానో ట్రై చేస్తుంటుంది. దాని కోసం స్పెషల్ ప్రణాళికలు, స్క్రిప్ట్‌లు రెడీ చేస్తుంటారు. అలా ఇప్పటికే వినాయక చవితి, దసరా, దీపావళి ఈవెంట్లను చూశాం. ఇక న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా కొత్త ఈవెంట్లు రెడీ అవుతున్నాయి.

    రెండు ఈవెంట్ల ప్రోమోలు..

    రెండు ఈవెంట్ల ప్రోమోలు..

    ఈటీవీలో ఢీజే అనే ఈవెంట్ రెడీ అవుతోంది. జబర్దస్త్, ఢీ షోల మధ్య ఏదో వార్ క్రియేట్ చేసి ఈవెంట్‌ను కాస్త వెరైటీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోలు బాగానే క్లిక్ అయ్యాయి. ఇక జీ తెలుగులో పార్టీకి వేళాయేరా అనే ఈవెంట్ రాబోతోంది. దీని ప్రోమోలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి.

     శ్రీముఖి రచ్చ..

    శ్రీముఖి రచ్చ..

    శ్రీముఖి ప్రస్తుతం జీ తెలుగులో రచ్చ రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. బొమ్మ అదిరింది షోలో శ్రీముఖి వేసే స్టెప్పులు, చేసే కామెడీ అందరికీ తెలిసిందే. జీ తెలుగులో చేసే ఈవెంట్లలో శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. దసరా ఈవెంట్ అయితే ఏకంగా శ్రీముఖి మీదే చేసేశారు.

    చిలసౌ అంటూ..

    చిలసౌ అంటూ..

    చి ప్రదీప్ చిలసౌ శ్రీముఖి అంటూ దసరా ఈవెంట్‌ను బాగానే చేశారు. అందులో శ్రీముఖి, ప్రదీప్‌ను మెయిన్ లీడ్‌గా పెట్టి బాగానే నడిపించారు. కానీ బిగ్ బాస్ సమంత దెబ్బకు ఈ ప్రోగ్రాం అట్టర్ ఫ్లాప్ అయిందనుకోండి. అది వేరే విషయం. తాజాగా మరోసారి న్యూ ఇయర్ ఈవెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్నారు.

    జీ కుటుంబం..

    జీ కుటుంబం..

    పార్టీకి వేళాయేరా అంటూ జీ కుటుంబం మొత్తం రాబోతోంది. జీ తెలుగు ధారా వాహిక నటీ నటులందరూ ఈ ఈవెంట్‌లో రచ్చ చేయనున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వదిలిన ప్రోమోలు చూస్తుంటే రచ్చ రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో బొమ్మ అదిరింది టీం సందడే ఎక్కువగా కనిపిస్తోంది.

    భూం బద్దలంటూ మాస్ డ్యాన్స్...

    భూం బద్దలంటూ మాస్ డ్యాన్స్...

    మాస్ మహారాణిగా శ్రీముఖి అవతారమెత్తింది. లుంగీ కట్టుకుని భూం బద్దలంటూ అదిరిపోయే మాస్ సాంగ్‌కు స్టెప్పులు వేసి దుమ్ములేపింది. ప్రస్తుతం మాస్ స్టెప్పులకు సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇక ప్రోమోలోనే శ్రీముఖి ఇలా ఊపేసిందంటే.. ఈవెంట్‌లో ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి.

    English summary
    Sreemukhi Performance For Bhoom Bhaddhal Song In Party Ke velayara,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X