Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీముఖి అందమైన ఓ బర్రె.. అందరి ముందే పరువుదీసిన యాంకర్ ప్రదీప్
శ్రీముఖి ప్రదీప్ స్క్రీన్ మీద కనిపిస్తే అక్కడ సెట్లైరకు కొదవే ఉండదు. ఈ ఇద్దరి మధ్య అంతలా కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుంది కాబట్టే.. దసరా ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. దసరా ఈవెంట్ మొత్తం చిరంజీవి ప్రదీప్ చిలసౌ శ్రీముఖి అంటూ రచ్చ రచ్చ చేశారు. శ్రీముఖి అతి వినయం, అతి సిగ్గుతో షో మొత్తం డిజాస్టర్ అయింది కూడా. టీఆర్పీలో దసరా పోటీలో వెనుకపడింది. దానికి వేరే కారణాలెన్నో ఉన్నాయి. కానీ చివరకు ప్రదీప్ శ్రీముఖి ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అయింది.
Recommended Video
దీపావళికి ఇలా..
దసరా ఈవెంట్లో తెగ సిగ్గుపడిన శ్రీముఖి.. ప్రదీప్‌తో కెమిస్ట్రీ పండించేందుకు బాగానే కష్టపడింది. చిరంజీవ ప్రదీప్‌కు చిలసౌ శ్రీముఖి నమస్కరించి వ్రాయునది అంటూ షో మొత్తం విసిగించేశారు. చివరకు మళ్లీ తుస్సుమనిపించారు. ఈ షోకు సమంత బిగ్ బాస్ షో ద్వారా గట్టి దెబ్బ కొట్టింది. అందుకే దీపావళికి ప్రత్యేకంగా ఎలాంటి ఈవెంట్ పెట్టకుండా సరిగమప షోలో సందడి చేశారు.
శ్రీముఖి స్పెషల్ గెస్ట్..
సరిగమప సింగింగ్ ఐకాన్ షో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యశస్వీ కొండెపూడి అనే యువ గాయకుడి వల్ల ఈ షో ఫుల్ వైరల్ అయింది. హారిక నారాయణ ప్రదీప్ చంద్రబోస్ కోటి ఎస్పీ శైలజ వంటి వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ దీపావళి ఎపిసోడ్లో శ్రీముఖి ప్రత్యేక అతిథిగా వచ్చింది.
శ్రీముఖి గాత్రం..
సింగింగ్ షోకు గెస్ట్‌గా వచ్చింది కాబట్టి శ్రీముఖి పాట పాడినట్టుంది. అయినా శ్రీముఖి గాత్రాన్ని విని అందరూ ఆశ్చర్యపోయారు. దివాళి దీపాన్ని అంటూ అదిరిపోయేలా పాడింది. ఒకవేళ సింగర్ అయింటే మిగతా వారంతా కనపడకుండా పోయే వారు అంటూ శ్రీముఖి గాత్రాన్ని కోటి పొగిడాడు.
అందమైన బర్రె..
ఇక శ్రీముఖి ప్రదీప్ మధ్య పంచ్‌ల వర్షం కురిసింది. ఓ అభిమాని నీ బొమ్మ వేశాడంటా అని శ్రీముఖికి చూపించాడు ప్రదీప్. అది బర్రెలా ఉంది.. నేను ఎలా ఉన్నాను అంటూ శ్రీముఖి ఫైర్ అయింది. అవును సేమ్ ఉంది.. దాని పెదాలు చూడు నీవి చూడు అంటూ.. కౌంటర్ వేశాడు. బర్రె కంటే బాగున్నాయ్.. నువ్ అందమైన బర్రె అంటూ శ్రీముఖి పరువుతీసేశాడు.