సమంత దెబ్బకు శ్రీముఖికి నో ఆప్షన్... మా ఇంటి బంగారంతో ఇరుక్కున్న స్టార్ యాంకర్!

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్లలో ఒకరిగా దూసుకెళ్తున్నారు శ్రీముఖి. టెలివిజన్ షోలు, ఇంటర్వ్యూలు, ఇతర ఈవెంట్స్‌తో బిజీగా ఉంటున్నారు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా సమంత హీరోయిన్‌గా వచ్చిన మా ఇంటి బంగారంలో చిన్న కోడలిగా ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు శ్రీముఖి. ఈ సినిమాలో నటనకు గాను శ్రీముఖికి మంచి గుర్తింపు వస్తోంది. 30 క్రాస్ చేసినా ఇప్పటికీ పెళ్లి మాటెత్తకపోవడంతో ఆమె అభిమానులు త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ కోరుకుంటున్నారు. అయితే మా ఇంటి బంగారంతో తన పెళ్లికి ముడిపెట్టిన శ్రీముఖి ఇప్పుడు నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు. ఏం జరిగిందంటే?

కొద్దిరోజుల క్రితం జరిగిన మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్‌ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతూ సమాధానాలు రాబట్టారు యాంకర్ సుమ కనకాల. ఈ క్రమంలోనే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని శ్రీముఖిని ప్రశ్నించింది. మా ఇంటి బంగారం సక్సెస్ అయిన వెంటనే చేసుకుంటానని శ్రీముఖి ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత వేదిక మీద మాట్లాడుతూ.. సమంత నిజంగా మేలిమి బంగారం, ఈ జనరేషన్‌లోనూ ఆమె లాంటి అమ్మాయిలు చాలామందిని ఇన్‌స్పైర్ చేస్తారు. మా ఇంటి బంగారంను జూన్ 19న థియేటర్స్‌లో అందరూ చూడండి. పనిలో పనిగా ఈ చిన్న కోడలిని కూడా ఆశీర్వదించండి, ఈ వేళా విశేషంలో మన పెళ్లి కూడా జరిగిపోవాలని కోరుకుంటున్నానని శ్రీముఖి చెప్పడంతో ఆడిటోరియం అరుపులు, కేకలతో నిండిపోయింది. పెళ్లి గురించి శ్రీముఖి త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారని అంతా భావించారు.

Sreemukhi Reaction On Marriage Promise After Maa Inti Bangaram Success

కట్ చేస్తే.. జూన్ 19న విడుదలైన మా ఇంటి బంగారం ఘన విజయం సాధించింది. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా ఏకంగా 13.15 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. కేవలం 4 రోజుల్లోనే 50 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో 41.43 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 18 కోట్ల రూపాయలను వసూలు చేసి వరల్డ్ వైడ్‌గా 60 కోట్ల రూపాయల మైల్ స్టోన్ క్రాస్ చేసింది. సమంత దూకుడు చూస్తుంటే సోలోగా తన ఖాతాలో 100 కోట్ల రూపాయల మూవీని వేసుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సినిమా ఘన విజయం నేపథ్యంలో ఇటీవల మా ఇంటి బంగారం సక్సెస్ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. సమంత, రాజ్ నిడిమోరు, నందినీ రెడ్డి, శ్రీముఖి, హిమాంక్ దువ్వూరులు కేక్ కట్ చేసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీముఖికి ఊహించని ప్రశ్న ఎదురైంది. మా ఇంటి బంగారం సక్సెస్ తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్నారు? మరి సినిమా సక్సెస్ అయ్యింది? పెళ్లెప్పుడు అని ఓ విలేకరి ప్రశ్నించగా.. బుక్ అయ్యావంటూ శ్రీముఖిని సమంత ఆటపట్టించింది.

దీనికి శ్రీముఖి సమాధానమిస్తూ పెళ్లి అనే క్వశ్చన్ నుంచి నేను ఎస్కేప్ కాలేను. దేవుడు కనుక రాసిపెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది. జరిగితే కనుక అప్పుడు అందరికీ తెలుస్తుందని శ్రీముఖి తెలివిగా తప్పించుకుంది. అయితే నెటిజన్లు మాత్రం శ్రీముఖిని వదలడం లేదు. త్వరగా పెళ్లి చేసుకోమంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటి వరకు ఏదోలాగా తప్పించుకుంటూ వచ్చిన శ్రీముఖి ఈసారి మా ఇంటి బంగారంతో ఇరుక్కుపోయిందని పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ గుడ్‌న్యూస్ ఎప్పుడు చెబుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X