బుల్లితెరపై శ్రీ ముఖి రాజకీయాలు.. విష్ణుప్రియ, సుధీర్ కెమిస్ట్రీ చెడినట్లేనా?

బుల్లితెరపై ఒక్కసారి క్లిక్కయితే చాలు ఏదో ఒక విధంగా కెరీర్ ని రియాలిటీ షోలతో నెట్టుకు రావచ్చు. ప్రస్తుత కాలంలో కొంతమంది బుల్లితెర స్టార్స్ తీరిక లేకుండా రియాలిటీ షోలతో కాలాన్ని గడిపేస్తున్నారు. లాక్ డౌన్ లో కూడా వీరి ఆదాయానికి కొదవ లేదు. ఎందుకంటే గ్రూపులుగా మారి డిజిటల్ వరల్డ్ లో జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నారు.

లాక్ డౌన్ తరువాత..

లాక్ డౌన్ తరువాత..

ఇకపోతే లాక్ డౌన్ అనంతరం బుల్లితెరలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందట. ప్రస్తుతం మినీ స్క్రీన్ వెనుక రాజకీయాలు మొదలైనట్లు తెలుస్తోంది. చాలా వరకు ఈటీవీకి సంబంధించిన ప్రోగ్రాంలకు ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని షోలలో యాంకర్స్ కూడా మారే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

శ్రీముఖి పాలిటిక్స్..

శ్రీముఖి పాలిటిక్స్..

పటాస్ షోతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న హాట్ యాంకర్ శ్రీ ముఖి బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పటాస్ కి దూరంగా ఉంటున్న శ్రీ ముఖి యూ ట్యూబ్ ద్వారానే ఆదాయాన్ని అందుకోవాలని బుల్లితెర వెనక కొన్ని పాలిటిక్స్ నిర్వహిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

సుధీర్ షోకు దెబ్బ..

సుధీర్ షోకు దెబ్బ..

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తో పాటు పోవే పోరా అంటూ మరో షోతో యూత్ లో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే అయితే ఆ షో ఇప్పుడు ఆగిపోయే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ ముఖి మధ్యలో చేరి విష్ణు ప్రియను అతనికి దూరం చేస్తోందట. విష్ణు ప్రియకు మంచి ఆఫర్ ఇస్తానని చెప్పి ఆమెను షోలకు దూరం చేస్తున్నట్లు టాక్ వస్తోంది. కొన్ని ప్లాన్స్ సెట్ చేసుకున్న శ్రీ ముఖి కొంతమందితో కలిసి స్పెషల్ ప్రోగ్రామ్ ని సెట్ చేసుకుందట.

Recommended Video

Rajamouli Reveals His Next movie Details After RRR
 డిజిటల్ వరల్డ్..

డిజిటల్ వరల్డ్..

శ్రీ ముఖితో పాటు విష్ణు ప్రియ, మాస్ అవినాష్ అలాగే మరికొందరు డిఫరెంట్ ఐడియాలతో డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో మంచి క్రేజ్ అందుకోవచ్చని ఒక టీమ్ గా వర్క్ చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారట. లాక్ డౌన్ అనంతరం షోల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియసు కాబట్టి సైలెంట్ గా ఇలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X