Don't Miss!
- Sports
INDvsAUS : భారత్‌తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఆ డ్యాన్సర్ చేసిన పనికి నోరెళ్లబెట్టిన శ్రీముఖి.. పులిహోర కలపడంలో జానీ మాస్టర్ కూడా తగ్గడం లేదు!!
అదిరింది వర్షెన్ 2.ఓ బొమ్మ అదిరింది నిజంగానే అలరిస్తోంది. అంతకు ముందు కంటే రెట్టింపు నవ్వులతో అందర్నీ నవ్విస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, లవ్ ట్రాకుల డోస్ కూడా బాగానే పెంచేశారు. ఢీ కంటెస్టెంట్ పండు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నక్కిలీసు గొలుసు పాటతో రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన డ్యాన్సర్ పండు బొమ్మ అదిరిందిలోనూ అదరగొడుతున్నాడు. అసలే శ్రీముఖి దగ్గరగా ఉండటంతో ఇంకాస్త రెచ్చిపోతోన్నట్టు కనిపిస్తోంది.

శ్రీముఖి క్రష్..
ఆ మధ్య కాష్ షోలో శ్రీముఖి అందరిముందే పండు అంటే ఇష్టమని చెప్పేసింది. లేడీ గెటప్ వేయకుండా బాగుండు పెళ్లి కూడా చేసుకునేదాన్ని అన్నట్టుగా అందరి ముందే చెప్పేయడంతో పండు కూడా తెగ ఫీలైపోయాడు. అది ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పిందో నిజంగా చెప్పిందో గానీ బొమ్మ అదిరింది షోలో మాత్రం ఇద్దరూ తెగ హల్చల్ చేస్తున్నారు.

ఆ లేడి డ్యాన్సర్‌కు ముద్దు..
డ్యాన్సర్ పండు బొమ్మ అదిరిందోలో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో మరింత రచ్చ చేయనున్నాడు. లేడీ డ్యాన్సర్ శ్రష్టి వర్మకు స్టైల్‌గా ముద్దు పెట్టడంతో శ్రీముఖి దెబ్బకు షాక్ అయింది. పండు చేసిన పనికి నోరెళ్లబెట్టి చూసేసింది.

జానీ మాస్టర్ కూడా..
ఇక పండు చేసిన పనికి జానీ మాస్టర్ స్టేజ్ మీదకు వచ్చి శ్రష్టి వర్మను ఎగాదిగా చూశాడు. దీంతో పండుకు కాలిపోయినట్టుంది. ఈమెను కూడా మాకు వదలరా అంటూ జానీ మాస్టర్‌పై సెటైర్లు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

చివరకు అదిరే పర్ఫామెన్స్..
భీష్మ సినిమాలో వాట్టే బ్యూటీ సాంగ్‌ను జానీ మాస్టర్ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో రష్మిక వేసిన వెరైటీ స్టెప్పులను శ్రష్టి వర్మే కంపోజ్ చేసింది. అదే పర్ఫామెన్స్‌ను పండు, శ్రష్టి వర్మ కలిసి చేశారు. ఆ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు.
Recommended Video

దసరా ఈవెంట్‌లోనూ..
ఇక ఇది ఈ లెవెల్‌లో ఉండగా.. దసరా ఈవెంట్ వేరే లెవెల్‌లో ఉండబోతోంది. చిరంజీవి ప్రదీప్.. చిలసౌ శ్రీముఖి అంటూ ఇద్దరి మధ్య ఏదో ఉందన్నట్టు క్రియేట్ చేసిన కాన్సెప్ట్‌లో నిహారిక, అనసూయ, జానీ మాస్టర్‌ల పర్ఫామెన్స్ అదిరిపోయేలా ఉంది. ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.