For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పిల్లలు కావాలపిస్తుంది అంటూ శ్రీముఖి రచ్చ: డాక్టర్ సర్టిఫికెట్ లీక్.. అలాగే ఉన్నావనడంతో పరువు పాయే!

  |

  తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తూ స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది లోకల్ బ్యూటీ శ్రీముఖి. సినిమా నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తనదైన శైలి హోస్టింగ్‌తో సందడి చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటోంది. అయితే, అప్పుడప్పుడూ తన వ్యవహార శైలితో విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలోకి అడుగు పెట్టిన శ్రీముఖి.. పిల్లలు కావాలపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలేం జరిగిది? పూర్తి వివరాలు మీకోసం!

  బుల్లితెరపై కనిపించని రాములమ్మ

  బుల్లితెరపై కనిపించని రాములమ్మ

  ఆ మధ్య పలు ఛానెళ్లలో వరుస షోలలో ఫుల్ బిజీగా గడిపిన శ్రీముఖి.. ఇటీవలి కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు. ‘బొమ్మ అదిరింది' తర్వాత ఆమె పెద్దగా ఏ షోనూ ఒప్పుకున్నట్లు కనిపించడం లేదు. కానీ, ఆ తర్వాత కొన్ని స్పెషల్ ఈవెంట్లలో మాత్రం కనిపించి సందడి చేసింది. శ్రీముఖి బుల్లితెరపై మాయం అవడంతో ఆమె అభిమానులు అందరూ నిరాశగా ఉన్నారు.

  ఆ షోలోకి ఎంట్రీ... ప్రదీప్‌కు ప్రపోజ్

  ఆ షోలోకి ఎంట్రీ... ప్రదీప్‌కు ప్రపోజ్

  చాలా రోజుల తర్వాత ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' అనే పిల్లల షోలో కనిపించింది బుల్లితెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి. వచ్చే వారం జరిగే ఎపిసోడ్‌ కోసం ఈమె ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, యాంకర్ ప్రదీప్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ ‘జగదేకవీరుడు' సినిమాలో దేవకన్యలా ముసుగుతో వచ్చిన ఆమె.. ఏకంగా లవ్ ప్రపోజ్ చేసింది. ఈ ప్రోమో కొద్ది రోజులగా వైరల్ అవుతోంది.

  శ్రీముఖి గాలి తీసేసిన కమెడియన్

  శ్రీముఖి గాలి తీసేసిన కమెడియన్

  వచ్చే ఆదివారం ప్రసారం అయ్యే ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' మెయిన్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో శ్రీముఖిని హైలైట్ చేసి చూపించారు. ముసుగు తీసిన తర్వాత ప్రదీప్ షాక్ అయ్యాడు. అప్పుడు శ్రీముఖి జడ్జ్‌గా ఉన్న అలీతో ‘ఆలీ గారూ నేను శ్రీదేవిలా లేనా చెప్పండి' అని అడిగింది. దీనికి అతడు ‘ఉన్నావ్ కానీ.. కొద్దిగా గాలి ఎక్కువైంది' అంటూ గాలి తీసేశాడు.

  పిల్లలు కావాలపిస్తుంది అంటూ రచ్చ

  పిల్లలు కావాలపిస్తుంది అంటూ రచ్చ

  ఈ ప్రోమోలో ఎంతో అల్లరి చేసిన శ్రీముఖి.. ఒక సందర్భంలో ‘పిల్లలు కావాలి.. పిల్లలు కావాలి అనిపిస్తుంది. అందుకే ఇక్కడకు వచ్చాను' అంటూ రచ్చ చేసింది. దీంతో అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేశారు. అప్పుడు అలీ మాట్లాడుతూ.. ‘పిల్లలు కావాలి అనగానే కెమెరామెన్లు అందరూ పక్కకు తిరిగి నీ వైపే చూస్తుండిపోయారు' అంటూ సెటైర్ వేశాడు. దీంతో అందరూ పక్కున నవ్వారు.

  ప్రదీప్ పెళ్లి హైలైట్.. డాక్టర్ సర్టిఫికెట్

  ప్రదీప్ పెళ్లి హైలైట్.. డాక్టర్ సర్టిఫికెట్

  ఇక, ఈ ప్రోమోలో యాంకర్ ప్రదీప్‌ను కూడా టార్గెట్ చేశారు. అతడి పెళ్లి గురించి ఏకంగా స్కిట్ కూడా చేసేశారు పిల్లలు. అందులో ఎన్నో విషయాలను ఫన్నీగా చూపించారు. ఈ స్కిట్ అయిన తర్వాత అలీ మాట్లాడుతూ.. ‘అందరూ నీ గురించి ఇలా మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. రీసెంట్‌గా నీకు డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు కదా' అంటూ బాంబ్ పేల్చేశాడీ కమెడియన్.

  Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
   అలాగే ఉన్నావనడంతో పరువు పాయే

  అలాగే ఉన్నావనడంతో పరువు పాయే

  ఈ ఎపిసోడ్‌లోకి గల్లీ బాయ్స్ సద్దాం హుస్సేన్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు శ్రీముఖి అతడితో ‘నాకు ప్రదీప్‌కు పెళ్లి చూపులు జరుగుతున్నాయి' అని చెబుతుంది. అప్పుడు సద్దాం ‘అక్కడ కూర్చుంటే ఆ పిల్లలకు తల్లి ఉన్నట్లు ఉన్నావు' అంటూ పరువు తీసేశాడు. ఆ సమయంలోనే ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆమె తల్లైతే.. ప్రదీప్ తండ్రిలా ఉన్నాడు' అంటూ కవర్ చేసేశారు.

  English summary
  Actress and Telugu Anchor Sreemukhi Recently Participated in Drama Juniors – The NEXT Superstar Show. She Did Shocking Comments on Childrens in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X