‘ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’
స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తోంది. వారం వారం బుల్లితెర సెలబ్రిటీలతో యాంకర్ శ్రీముఖి ఆటా పాట ఆడిస్తూ జోష్ తీసుకొస్తున్నారు. వారానికొక సరికొత్త థీమ్‌తో ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ఈ వారానికి సంబంధించి శ్రీముఖి దావత్ పేరుతో వినూత్నంగా థీమ్ రెడీ చేశారు. తాజాగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయ్యింది ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి. విజయవాడకు చెందిన తమన్నా.. తెలుగు బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది. ఆ షోలోనే స్టార్ యాంకర్ శ్రీముఖితో పరిచయం ఏర్పడి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా మెలుగుతున్నారు. హౌస్‌లో ఉన్నది కేవలం రెండు వారాలే అయినప్పటికీ ఇద్దరి మధ్యా విడదీయరాని అనుబంధం ఏర్పడింది. శ్రీముఖి మనుషుల్ని చాలా ఈజీగా చదివేస్తుంది.. ఎదుటివాళ్లు ఎలాంటి వాళ్లు? పైకి ఎలా ఉన్నారు? లోపల ఎలా ఉన్నారు? అనేది అర్ధం చేసుకుంటుందని తమన్నా పలు ఇంటర్వ్యూలలో చెప్పింది.

నా బంధువులు, రక్త సంబంధీకులు దూరం పెడితే.. శ్రీముఖి నన్ను నా కుటుంబాన్ని దగ్గరకు తీసుకుని సొంత మనిషిలా చూసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే శ్రీముఖి నన్ను దత్తత తీసుకుంది. కరోనా తర్వాత నాకు అవకాశాలు తగ్గిపోయాయి.. ఆ సమయంలో చేతిలో డబ్బులు లేక చచ్చిపోదామనుకున్న దశలో శ్రీముఖి నన్ను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చేయమని చెప్పింది. నేను ఇల్లు కట్టుకంటున్నా అంటే డబ్బు సాయం చేసింది. నాకే కాదు చాలామందికి సాయం చేసిందని తన ఫ్రెండ్ గురించి తమన్నా గొప్పగా చెప్పింది. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రామ్‌కి వచ్చిన తమన్నా సింహద్రి.. శ్రీముఖి గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి తెలిపింది.
ప్రోమో ప్రారంభంలోనే బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది. శ్రీముఖితో కలిసి డ్యాన్స్ చేసింది. నీకొక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చానని తమన్నా చెప్పగా.. ఆమె పొట్టను టచ్ చేస్తూ ఇప్పుడే ఆ చిన్న గిఫ్ట్ వద్దని శ్రీముఖి చెప్పింది. ఆ గిఫ్ట్ కాదు.. వేరే గిఫ్ట్ తీసుకొచ్చానని అంటుంది తమన్నా. వెంటనే బాక్స్ ఓపెన్ చేయగా అందులో పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది. దానిని చంకలో పెట్టుకుని శ్రీముఖి అల్లరి చేస్తుంది. ఈ టైంలో మొగుడితో బెడ్ మీద ఉండాలి కానీ.. శ్రీముఖి బెడ్ మీద టెడ్డీ బేర్‌లు చాలా ఉంటాయని తమన్నా చెబుతుంది. ఆ మాటలు వినగానే శ్రీముఖి షాక్ అవుతుంది.
తమన్నా గారు.. మీకు శ్రీముఖికి మధ్య ఫ్రెండ్‌షిప్ అసలు ఎలా సెట్ అయ్యిందని అవినాష్ అడగ్గా.. బిగ్‌బాస్ నాకిచ్చిన పెద్ద గిఫ్ట్ శ్రీముఖి. నా ప్రపంచమే శ్రీముఖి. నాకంటూ ఒక సొంతిల్లు ఉండాలని నేను కోరుకున్నప్పుడు నేను ఇల్లు కట్టిస్తా? మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పమని చెప్పింది. మాటలు ఎంతో మంది చెబుతారు.. కానీ ఆ కల నెరవేర్చడం అనేది శ్రీముఖికే సాధ్యమని చెబుతూ తమన్నా కంటతడి పెట్టింది. దాంతో తమన్నాని శ్రీముఖి ఓదార్చుతూ నేను చేసింది చాలా నథింగ్. నేను ఒకటే ఒకటి చెబుతా.. తమన్నాని ఇంకా వాళ్ల అమ్మానాన్న, అన్నయ్య ఎందుకు చేరదీసుకోలేదో నాకు తెలియదు, నేను మాత్రం తనకి ఎప్పటికీ ఉంటానని మాటిస్తున్నానని శ్రీముఖి చెప్పింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శ్రీముఖి పెద్ద మనసుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications


