Bigg Boss OTT మేకర్స్ కి షాకిచ్చిన టాప్ యాంకర్: అసలు ఏమైందంటే?
బిగ్ బాస్ షో దేశవ్యాప్తంగా హవాను చూపిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ కూడా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు నాగార్జున. అయితే ఈ సీజన్ కంటెస్టెంట్ ల వేటలో ఉండగా శ్రీముఖి షో రిజెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
తాజాగా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుందన్న విషయంతో పాటు మొత్తం కంటెస్టెంట్ల వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఈ ఐదు సీజన్లలో మగ కంటెస్టెంట్లు విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ కొద్ది రోజుల క్రితమే ముగియగా సన్నీ విన్నర్ గా నిలిచాడు. ఇక ఈ ఫినాలే వేదికపైనే షో నిర్వహకులు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ వన్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

ఇక ఈ షో త్వరలోనే మొదలు కానుందని వెల్లడించారు. ఆ తర్వాత కూడా హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా ఇదే విషయం గురించి మాట్లాడి అంచనాలు పెంచాడు. గత ఏడాదే హిందీ బిగ్ బాస్‌తో పాటు ఓటీటీ వెర్షన్‌ను కూడా మొదలైన విషయం తెలిసిందే. హిందీలో ప్రయోగాత్మకంగా వచ్చిన దీనికి అంత మంచి రెస్పాన్స్ అయితే రాలేదు. మామూలుగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించే ఈ షో ఓటీటీ వర్షన్ మాత్రం కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ఓటీటీ మొదలు పెట్టబోతున్నారు. ఆ ఓటీటీ వర్షన్ షోకి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయనున్నారు. ఈ షో హాట్‌స్టార్‌లో 24 గంటలూ ప్రసారం కాబోతుందని అంటున్నారు. బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎప్పుడు నుంచి ఈ షో మొదలు కాబోతుందా? అని ఎదురు చూస్తున్నారు.
బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం, బిగ్ బాస్ తెలుగు OTTలో భాగం కావడానికి యాంకర్ శ్రీముఖిని సంప్రదించారు. ఆమె ఇప్పటికే చేసుకున్న తన కమిట్‌మెంట్‌ల కారణంగా ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెబుతున్నారు. అంతే కాక ఈ సీజన్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కాబోతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనలు, ప్రోమోలు జనవరి చివరి వారం నుంచి వదలబోతున్నారని కూడా అంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే సెట్ వర్క్ కూడా జరుగుతోంది అని అంటున్నారు.
ఇక ఇక, బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కోసం మాత్రం ఊహించని విధంగా 14 మందిని తీసుకుని వస్తున్నారు. ఇక బాగా తక్కువ రెమ్యునరేషన్ లో దొరికే వారి కోసం ఈ బిగ్ బాస్ యాజమాన్యం వేటలో పడిందని అంటున్నారు. వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డి, గీతా మాధురి, యాంకర్ శివ మరియు మరికొంత మందితో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. వీరితో పాటు కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండబోతున్నాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











